S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

08/29/2016 - 21:44

‘గుండమ్మ కథ’ -ఇదేం పేరు అని కెవి రెడ్డి ఆశ్చర్యపోయి, ఈ సినిమా ప్రేక్షకులు చూస్తారా? అని పెదవి విరిచారట. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ మొదలైన దగ్గర్నుంచీ ఎంతోమంది విమర్శలు, ఆటుపోట్లు తప్పలేదట. అయితే చక్రపాణికి -సినిమా తప్పక విజయవంతం అవుతుందని కమలాకర భరోసా ఇచ్చారట. పౌరాణిక చిత్రాలు నిర్మించే దర్శకుడు సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించటమేంటని కూడా కొందరు హేళన చేశారట.

08/29/2016 - 21:37

హీరో ఓరియంటెడ్ సినిమాల కాలంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఎందరో మెప్పించారు. ముఖ్యంగా క్రైమ్ తరహా సినిమాల్లో విజయలలిత, జ్యోతిలక్ష్మి, మంజుల, కవితవంటి వారినే చెప్పుకోవచ్చు. విజయలలిత రౌడీరాణి, ఒకనారి వందతుపాకులు, బస్తీమే సవాల్, కొరడారాణి, పిల్లాపిడుగా లాంటి చిత్రాల్లో నటించారు. మంజుల- తుఫాన్ మెయిల్ అనే సినిమాలో నటించింది.

08/22/2016 - 21:48

సినిమాలు ఎందుకు తీస్తారు.. మనం ఎందుకు చూస్తాం? ఏకకాలంలో వందలాది థియేటర్లలో విడుదల చేసేస్తే అందులో ఏముందీ అన్నది తెలుసుకోకుండా మొదటి మూడు రోజుల్లో చూసేస్తారన్న ధీమా ఇటు నిర్మాతలకు, అటు దర్శకులకు, నటులకూ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. కానీ అన్ని వేళలా ఈ లాజిక్కు.. టెక్నిక్కు... పని చేయదు.

08/15/2016 - 22:49

వలస పక్షుల్లా ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్లు తెలుగు తెరకు ఎగిరెగిరి రావడమేగానీ, ప్రతిభను పెకెగరేస్తున్న హీరోయిన్ ఒక్కరూ కనిపించడం లేదు. లక్షలకు లక్షలు పారితోషికం తీసుకుంటూ -షోకేస్‌లో బొమ్మల్లా అందాలు గుమ్మరిస్తున్నారు గానీ, నటించే సత్తావున్న వాళ్లేరీ? అంటూ నిన్నమొన్నటి వరకూ మీడియాలో వచ్చిన కథనాలకు ఇప్పుడొస్తున్న హీరోయిన్లు సరైన సమాధానమే చెబుతున్నారు.

08/08/2016 - 21:48

అతిచేస్తే గతి చెడుతుందని కబాలి నిరూపించాడు. ఉద్యోగులకు సెలవు, వయోవృద్ధులకు ఫ్రీ టిక్కెట్లు, స్పెషల్ విమానాలు, పది వేల థియేటర్లలో విడుదల, రజని వెండి నాణాలు ఇలా ఎన్నో. ఈమధ్య ఏ చిత్రానికీ ఇంత ప్రచారం లేదు. అదే దెబ్బతీసింది. అభిమానులవల్ల కొద్దిపాటి లాభాలు రావచ్చేమోగానీ మొత్తానికి నిరాశపర్చింది. అంతర్జాలంలో జోకులే జోకులు! అందర్నీ ఏడిపించే ఉల్లిపాయ కబాలి పాట్లుచూసి తనే ఏడ్చిందట.

08/01/2016 - 22:09

తమిళ భాషలో క, ఖ, గ, ఘలకు ఒకటే అక్షరం. చెన్నయ్ మైలాపూర్‌లో ఉన్న కపాలీశ్వరన్ కోయల్‌ను కపాళి, కబాలి, గబాలి, గపాలి.. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అది వాళ్ల తమిళ అక్షర సంప్రదాయం హక్కు. తెలుగులో డబ్ చేశాక మనకు అన్ని అక్షరాలు ఉన్నాయి కనుక కపాలి అనాలి. (కపాలి అంటే పుర్రె అని అర్థం. శివుడు స్మశానంలో పుర్రెలు వాడాడు కనుక) అలా కపాలి అని పెడితే బాగుండేది. కబాలి అనడం కరెక్టు కాదు.

07/25/2016 - 21:26

అతి సర్వత్రే వర్జయేత్ అని పెద్దలు సరదాకి అన్నారా? తాజాగా విడుదలైన కబాలి సినిమా, మీడియాలో దానిపై పెంచేసిన అంచనాలు, ఆ పేరుతో కార్పొరేట్ సంస్థలు సాగించిన వ్యాపారం, విడుదల రోజు కార్యాలాయాలకు సెలవులు ఇవ్వడం.. ఇత్యాది ప్రయోగాలు, పటాటోపాలు అన్నీ అతే. విడులయ్యాక బండారం బయటపడింది.
ధనరాజు, సూళ్లూరుపేట
కోట్లతో నటన నాణ్యమవునా?

07/18/2016 - 22:15

బూతు సినిమాలు రూపొందించడంలో మాస్టర్ అనిపించుకున్న మారుతి, క్లీన్ ఎంటర్‌టైనర్‌గా పబ్లిసిటీ చేసుకున్న ‘రోజులు మారాయి’ పరమ చెత్తగా వుంది. బూతు డైలాగులు, స్కిన్ షో లాంటివి జుగుప్స కలిగించాయి.

07/11/2016 - 21:28

బాపు రమణల దృశ్యకావ్యాలు అపురూపాలు. ముత్యాలముగ్గు, అందాల రాముడు, బుద్ధిమంతుడు, పెళ్ళిపుస్తకం లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు ఎన్నటికీ మరువడు. సంపూర్ణ రామాయణం, భక్తకన్నప్ప లాంటి చిత్రాలు అజరామరం. అలాంటి వంశవృక్షం నుండి వచ్చిన వర ముళ్ళపూడి మారిన కాలానుగుణంగా మంచి చిత్రాలు తీయాలి. అలాకాకుండా బాపు బొమ్మలాంటి హీరోయిన్ చాందినీని పెట్టుకొని ఏమాత్రం పసలేని ‘కుందనపు బొమ్మ’లాంటి సినిమా తీయడం బాధాకరం.

07/04/2016 - 22:47

నాని ద్విపాత్రాభినయం చేసిన జెంటిల్‌మన్ చిత్రం బాగుంది. ఇద్దరు అమ్మాయిలు వారి ప్రేమకథలను చెప్పుకోవడంతో ప్రారంభమైన సినిమా నెమ్మదిగా థ్రిల్లర్ రూపుదాల్చింది. తనకు కాబోయే ఫ్రెండ్ హత్య చేయబడ్డాడన్న అనుమానంతో కేథరిన్ స్వయంగా ఇనె్వస్టిగేషన్ ప్రారంభించడం, ఆ క్రమంలో ఎదురైన నాని రెండో పాత్రను వెంటాడడం, చిట్టచివరకు అసలు విషయం తెలియడంతో సినిమా పట్టు సడలకుండా నడిపించడంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది.

Pages