Others

ఆగవోరుూ..(నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగవోరుూ/ఆగవోరుూ/ఆగవోరుూ/ఆగవోరుూ...
త్యాగం ఇదియేనా/ హృదయం శిలయేనా... ఏల ఈ మోసం -ఈ మకుటంతో మొదలెట్టిన పాట బాబూ మూవీస్ ‘మంచి మనసులు’ అనే సాంఘిక చిత్రంలోనిది. సాంఘిక జీవనంలో ఓ కుటుంబానికి అద్దంపట్టిన చిత్రరాజమిది. ఈ చిత్రాలన్నీ ఇంతతీరుగా తీర్చిదిద్దిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.
జగమెరిగిన జనమెరిగిన విప్లవ కవి శ్రీశ్రీ పద దళాలను స్వరమాధుర్యాలతో మెరుగుల దిద్దినవారు మామ కెవి మహదేవన్. ఈ చిత్రాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రుల, ఆంధ్రేతరుల హృదయాల్లో నిలిపారు. భావానికి... స్వర ఝరులకు మెరుగులద్దుకుని జాలువారింది పి సుశీలమ్మ మృదుమధుర గళంలో. ఆమె సర్వధా అభినందనీయురాలు.
ఇక తెరమీదకి వస్తే పాత్రోచితంగాకాక మంచి హావభావాలను ప్రదర్శించి ప్రతిభను ప్రకటించారు మహానటి సావిత్రి. సావిత్రి, నాగేశ్వరరావు అధిరోహించిన విజయాలలో ఈ చిత్రం కూడా మకుటాయమానమై నిలుస్తుంది. ఇక ఈ పాట సమర్ధిస్తున్నది షావుగారు జానకిని కాబట్టి... అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
ఇక శ్రీశ్రీ -మానవతా విలువలకి, దాంపత్య బంధానికి చక్కని భాష్యం చెప్పారు ఈ పాటతో. తాళికట్టినంతమాత్రాన... ఇంట్లో దించినంతమాత్రాన...నగలు, చీరలిచ్చి ఖరీదైన జీవితం...కలకంఠి కంటి కన్నీరు తుడవదు అది త్యాగ మనిపించుకోదు... బాధ్యత ఆమెపట్ల అంతటితో తీరిపోదు. రేరుూపగలు కంటికి రెప్పగా, మనసు తనువు ఒకటిగా జీవితమంతా తనని వెన్నంటి ఉండాలి. అప్పుడే హృదయం నవనీతవౌతుంది. లేదంటె హృదయం ఆమె పట్ల శిలగానే మిగిలిపోతుంది. కనుక మగువను నీదానిగా చేసుకుని ఆమె పరితపించే మనసును నీదారికి తీసుకో. అప్పుడు ఆమె హృదయంలో మానవ రూపంలో దేవునిగా మిగిలిపోతావు. అప్పుడే నీ త్యాగానికి ఆమెకి ఫలితాలందుతాయి- వలపులు పండుతాయి’ అని చాలా సులభశైలిలో, వాడుక భాషలో అందరి అంతరంగాలకి చేరేలా తేటతేట తెలుగులో దాంపత్య బంధానికి అందాన్ని తెచ్చారు కళాస్రష్టలు. అందుకే ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చుతుంది.

-ఆచార్య కృష్ణోదయ