S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/22/2016 - 06:26

హైదరాబాద్, జూన్ 21: కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు-పాత నేతల మధ్య జరుగుతున్న కలహాలకు తెరదించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెరదించనుంది.

06/22/2016 - 06:25

గుంటూరు, జూన్ 21: కొండవీడు కోట ప్రాంతాన్ని మెగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కొండవీడు కోట ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ, దేవాదాయ, పురావస్తు, రోడ్లు భవనాలు తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.

06/22/2016 - 06:24

విజయవాడ, జూన్ 21: ఎన్టీఆర్ అర్బన్, రూరల్ గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులకు వీలైనంత మేలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖపై మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే రెండు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.

06/22/2016 - 06:23

హైదరాబాద్, జూన్ 21: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక అసెంబ్లీలో లైబ్రరీ, క్యాంటిన్ లేకుండా చేయవద్దని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శాసనసభ, శాసనమండలి ఎలా పనిచేస్తుందో, లోపల పనిచేసే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, బయటి నుండి వచ్చే అధికారులు, పొలీసు సిబ్బంది, మీడియా తదితరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెలగపూడిలో శాసనసభ నిర్మాణాలను చేపట్టాలని అన్నారు.

06/22/2016 - 06:22

తిరుపతి, జూన్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాతంత్ర భావసారూప్యత గల పార్టీలతో వర్గ ద్వేష పోరాటాలు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు జరిగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నిర్మాణ విస్తృత స్థాయి సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

,
06/22/2016 - 02:08

చిత్రం విజయవాలో యోగ చేస్తున్న చంద్రబాబు, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు

విశాఖ స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో యోగ సాధన చేస్తున్న కేంద్ర మంత్రి
అశోక్‌గజపతి రాజు, మంత్రి అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపి కంభపాటి హరిబాబు

06/22/2016 - 02:05

గుంటూరు, జూన్ 21: ఉద్యోగుల తరలింపుఖర్చు ప్రభుత్వానికి తడిసి మోపెడు కానుంది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. కాగా హెచ్‌ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు విశ్వసనీయ సమాచారం.

06/22/2016 - 02:03

గుంటూరు, జూన్ 21: మంత్రులు.. కార్యదర్శులు.. కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండటంలేదు.. చెప్పింది అర్థం చేసుకోకుండా సిన్సియారిటీ లేకుండా పనిచేస్తే ఎలా? అధికారులను సమన్వయం చేసుకోనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇన్‌చార్జి మంత్రిగా నియమించి ఉపయోగమేంటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

06/22/2016 - 02:02

విజయవాడ, జూన్ 21: ప్రతి నెలా ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పురపాలక సంఘాల్లో పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో 80 శాతం ప్రజల మద్దతు ఎన్నికల్లో తమకే లభించిందని, ప్రజల నుంచి అంతే మొత్తంలో సంతృప్తి ఫలితాలను కూడా రాబట్టాల్సి ఉందని ఆయన అన్నారు.

06/22/2016 - 02:01

తిరుమల, జూన్ 21: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇస్రో డైరెక్టర్లు మంగళవారం ఉదయం దర్శించుకుని బుధవారం నింగిలోకి ఎగరనున్న పి ఎస్ ఎల్వీ సి-34 నమూనాను స్వామివారి పాదాలచెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, అరుణ్, కలంగో, అనురుప్ నైవేద్య విరామ దర్శన సమయంలో నమూనా ఉపగ్రహంతో ఆలయంలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపగ్రహం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు.

Pages