ఆంధ్రప్రదేశ్‌

పరబ్రహ్మ స్వరూపుడు వెంకటేశ్వర అవధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 20: ఆచార్య బ్రహ్మ, వేద రత్నాకర వడ్లమాని వేంకటేశ్వర అవధాని పరబ్రహ్మ స్వరూపుడని పలువురు పండితోత్తములు కీర్తించారు. సింహాచలంలోని శ్రీ వేదానంద గురుకుల పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం వేంకటేశ్వర అవధానికి శృంగేరి పీఠాధిపతి అనంత శ్రీసచ్చిదానంద సరస్వతి మహాస్వామి చేతుల మీదుగా గండ పెండేర సన్మానోత్సవం స్థానిక శ్రీ రామానుజ కూటమిలో జరిగింది. ముఖ్య అతిథి సచ్చిదానంద సరస్వతి, మహా మహోపాధ్యాయ విశ్వనాథ సత్యనారాయణ ఘనాపాఠి, బ్రహ్మశ్రీ ప్రవా రామకృష్ణ సోమయాజిశర్మ, బ్రహ్మాశ్రీ నారాయణ గణేష్ భట్ పాలందే తదితర పండితులు వేంకటేశ్వర అవధానిని కీర్తించారు. దేశ విదేశాల నుండి సుమారు 250 మంది ఆయన శిష్య బృందం హాజరై తమ గురువును ఘనంగా సత్కరించారు. భారతీయ సంప్రదాయంలో వేద విద్యకి అత్యంత ప్రాధాన్యత ఉందని, అటువంటి విద్యలో 250 మందిని నిష్ణాతులను చేసి సమాజానికి అందించిన వేంకటేశ్వర అవధాని ధన్యుడని పండితులు కీర్తించారు. సన్మాన గ్రహీత వేంకటేశ్వర అవధాని మాట్లాడుతూ పండితులు, శిష్యులు తన పై చూపిన అ భిమానానికి ధన్యుడనని అన్నారు. ముందుగా వేంకటేశ్వర అవధాని దంపతులను అడివివరం పురవీధులలో రథంపై ఊరేగించారు. అంతకు ముందు సంప్రదాయ కార్యక్రమాలు శిష్య పరివారం ఘనంగా నిర్వహించింది. సింహాచలేశుని దేవాలయ ఆస్థానాచార్యులు డాక్టర్ టి పి. రాజగోపాల్, ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సాతులూరి సూర్యనారాయణాచార్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వెంకటేశ్వర అవధాని గండపెండేర సన్మానోత్సవంలో మాట్లాడుతున్న పీఠాధిపతులు

ఘనంగా
గరుడ సేవ
తిరుమలలో పౌర్ణమి గరుడసేవను సోమవారం టిటిడి అత్యంత వైభవంగా నిర్వహించింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ శ్రీస్వామివారు తన ఇష్ట వాహనమైన గరుడునిపై సువర్ణకాంతులతో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాలతో పాటు తమిళ, కేరళ రాష్ట్రాలకు చెందిన 200మంది నారాయిర పండితులు ల స్వామివారి వాహనం ముందు నాలాయిర దివ్యప్రబంధ పారాయణ చేశారు.