ఆంధ్రప్రదేశ్‌

ఇక లబ్ధిదారుడే డిజైనర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ఎన్టీఆర్ అర్బన్, రూరల్ గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులకు వీలైనంత మేలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖపై మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే రెండు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద చేపట్టే గృహ నిర్మాణాలకు గతంలో నిర్ణయించిన దానికంటే యూనిట్ వ్యయం బాగా తగ్గించాలని, ఇంతకుముందు ఈ పథకం కింద 275 చదరపు అడుగులుగా వుండే ఇంటి విస్తీర్ణాన్ని 300 అడుగులకు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి వెంటనే అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట ఒక సంస్థను ఏర్పాటుచేసి మున్సిపల్ శాఖతో కలిసి దానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. లబ్ధిదారుడే తన ఇంటిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కట్టుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనివల్ల గతంలో రూ.2.90 లక్షలుగా వున్న యూనిట్ వ్యయంలో రూ.65వేలు ఆదా అవుతుంది. లబ్ధిదారుడికి ఆ మేర రుణభారం కూడా తగ్గనుంది. రూ.1268.52 కోట్ల వ్యయంతో ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. బెనిఫియరీ లెడ్ రూరల్ హౌసింగ్ పథకం కింద కేంద్రం లక్షా 93వేల ఇళ్లను నిర్మించడానికి అంగీకరించిందని అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, మృణాళిని, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదరిశ దినేష్‌కుమార్, కమిషనర్ కెవి రమణ, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాయిప్రసాద్, రాజవౌళి పాల్గొన్నారు.