S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/15/2019 - 21:23

ఒకరోజు లక్ష్మీ నిలయంలో కూర్చొని పెద్దాయన, చిన్నాయన.. అంటే యన్‌టి రామారావు, త్రివిక్రమరావులు సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటున్నారంటే, అక్కడ మరెవరూ ఉండరు.

06/15/2019 - 21:10

పెళ్లికి రెడీగానే ఉన్నాను. కాకపోతే -అమ్మాయివైపు నుంచే ఇంకా క్లియరెన్స్ రాలేదు -అంటున్నాడు హీరో రాజ్‌తరుణ్. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానంటూ ఈమధ్య గుట్టువిప్పిన రాజ్‌తరుణ్, వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కే అవకాశం లేకపోలేదంటూ చెప్పకనే చెబుతున్నాడు. ఇంతకాలం లవర్ డీటెయిల్స్‌ను సీక్రెట్‌గా ఉంచిన రాజ్‌తరుణ్, తాజాగా ఆమె సమాచారానికి సంబంధించి కొన్ని క్లూలు ఇస్తున్నాడు.

06/15/2019 - 21:07

1973 డిసెంబర్ 14న ‘ఎర్రకోట వీరుడు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఎగబడ్డారు. బొమ్మపడింది. సినిమా మొదలైన ఇరవై నిమిషాల తరువాత తెరపై ఎన్టీఆర్ కనబడ్డారు. ఆయన డైలాగ్ చెప్పడం మొదలెట్టగానే -ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెవులు రిక్కించి మళ్లీ శ్రద్ధగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు విన్నారు. కాసేపటికి అర్థమైపోయింది. అది ఎన్టీఆర్ వాయిస్ కాదని.

06/08/2019 - 21:14

శోభన్‌బాబు ఆకస్మిక మరణం.

06/08/2019 - 21:11

‘అభినందన’ ఒక సర్వసాధారణ ప్రేమకథా చిత్రం. రంగుల స్వప్నం- సుమధుర శృంగార రసమయ దృశ్యకావ్యం. ఈ స్వప్నం నిర్మాత ఆర్‌వి రమణమూర్తిదైతే... దాన్ని మనకందించిన దర్శకుడు అశోక్‌కుమార్. ఈ సినిమాలో ఆణిముత్యాల్లాంటి ఎనిమిది పాటలు చోటుచేసుకున్నాయి. మాటల, పాటల రచనలో సవ్యసాచిగా పేరొందిన ఆచార్య ఆత్రేయ చక్కటి సంభాషణల్ని... వాటికి నప్పేలా జనంమెచ్చేలాంటి చక్కని పాటల్ని సమకూర్చారు.

06/08/2019 - 21:11

‘అంతస్తులు’ చిత్రం కోసం మనసుకవి ఆచార్య ఆత్రేయ కలం నుంచి, మామ సంగీత సారథ్యంలో, విక్టరీ మధుసూధనరావు నిర్దేశకత్వంలో రూపుదిద్దుకున్న పాట -నువ్వంటే నాకెందుకో ఇంత ఇది. తెలుగువాళ్ల నోట రమారమి ఐదు దశాబ్దాలకు పైగా ఈ పాట వినిపిస్తూనే ఉంది.

06/01/2019 - 22:10

స్మిత (విజయలక్ష్మి)ని ముందు సాలగ్రామం అపర్ణ ఇంట్లో చూశాను. అపర్ణ చిన్నచిన్న వేషాలు వేస్తుండేది. విజయలక్ష్మి ఆ ఇంట్లో చిన్నపనీ, పెద్దపనీ చేస్తుండేది. సినిమాల్లో ఏవైనా వేషాలుంటే చెప్పండి’ అంటూ ప్రాధేయపడేది.

06/01/2019 - 22:05

ఎక్కడో కన్నడ దేశంలో పుట్టింది ఇంద్రాణి 1942లో. కేశవరాజు, కృష్ణవేణి దంపతుల ముద్దుల పుత్రిక. నలుగురు అన్నదమ్ములు, ఒక అక్క. నాలుగో తరగతి వరకే చదువుకుంది. కారణం -ఆమె ఆలోచనలు పద విన్యాసం కంటే పాద విన్యాసం చుట్టూనే తిరుగుతుండేవి. బాల్యం నుంచే నృత్యమంటే అభిమానం. ఆమెకది -దైవ సమానం. చూసే కళ్లకు మాత్రం అదో పిచ్చి. ఎవరేం అనుకుంటేనేం అనుకున్నారో ఏమో -వేసే తొలి అడుగుల్లోనే విన్యాస అనుభూతి పొందేది ఆమె.

06/01/2019 - 21:44

1959లో భాస్కర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం -మనోరమ. కెమెరాతోపాటు దర్శకత్వం కమల్ ఘోష్ నిర్వహించారు. గిరిజలాంటి చిన్నది బాలయ్యలాంటి చిన్నవాడిని ప్రేమిస్తుంది. తీరా పెళ్లివరకూ వచ్చాక.. తను వెళ్లిపోతే ముసలి తండ్రి, చిన్న తమ్ముడూ ఏమైపోతారోనని బెంగపెట్టుకుంటుంది. దీనిపై నిర్ణయం కోసం స్నేహితురాలు కృష్ణకుమారితో మాట్లాడుతుంది. తరువాత -బాలయ్యతో పెళ్లి వద్దనుకుంటుంది.

06/01/2019 - 21:42

ఆగవోరుూ/ఆగవోరుూ/ఆగవోరుూ/ఆగవోరుూ...
త్యాగం ఇదియేనా/ హృదయం శిలయేనా... ఏల ఈ మోసం -ఈ మకుటంతో మొదలెట్టిన పాట బాబూ మూవీస్ ‘మంచి మనసులు’ అనే సాంఘిక చిత్రంలోనిది. సాంఘిక జీవనంలో ఓ కుటుంబానికి అద్దంపట్టిన చిత్రరాజమిది. ఈ చిత్రాలన్నీ ఇంతతీరుగా తీర్చిదిద్దిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.

Pages