Others

మనోరమ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959లో భాస్కర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం -మనోరమ. కెమెరాతోపాటు దర్శకత్వం కమల్ ఘోష్ నిర్వహించారు. గిరిజలాంటి చిన్నది బాలయ్యలాంటి చిన్నవాడిని ప్రేమిస్తుంది. తీరా పెళ్లివరకూ వచ్చాక.. తను వెళ్లిపోతే ముసలి తండ్రి, చిన్న తమ్ముడూ ఏమైపోతారోనని బెంగపెట్టుకుంటుంది. దీనిపై నిర్ణయం కోసం స్నేహితురాలు కృష్ణకుమారితో మాట్లాడుతుంది. తరువాత -బాలయ్యతో పెళ్లి వద్దనుకుంటుంది. దాంతో ఆ చిన్నవాడు బాలయ్య వేరే పెళ్లి చేసుకుంటాడు. కాని, పాత జ్ఞాపకాల కారణంగా సుఖంగా ఉండలేకపోతాడు. ఈ చిన్నది మాత్రం తన తమ్ముడిని పెంచి వివాహం చేస్తుంది. ఆ వచ్చిన కొత్తకోడలు తనపై దొంగతనం మోపడంతో, బాధతో ఇల్లువిడిచి వెళ్లిపోతుంది. అయితే, ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కారణంగా బెంగ పెట్టుకున్న బాలయ్య మరో దేశం వెళ్లిపోతాడు. అక్కడే డాక్టరీ చదివి పది పదిహేనేళ్ల తరువాత మళ్లీ దేశానికి వస్తాడు. అప్పటికి తన ఇంట్లోనే దాదిగావున్న గిరిజను చూస్తాడు. తన క్షోభనంతా చెప్తూండగా విన్న బాలయ్య ఏంచేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉండిపోతాడు. ఆ తరువాత గిరిజ చనిపోయింది? చివరకు ఆ కథ ఏమైందన్నది అద్భుతమైన ముగింపు. కథ సాదాసీదా అయినా అప్పటి కొన్ని చిత్రాలకన్నా ఈ సినిమా చాలా బాగుంటుంది. కొసరాజు, జూనియర్ సముద్రాల వ్రాసిన పాటలు హిందీ గాయకుడు తలత్ మహమ్మద్, సుశీల హాయిగా పాడారు. వాటికి సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు లలిత, సుకుమార బాణీలుకట్టారు. ఈ చిత్రంలో అందాల సీమ, చందమామ రావె, గతిలేనివాని, మర్చిపోయావేమో అన్న పాటలు చాలా బాగుంటాయి. వీటిలో చందమామ రావె అన్న పాటలో అద్భుతమైన ట్రాన్జాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తన కెమెరా పనితనంతో చూపించాడు.
చందమామ రావె/ జాబిల్లా రావె/ కొండెక్కి రావె/ గోగుపూలు తేవె అంటూ పల్లవి మొదలెట్టి వెండిగినె్నలో వేడిబువ్వతేవె/ పైడిగినె్నలో పాలబువ్వ తేవె/ అందాల పాపకు అందించిపోవే అంటాడు చరణంలో కవి. రెండో చరణంలో తెల్లమాకులా తేరుమీదరావె/ పాలవెనె్నల పానకాలు తేవె/ అందాల పాపకు అందించిపోవె -అంటూ ముగిస్తాడు. చిన్ని పదాలు, తేటతెనుగు పదాలతో లాలిపాట, జోలపాట పాడినంద హాయిగా ఉంటుందీ పాట. ఈ సినిమాలో ఇంకా సూర్యకాంతం, రమణారెడ్డి వగైరా నటించారు. కథాపరంగా సామాన్యంగా కనిపించినా చిత్రం చూస్తూన్నంతసేపూ ఏదో తెలీని హాయి మనల్ని ఆవహించి -ఓ మంచి సినిమా చూశామన్న భావన కలిగిస్తుంది.

-మృత్యుంజయుడు, వక్కలంక