S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/11/2019 - 21:00

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీసావంత్ గుర్తుందిగా.. అయినా ఆమెను మరిచిపోయినపుడల్లా ఏదో దుమారం రేపుతూ మరిచిపోకుండా చేస్తూనే ఉంటుందిలెండి. తాజాగా ఈ అమ్మడు పాకిస్తాన్ జెండా పట్టుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అసలే పాకిస్తాన్ విషయంలో ఫైర్‌మీదున్న ఇండియన్స్ ఊరుకుంటారా.. రాఖీ సావంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నీకు పాకిస్తాన్ వారసత్వమే కరెక్ట్..

05/04/2019 - 20:11

మనిషి భూగోళమంత గొప్పవాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మనిషి తలచుకుంటే భూగోళాన్ని మించి విశ్వాంతరాల్లోకి వెళ్లి రాగలిగే శక్తి ఉన్నవాడు. అతని శక్తియుక్తులు అతనికి తెలియవు. అవసరమైనప్పుడు మాత్రమే ఎలాగైనాసరే వాటిని ఉపయోగించి విశ్వాంతరాళాలకు ఎదిగి విశ్వంభరుడవుతాడు. అలాంటి ఆలోచనతోనే ఓ అద్భుతమైన పాటను బాలభారతం చిత్రం కోసం ఆరుద్ర రాశారు.

05/04/2019 - 20:09

కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన సినిమా -డాక్టర్ చక్రవర్తి. 1964 జూలైలో స్క్రీన్స్‌కు వచ్చిన సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అంతేకాదు, వర్థమాన దర్శకులకు పెద్ద బాలశిక్షగా చెప్పుకునే చిత్రాల్లో డాక్టర్ చక్రవర్తికీ ప్రాధాన్యత కలిగిన స్థానం ఉంటుంది.

05/04/2019 - 20:07

చెన్నైలో వలసరవాక్కం గంగమ్మన్ కోయిల్ స్ట్రీట్- ఆ వీధి వీధంతా విఠలాచార్యకు చెందిందే. ఉదయం ఆరు గంటలకు ముందే ధూప దీప నైవేద్యాలతో శివపూజ జరుగుతుంది. వీధి వీధంతా ఓం నమఃశివాయ శబ్దాలు ప్రతిధ్వనిస్తూ వుంటాయి. విఠలాచార్య ఇంటి ముందు పెద్ద సినిమా హాలులాంటి గది. ఏడు గంటలనుండి ఫలహారం, కాఫీలూ ఎంతమంది సందర్శకులు వస్తే అంతమందికీ ఇస్తూంటారు. ఎవరికీ తెలియని విషయమేవిటంటే..

05/04/2019 - 19:58

ఐటెం సాంగ్స్‌తో రాయ్ లక్ష్మి తెలుగులో చాలా పాపులర్. మెగాస్టార్ చిరంజీవి ఖైది నెం 150లో రత్తాలు.. రత్తాలు అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించడంతో ఆమె సూపర్ పాపులర్ అయింది. ఇప్పటికీ చాలామంది ఆమెను రత్తాలు అని పిలుస్తారంటే ఆ పాట ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆమెపై రూమర్లు చాలా వస్తుంటాయి. రీసెంట్‌గా లక్ష్మీరాయ్ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకుంది.

05/04/2019 - 19:57

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో మూడు నాలుగు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉండగా, తాజాగా మరో సినిమాను తెరకెక్కించే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ కొత్త ప్రాజెక్టులో జయలలిత పాత్రలో నటించేది ఎవరోకాదు బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్? తెలుగు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.

04/27/2019 - 21:17

1957లో విడుదలెంది అన్నపూర్ణ వారి ‘తోటికోడళ్ళు’ చిత్రం. ఈ సినిమాలో హిట్‌సాంగ్ ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదాన.. బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో తెలుపగలవా?’ అంటూ హీరో పాడే పాట చాలా ఇష్టం. కష్టజీవుల తరఫున గొప్పోళ్లను నిలదీసే విప్లవగీతంగా వినిపించే ఈ పాటను ఆత్రేయ అందించారు. అంతేకాదు, కష్టజీవుల శ్రమ విలువను అద్భుతంగా ఆవిష్కరించారు.

04/27/2019 - 21:15

రాజారఘుపతిరావు ఓ పెద్ద జమీందార్. సాయంచేసే గుణంతో ఊళ్లో ‘్ధర్మదాత’గా పేరుతెచ్చుకుంటాడు. భార్య ఇద్దరు బిడ్డలు, పెళ్లికాని చెల్లెలితో ప్రశాంతంగా జీవించే వారి జీవితంలోకి పక్క ఊరి ధనవంతుడు నాగభూషణం ప్రవేశిస్తాడు. అసూయ, దుర్భుద్ధితో రాజావారి చెల్లెల్ని తన కోడలిగా చేసుకొని ఆస్తి కాజేయాలనే పథకం వేసి యింటినుంచి వెళ్లే పరిస్థితి కల్పిస్తాడు.

04/27/2019 - 21:13

నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (యన్‌ఏటి) బ్యానరు ప్రొడక్షను వ్యవహారాలు చాలా స్ట్రిక్టుగా ఉండేవి. షెడ్యూలు, కాల్షీటు, షూటింగు, ట్రాన్సుపోర్టు, ఆతిథ్యం అన్ని విషయాల్లోనూ వారికో పద్ధతుంటుంది. ఆ ప్రకారం అందరూ అనుసరించాల్సిందే!

04/27/2019 - 22:05

మంచినటిగా పేరు తెచ్చుకోవడమేకాదు, అవసరమైతే నగ్నంగా నటించేందుకూ సందేహించనన్న స్టేట్‌మెంట్లతో మెంటలెక్కించిన నటి రాథికా ఆప్టే. లైంగిక వేధింపులమీదే కాదు, సౌత్‌లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌గా మాత్రమే చూపిస్తారంటూ ఓపెన్‌గా మాట్లాడగల గట్స్ ఆమె సొంతం. ముంబైకి చేరిన రాధిక, టాలీవుడ్‌పై విమర్శలు చేయడం చాలామంది తెలుగువారికి నచ్చలేదు. కానీ అలాంటివాటిని రాధిక ఎప్పుడూ పట్టించుకున్నట్టు కూడా కనిపించదు.

Pages