ఆంధ్రప్రదేశ్‌

లైబ్రరీ, క్యాంటిన్ లేకుండా చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక అసెంబ్లీలో లైబ్రరీ, క్యాంటిన్ లేకుండా చేయవద్దని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శాసనసభ, శాసనమండలి ఎలా పనిచేస్తుందో, లోపల పనిచేసే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, బయటి నుండి వచ్చే అధికారులు, పొలీసు సిబ్బంది, మీడియా తదితరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెలగపూడిలో శాసనసభ నిర్మాణాలను చేపట్టాలని అన్నారు. మంగళవారం నాడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెలగపూడి శాసనసభ , శాసనమండలి డిజైన్లను పరిశీలించారు. సాధారణ పరిపాలనా వ్యవస్థల అవసరాలు, చట్టసభలకు సంబంధించిన కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయని తదనుగుణంగా తాత్కాలిక శాసనసభను రూపుదిద్దాలని అన్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు, సభ అవసరాలకు అనుగుణంగా పనిచేయగలిగే వాతావరణాన్ని పాదుకొలపాలని సూచించారు. అటు శాసనసభ, ఇటు శాసనమండలి ఒకే భవనంలో ఏర్పాటు అవుతున్నందున సమావేశాలు ఏకకాలంలో జరిగే అవకాశం కూడా ఉంటుందని అలాంటపుడు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఇప్పటికే రూపొందించిన శాసనసభ నిర్మాణ నమూనాను పరిశీలించిన సభాపతి సభా నిర్వహణకు కావలసిన వసతుల గురించి చర్చించారు. తాత్కాలికమే అయినా ప్రస్తుతం వెలగపూడిలో చేపట్టే నిర్మాణాల్లో అన్ని వసతులూ ఉండాల్సిందేనని సభాపతి పేర్కొన్నారు.