ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలే ఇంచార్జిలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు-పాత నేతల మధ్య జరుగుతున్న కలహాలకు తెరదించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెరదించనుంది. వైసీపీ నుంచి తెదేపాలో చేరిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు- ఎప్పటినుంచో కొనసాగుతున్న టిడిపి ఇంచార్జుల మధ్య గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెరదించి, ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇంచార్జిలుగా ఉంటారని సంకేతాలివ్వనున్నారు.
ఆపరేషన్ ఆకర్షలో భాగంగా వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల ఇబ్బందులు తొలగించడం ద్వారా, కొత్తవారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వ్యూహానికి లోకేష్ తెరలేపారు. అయితే ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి పెత్తనం ఎలా ఇస్తారని పాత నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. నేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్-కరణం బలరాం మధ్య వేదిక మీదనే యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా ఇంచార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు కూడా.. గెలిచిన ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారని, వారి ఆధ్వర్యంలోనే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతాయని, తనకు ముఖ్యమంత్రి ఆ విధంగా ఆదేశాలిచ్చారని, ఆ తర్వాత మీ ఇష్టమని ప్రకటించారు. దానిని కాదని ఎవరైనా సమావేశాలు నిర్వహించుకుంటే తర్వాత పరిణామాలకు తాను బాధ్యత వహించనని స్పష్టం చేయడం ప్రస్తావనార్హం. ఈ నేపథ్యంలో బాగా ముదురుపాకాన పడిన అద్దంకి, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, నంద్యాల, కదిరి, గిద్దలూరు వంటి ఐదారు నియోజకవర్గాలను మినహాయించి, మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలనే ఇంచార్జులుగా వ్యవహరిస్తారని నాయకత్వం ప్రకటించనుంది. ఆ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేస్తున్న పాత నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఐదారు నియోజకవర్గాల్లో ఉన్న పాత నేతలు సీనియర్లు కావడంతో, అక్కడ మధ్యేమార్గంగా వెళ్లి ఇద్దరి మనోభావాలు, సీనియారిటీని గౌరవించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై బాబు ఒక పార్ములా రూపొందించారని, ఆ ప్రకారంగా వ్యవహరించాలన్న ఆదేశాలిస్తారని పార్టీ ప్రముఖుడొకరు వెల్లడించారు.
దీనిపై చాలాకాలం నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తున్న బాబు-లోకేష్ ఈ తలనొప్పికి ఎక్కడో ఒకచోట తెరదించకపోతే, అది ముదిరి ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న భావనకు వచ్చారు. దానితో లోకేష్, నియోజకవర్గ ఎమ్మెల్యే-పాత ఇంచార్జులతో విడివిడిగా భేటీ అయి, ఇంచార్జిలపై స్పష్టత ఇస్తున్నారు. ఎవరి గౌరవం వారికే ఉంటుందని స్పష్టం చేస్తూనే, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో మీ ప్రాధాన్యం తగ్గదని, ఏదైనా సమస్య ఉంటే తనకు నేరుగా చెప్పాలని, మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని లోకేష్ పాత ఇంచార్జిలకు స్పష్టం చేస్తున్నారు.
అదే సమయంలో పాత ఇంచార్జి, నియోజకవర్గ నేతలను సమన్వయం చేసుకోవాల్సిందేనని, వారి సహకారం లేకపోతే ఇబ్బందులవుతాయని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇద్దరూ సమన్వయం చేసుకుని వెళ్లాల్సిందేనని, పార్టీకి సమస్యలు సృష్టిస్తే సహించేది లేదని లోకేష్ వారికి స్పష్టం చేస్తున్నారు.
కాగా లోకేష్‌ను కలిసే ముందు పార్టీ కార్యాలయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ కూడా ఇరువర్గాలకూ సమన్వయంపైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇద్దరూ కొట్లాడుకుంటే వైసీపీ లాభపడుతుందని, ఏదైనా సమస్యలుంటే లోకేష్‌కు వచ్చి చెప్పండని ఆయన సూచిస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి లోకేష్ విజయవాడ, హైదరాబాద్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు-పాత ఇంచార్జిలతో విడి విడిగా సమావేశాలు నిర్వహిస్తున్న కారణం ఇద్దరి మధ్య సమన్వయం కోసమేనంటున్నారు.