ఆంధ్రప్రదేశ్‌

ఆకివీడు కార్పొరేషన్ బ్యాంకులో 70 లక్షల విలువైన నగలు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూన్ 20: బ్యాంకులో రుణాల కోసం ఖాతాదార్లు కుదువపెట్టిన సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కార్పొరేషన్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఈ వ్యవహారం వెల్లడైనా, బ్యాంకు అధికార్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆకివీడు కార్పొరేషన్ బ్యాంకులో స్థానిక తెలుగుదేశం నాయకుడు ఒకరు తన భార్య పేరుమీద బంగారు నగలు తాకట్టుపెట్టి, రుణం తీసుకున్నారు. ఈనెల 17న ఆయన రుణం చెల్లించి, నగలు విడిపించుకోవడానికి బ్యాంకుకు వెళ్లారు. అయితే లాకరులో ఉండాల్సిన ఆయన నగలు కనిపించలేదు. దీనితో నిర్ఘాంతపోయిన బ్యాంకు మేనేజరు ఆయనకు సర్దిచెప్పి పంపించి, మొత్తం నగలను తనిఖీ చేయగా మొత్తం 19 రుణ ఖాతాలకు చెందిన నగలు మాయమైనట్టు గుర్తించారు. సాధారణంగా బంగారు రుణాలకు సంబంధించి ఒక్కో ఖాతాకు సంబంధించిన నగలు ఒక్కో సంచిలో ఉంచి, లాకరులో భద్రపరుస్తారు. అలా భద్రపరచిన సంచుల్లో 19 మాయమైనట్టు అధికార్ల పరిశీలనలో వెల్లడయ్యింది. ఇలా మాయమైన ఆభరణాల విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా. ఈమేరకు గత మూడు రోజులుగా పూర్తిస్థాయిలో విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికార్లు సోమవారం ఆకివీడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కార్పొరేషన్‌శాఖ జోనల్ అధికారి వారణాశి బాలాజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కడియాల అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. కాగా నగలు మాయమైన విషయం బయటకు పొక్కడంతో ఖాతాదార్లు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని నిలువరించారు.

బ్యాంకు ముందు ఆందోళనకు దిగిన ఖాతాదారులు