S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/06/2019 - 23:12

నందమూరి తారకరామారావు సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన చిత్రం ‘గులేబకావళి కథ’. 1962లో విడుదలైన ఈ చిత్రానికి సంగీతం జోసెఫ్, కృష్ణమూర్తి ద్వయం కాగా, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఇందులోని ‘కలల అలలపై’ అన్న యుగళ గీతం నాకు చాలా యిష్టం.

03/30/2019 - 21:21

‘అంచెలంచెలు లేని మోక్షం చాల కష్టమే భామిని’ అనే పాటను పింగళి నాగేంద్రరావు శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రం కోసం రచించారు. జయంతి బ్యానర్‌పై నిర్మాణమైన చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించింది కెవి రెడ్డి. ఈ సినిమా అప్పట్లో ఒకవిధంగా జైత్రయాత్రే చేసింది. ఈ పాటను అల్లు రామలింగయ్య, సురభి బాల సరస్వతిలపై హాస్యంగా చిత్రీకరించారు.

03/30/2019 - 21:20

‘మంచిని పెంచాలి’ చిత్రాన్ని జగజ్జనని ప్రొడక్షన్స్ నిర్మించి మార్చి 1980లో విడుదల చేశారు. ఇది ప్రభోదాత్మక సాంఘిక చిత్రం. చిత్రకథ బిగువైన సన్నివేశాలతో ఉంటుంది. నిజానికి 1976లో మొదలైన చిత్రం నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల నాలుగేళ్ల జాప్యంతో చిత్రాన్ని విడుదల చేయడం, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

03/30/2019 - 21:18

చెన్నై టి.నగరు సౌత్‌బోగ్ రోడ్‌లో అతి పెద్ద భవనం శివాజీ గణేశన్‌ది. భవనానికి ముందర ఓ వెయ్యి గజాల అందమైన తోట. జాతి కుక్కలు.. గిన్నికోళ్లు.. వివిధరకాల పక్షులూ... చాలా సందడిగా వుంటుంది. పండగకీ పబ్బానికీ శివాజీ పేదసాదలను తన ఇంటికి పిలిపించుకొని తృప్తికరంగా ఎన్‌వితో(మాంసాహారమంటే చాలా ఇష్టం) భోజనంపెట్టి తోచింది ఇచ్చి పంపించేవాడు.

03/30/2019 - 21:07

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటున్నారు. నా ఉద్దేశ్యంలో రెగ్యులర్ అన్నది వేరే అర్థం. నావరకు ‘సూపర్ డీలక్స్’, ‘యూ టర్న్’ తరహాలో భిన్నమైన పాత్రలు చేయాలనే ఆలోచిస్తున్నా. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడమే ఇపుడు నాముందున్న తపన. -ఇదీ అందాల భామ సమంతా మనసులో మాట.

03/23/2019 - 21:01

కుడి ఎడమైతే పొరబాటులేదోయ్.. ఓడిపోలేదోయ్.. అంటూ ఘంటసాల గొంతులో భారంగా వినిపించే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. 1953లో వినోదా ఫిలింస్ నిర్మించిన విజయవంతమైన చిత్రం ‘దేవదాసు’లోనిది. బెంగాలీలో శరత్‌బాబు నవలల్ని చక్రపాణి తెలుగులోకి తర్జుమా చేశారు. ఈ చిత్రాన్ని బెంగాలీ, హిందీ, తమిళంలో వివిధ దర్శకులు ఎన్నోసార్లు తీశారు.

03/23/2019 - 20:59

శోభన్‌బాబు, వాణిశ్రీ, కృష్ణంరాజు, చంద్రమోహన్, లక్ష్మి నటించిన ‘జీవన తరంగాలు’ చిత్రం ఇప్పటికీ ఎంతోమంది మనసులను వెంటాడుతుంది. ముఖ్యంగా సినిమాలో మనుషుల మధ్య ఉండే సంబంధాలను అద్భుతంగా దర్శకుడు ఆవిష్కరించాడు. అన్నాతమ్ముళ్ల అనుబంధం, స్నేహానికి ఉన్న విలువ గురించి నవలా రచయిత్రి చక్కగా సన్నివేశ పరంగా చెప్పారు. పుట్టినరోజు పండుగే అందరికీ అనే పాట ఇప్పటికీ రేడియోల్లో వినిపిస్తూ వుంటుంది.

03/23/2019 - 21:40

జయలలిత, శోభన్‌బాబు ఫస్ట్ అండ్ లాస్ట్ కాంబినేషను. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి లెనిన్‌బాబు. రవీంద్ర ఆర్ట్స్ బ్యానరు అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి కొడుకు. (భరద్వాజ అన్నయ్య) ఆరోజు ప్రసాద్ లాబ్ ఆరుబయట శోభన్, జయలలిత కూర్చున్నారు. లోపల డబ్బింగ్ జరుగుతోంది. జయలలితకి పిలుపొచ్చింది. వెళ్లింది. ఇక్కడ చాలామందికి తెలియని విషయం జయలలిత జ్ఞాపకశక్తి.

03/23/2019 - 20:29

అమర్ అక్బర్ ఆంటోని తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో పునరాలోచనలో పడ్డారు మాస్‌రాజా రవితేజ. వెంటనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన సినిమాల విషయంలోనూ కాస్త టైమ్ తీసుకొని, స్క్రిప్ట్‌ను పకడ్బందీగా ఉందని నిర్థారించుకున్న తర్వాతగానీ షూటింగ్ మొదలుపెట్టేందుకు ఒప్పుకోవడంలేదు. ప్రస్తుతం రవితేజ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం డిస్కోరాజా.

03/16/2019 - 20:56

ఏదో ఒక రాగం/ పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

Pages