ఆంధ్రప్రదేశ్‌

ఈ గోలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 21: మంత్రులు.. కార్యదర్శులు.. కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండటంలేదు.. చెప్పింది అర్థం చేసుకోకుండా సిన్సియారిటీ లేకుండా పనిచేస్తే ఎలా? అధికారులను సమన్వయం చేసుకోనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇన్‌చార్జి మంత్రిగా నియమించి ఉపయోగమేంటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల బదిలీల అంశానికి సంబంధించి మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తంచేశారు. సమన్వయానికి మీరెందుకు ప్రయత్నించడం లేదని పుల్లారావును నిలదీశారు. గుంటూరు, విజయవాడ మధ్య దూరం ఎంత ఉంది? మీరు వచ్చి కూర్చుని మాట్లాడటానికి తీరిక లేదా?, ఎందుకింత ఈగోలతో ఉన్నారో అర్థంకావడం లేదని మండిపడ్డారు. ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా.. మీరు పద్ధతి మార్చుకోవడం లేదు.. ఇంత సమన్వయలోపం ఉంటే రేపు ప్రజల వద్దకు ఎలా వెళ్తారన్నారు. ప్రభుత్వంలో మీకు నేను కౌనె్సలింగ్ నిర్వహించే పరిస్థితులు తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. మీరు నన్ను ఫాలో కాకుండా, సంప్రతింపులు జరపకుండా ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.