ఆంధ్రప్రదేశ్‌

వేద పాఠశాలల్లో ప్రవేశాలు సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 20: పిల్లల్లో వేదాల పట్ల మక్కువ పెంచేందుకు టిటిడి వేద పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను సరళతరం చేయాలని టిటిడి ఇవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మగిరి, కీసరగుట్ట, నల్గొండ, చిలుకూరు, ఐ.్భమవరం, విజయనగరం, కోటప్పకొండ వేద పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశ ప్రక్రియ, వౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై సాంబశివరావు తన చాంబర్‌లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోని 7 వేద పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను సరళతరం చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణ విధానం, పాఠ్యాంశాలు, మూల్యాంకనాలతో పాటు కామన్ సిలబస్ రూపొందించాలని ఇఓ సూచించారు.

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కోర్సులకు మరోసారి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలచేసి భర్తీ చేయాలన్నారు. వేద పాఠశాలల్లోని పలు శాఖలలో విద్యార్థులు చేరేందుకు వీలుగా వారి వయస్సును ఒక సంవత్సరం తగ్గించి, జూన్ 30వ తేదీ వరకు గడువు విధించి ప్రవేశ ప్రకటన విడుదలచేయాలన్నారు. వేద పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులలో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తిరుపతి జెఇఓ పోలాభాస్కర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేశారు. టిటిడి వేద పాఠశాలలోని 1100 మంది పండితులలో మెరుగైన వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలని సూచించారు. అటు పాఠశాలల్లో కల్పించాల్సిన వౌలిక సదుపాయాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వేద విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, ఆంగ్లాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయాలన్నారు. వీటితోపాటు అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వేద పాఠశాలలకు టిటిడి సహకారంతో వౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అందిస్తున్న పలు కోర్సులు, బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో జరుగుతున్న కృషి, తదితర అంశాలపై వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.ఇ దేవనాథన్‌తో టిటిడి ఇఓ చర్చించారు.