ఆంధ్రప్రదేశ్‌

లాభసాటి వ్యవసాయమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/మేడికొండూరు , జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌర్ణమి ఏరువాక కార్య క్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాగలితో దుక్కిదున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ఖరీఫ్ సీజన్‌లోనే గోదావరి జలాల తరలింపు ద్వారా కృష్ణాడెల్టాలో కనీసం 8 లక్షల ఎకరాల్లో వరి పంటను కాపాడుకోగలిగామని చెప్పారు. అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పారు. పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా గడపాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతులు రసాయన, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించేందుకు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించామంటూ గత ఏడాది ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా 25వేల మంది రైతుల పొలాల్లోని మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల్లో విశే్లషించామని, ఆపై సంబంధిత సాయిల్ హెల్త్‌కార్డులను రైతులకు అందించామని తెలిపారు.
నీరు-చెట్టుతో రైతులకు మేలు
మేడికొండూరు: రైతులను చైతన్యవంతులను చేసి వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టించటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమాన్ని ఆయన అరకదున్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోడెల మాట్లాడుతూ రైతులు గత ఏడాది వర్షాలు లేక, కాల్వల్లో నీరు అందక పంటలు కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆయా గ్రామాల్లో నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల్లో ప్రభుత్వం పూడికతీత పనులు చేపట్టిందన్నారు. ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పుష్కలంగా అందుతున్నాయన్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం తదితర వ్యవసాధార రంగాల అభివృద్ధిపైనా రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. నూతన రాజధాని నిర్మాణం విషయంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అనేక విధాలుగా పాటుతున్నారని కోడెల ప్రశంసించారు.

ఏరువాక సరే..
సాగునీరేదీ?
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 20: నారుమడులకు సాగునీటి విడుదలపై కచ్చితమైన తేదీలను ప్రకటించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పాత సంప్రదాయాలకు తెరలేపి ఏరువాక వేడుకలను మాత్రం వైభవంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రుల వరకు నాగళ్లకు ఎడ్ల జతల్ని కట్టి ఖరీఫ్ సీజన్ వచ్చేసినట్లేనంటూ రైతులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ప్రయత్నం చేశారు. అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాడెల్టా ఆయకట్టులో సాగునీటి కొరత వల్ల గత మూడు సీజన్లుగా రబీ సాగుకు తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చింది. గడచిన ఖరీఫ్ సీజన్‌లోనూ మొత్తం 13 లక్షల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆయకట్టులో సాగు జరగాల్సి వుండగా కేవలం ఏడెనిమిది లక్షల ఎకరాల్లోనే సాగు జరిగినప్పటికీ ఆశించిన మేర దిగుబడులు రాక రైతులు కుదేలయ్యారు. ఇక అన్నదాతలకు నిలయమైన కృష్ణా జిల్లా రైతన్నలను వ్యవసాయం కంటతడి పెట్టించింది. గత ఖరీప్ సీజన్‌లో కృష్ణా జిల్లావారీ సాధారణ విస్తీర్ణం 3 లక్షల 44వేల 932 హెక్టార్లు కాగా కేవలం 3 లక్షల 615 హెక్టార్లలోనే వరిసాగు జరిగింది. రబీ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం లక్షా 25వేల హెక్టార్లు కాగా కేవలం 10వేల హెక్టార్లలో వరి సాగు జరిగింది. అంటే అత్యధిక వ్యవసాయ భూములన్నీ దాదాపు బీళ్లుగా వుండిపోయాయి. రోహిణీ కార్తె చివరి పాదం జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడం, రెండో వారంలో పంట కాలువలకు నీళ్లు వదలటం, తక్షణం నార్లు పోయడం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది జూన్ నాలుగో వారంలోకి అడుగిడుతున్నా నారుమళ్ల పనులు ఊపందుకోలేదు. ఎగువనున్న జలాశయాల్లో దిగువకు వదిలేంత నీరు లేకపోవడంతో ఏడాది పొడవునా 12 అడుగుల నీటిమట్టంతో కళకళలాడుతూ ఉండాల్సిన ప్రకాశం బ్యారేజీ కానాలు నాలుగు అడుగులతో కునారిల్లుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడులో పట్టిసీమ ద్వారా 100 టిఎంసిల నీటిని డెల్టాకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది ఏమేర విడుదలవుతుందో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్‌లో కనీసం 13 లక్షల 50వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలైతే వేశారు కాని వరి నారుమళ్ల కోసం కాలువలకు ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో జిల్లాకే చెందిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటివరకు ప్రకటించక పోవటంతో రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు