Others

అభినందన (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అభినందన’ ఒక సర్వసాధారణ ప్రేమకథా చిత్రం. రంగుల స్వప్నం- సుమధుర శృంగార రసమయ దృశ్యకావ్యం. ఈ స్వప్నం నిర్మాత ఆర్‌వి రమణమూర్తిదైతే... దాన్ని మనకందించిన దర్శకుడు అశోక్‌కుమార్. ఈ సినిమాలో ఆణిముత్యాల్లాంటి ఎనిమిది పాటలు చోటుచేసుకున్నాయి. మాటల, పాటల రచనలో సవ్యసాచిగా పేరొందిన ఆచార్య ఆత్రేయ చక్కటి సంభాషణల్ని... వాటికి నప్పేలా జనంమెచ్చేలాంటి చక్కని పాటల్ని సమకూర్చారు. అంతేస్థాయిలో లయరాజా ఇళయరాజా చక్కటి బాణీలను అందిస్తే, వాటికి జానకి, ఎస్‌పి బాలు తమగళంతో ప్రాణం పోశారు. తెరమీద కథానాయకుడు కార్తీక్, కథానాయిక శోభన తమ నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.
అదే నీవు...అదే నేను... అదే గీతం...; చుక్కలాటి అమ్మాయ చక్కనైన అబ్బాయ..; ఎదుట నీవే... ఎదలోనా నీవే; మంచు కురిసే వేళలో..; ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం..; ప్రేమ లేదని ప్రేమించరాదని..; రంగులలో కలలో- ఎద పొంగులలో కళవో -ఇవీ ఆ అద్భుతమైన రసగుళికలు.
ఇంతకీ ఆట (సినిమా) గురించి చెప్పకుండా పాటల గురించి చెప్తున్నాడేంటాని విసుక్కోకండి. ఈ సినిమాలో పాటలకి పెద్దపీట వేసి తీరవలసిందే. ఆచార్య ఆత్రేయ సంభాషణలు ఆటని ముందుకి నడిపిస్తే.. వాటిని గుఱ్ఱపు స్వారీలా పాటలు శుభానికి పరిగెత్తిస్తాయి చివరాకరికి.
సినిమా తెరమీద జెవి సోమయాజులు, కథానాయక పాత్రలో కార్తీక్, కథానాయకి పాత్రలో శోభన, సహాయక పాత్రలుగా శరత్‌బాబు, రాజ్యలక్ష్మి ప్రభృతులు పాత్రోచితంగా అభినయించారు అభినందన చిత్రంకోసం. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అశోక్‌కుమార్.. ఆర్‌వి రమణమూర్తి రంగుల స్వప్నాన్ని పండించి ఆంధ్ర ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా చేసి నిర్మాతని కృతకృత్యుణ్ణి చేశారు.
అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకుల అభినందనయే కాకుండా రాష్ట్ర ప్రభుత్వపు అభినందన... ప్రశంస లభించింది. ఉత్తమ చిత్రంగా ఎంపికై నంది అవార్డు సొంతం చేసుకుంది. ‘రంగుల కలలో’ గీతానికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకి నేపథ్య గాయకుని విభాగంలో నంది అవార్డు లభించింది. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కథానాయకుడు కార్తీక్ సొంతమైంది.
అందుకే ఈ చిత్రం అంటే నాకెంతో ఇష్టం. ఈ సినిమా నాకు చాలాచాలా నచ్చిన సినిమా.