Others

అంతస్తులు (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంతస్తులు’ చిత్రం కోసం మనసుకవి ఆచార్య ఆత్రేయ కలం నుంచి, మామ సంగీత సారథ్యంలో, విక్టరీ మధుసూధనరావు నిర్దేశకత్వంలో రూపుదిద్దుకున్న పాట -నువ్వంటే నాకెందుకో ఇంత ఇది. తెలుగువాళ్ల నోట రమారమి ఐదు దశాబ్దాలకు పైగా ఈ పాట వినిపిస్తూనే ఉంది.
తేట తెనుగు పదాలను ఆత్రేయ వ్రాయటం... కెవి మహదేవన్ స్వరపరచటం... తేనెలూరు గళంతో ఘంటసాల, పి.సుశీల ఆలపించి రసహృదయాలను ఊయల లూగించడం పరిపాటి... పై వారలకెవరు సాటి అనకమానరు రసాస్వాదన చేసిన మనుషులు, అవ్వారి మనసులు.
ఇక చరణాలలోకి వెళ్తే ఎంతో వాడుక భాషలో అంతే వేడుకతో పంచదారలూరుతాయి-
తొలినాడు ఏదోలా మొదలయినది
ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంతా తానయినది
ఆ ఇది ఏదో ఇద్దరికీ తెలియకున్నది
మలి చరణం ముక్తాయింపుగా... వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణువణువు పొంగినది.., నీకిచ్చేవరకు నిలువలేనన్నది... ఉరికి ఉరికి నీ ఒడిలో ఒదిగినది-
ఇక్కడ ఒక్క పువ్వుగాని ఓ నవ్వుగాని పక్షిగాని పిట్టగాని- ఎక్కడా ప్రకృతి ప్రణయానికి, లభ్యమయ్యే ఏ కవితావస్తువు చెప్పకుండానే అది... ఇది... అంటూ ఆత్రేయ చేసిన పద విన్యాసానికి, వయసులో కలిగే పొంగులకి, హంగులకి, కనె్నమనసు ఆర్భాటాలని, అవి చేసే సందళ్ళని, గుండె చప్పుళ్ళని ఎంత గొప్పగా రచించారో...అనిపిస్తే హేట్సాఫ్ ఆత్రేయ అనవలసినదే.
కె.వి.మహదేవన్ తెలుగు పత్రికల్లోని సంపాదకీయాలకైనా సంగీతపు వరసలు కట్టగలరన్న నానుడికి ఈ పాట ఓ మచ్చుతునక... ప్రేమకు మీగడ తరక. భారీ తారాగణానికి తోరణమైన నటసామ్రాట్ అక్కినేని, తారామణి కృష్ణకుమారి... వీరిని ఏర్చికూర్చిన విబి రాజేంద్రప్రసాద్ మరియు వి.లో విక్టరీ ఏర్పరచుకున్న దర్శకస్రష్ట మధుసూధనరావు చిరంతరం సినీ జగత్తులో స్థిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే ఈ పాటంటే నాకింత ఇష్టం.