S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/23/2016 - 12:07

కాకినాడ: కాపు ఉద్యమం కొనసాగించేలా తగిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు కాపు సంఘాల జేఏసీ నేతలతో ముద్రగడ పద్మనాభం నేడు భేటీ అవుతున్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంట్లో ఈ సమావేశాన్నా ఏర్పాటుచేశారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ముద్రగడ భావిస్తున్నారు.

06/23/2016 - 12:06

విజయవాడ: అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో విజయవాడలోని దుర్గగుడిలో బదిలీల పర్వం ప్రారంభమైంది. ఆగస్టులో పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణల కారణంగా ఇఇ, డిఇతో పాటు అయిదుగురు ఎఇలను బదిలీ చేశారు. అయిదుగురు అసిస్టెంట్ ఇవోలకు, 12 మంది సూపరింటెండెంట్లకు, అయిదుగురు అర్చకులకు స్థానచలనం కలిగింది.

06/23/2016 - 12:06

విజయవాడ: జూలై చివరి వారంలో ఒకే రోజు కోటి మొక్కలను నాటేందుకు రాష్ట్ర ప్రజలంతా సన్నద్ధంగా ఉండాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎర్రచందనం పరిరక్షణ, మొక్కల పెంపకం అంశాలపై ఆయన గురువారం సంబంధిత అధికారులతో ఇక్కడ సమీక్ష జరిపారు. అన్నిరకాల మొక్కలకూ ఎపి చిరునామా కావాలన్నారు. ఔషధ మొక్కలను విస్తారంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

06/23/2016 - 08:40

కాకినాడ, జూన్ 22: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు బుధవారం ఉదయం కిర్లంపూడిలోని తమ స్వగృహంలో ఉత్కంఠభరితమైన పరిస్థితుల నడుమ నిరాహార దీక్ష విరమించారు. కాపు జెఎసి నేతలు ముద్రగడ దంపతులకు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం సేవించే సమయంలో ముద్రగడ భార్య పద్మావతికి గొంతు సహకరించకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

06/23/2016 - 08:40

సూళ్లూరుపేట, జూన్ 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠ మరోసారి ఇనుమడించింది. భారత క్రికెట్ జట్టు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో గెలిస్తే ఎలా దేశం మొత్తం ఆనందపడతారో అలాగే ఈ విజయంతో యావత్ భారతావని పులకించిపోయింది. ఇస్రో తొలిసారి ఒకేసారి ప్రయోగించిన 20 ఉపగ్రహాలు దిగ్విజయంగా కక్ష్యలోకి చేరడంతో ప్రపంచ దేశాల్లో అరుదైన రికార్డు సాధించింది.

06/23/2016 - 06:53

నెల్లూరు/ సూళ్లూరుపేట, జూన్ 22: రోదసీ పరిశోధనలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇస్రో జేజేలు అందుకుంటోంది. ఒకే రాకెట్ ద్వారా ఏకంగా 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపి మన శాస్తవ్రేత్తలు సత్తా చాటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 34 మరోసారి విజయబావుటా ఎగురవేసింది.

06/23/2016 - 06:51

ఒంగోలు, జూన్ 22: భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలోని రైతులకు, డ్వాక్రామహిళలకు 34వేల కోట్లరూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బుధవారం ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మినీ స్టేడియంలో రెండో విడత రైతు రుణమాఫీ పత్రాలను ముఖ్యమంత్రి రైతులకు పంపిణీ చేశారు.

06/23/2016 - 06:50

విజయవాడ, జూన్ 22: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి వేల సంఖ్యలో 27లోగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్‌ల అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వేల తరలి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో వందల సంఖ్య లో ఆకాశ హర్మ్యాలు, వేల సంఖ్యలో ఫ్లాట్లు వెలిశాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో, ప్రధానంగా సచివాలయ పరిసరాల్లోని 29 గ్రామాలు, అలాగే జాతీయ రహదారి వెంబడి యుద్ధ ప్రాతిపదికన ఇవి వెలిశాయి.

06/23/2016 - 06:48

హైదరాబాద్, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లో 15మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్ర అదనపు డిజిపి (లీగల్) వినయ్‌కుమార్ రాయ్ జైళ్లు, కరెక్షనల్ సర్వీసులకు బదిలీ అయ్యారు.

06/22/2016 - 18:19

ఒంగోలు: గత ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేసిన సందర్భంగా రైతుల కష్టాలను స్వయంగా చూశానని, కొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే రుణమాఫీని అమలు చేస్తున్నామని ఆయన ఒంగోలులో బుధవారం రెండో విడత రుణమాఫీ పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా వివరించారు.

Pages