S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

05/15/2017 - 21:17

అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా బిజీ అవుతన్న టైంలో -చిత్రమైన చెత్త కథను చేసి అవసరాల అనవసరంగా ఖాళీ అయిపోయాడు. కొన్ని సినిమాలు వ్యక్తిగత ఇమేజ్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయనడానికి ‘బాబు బాగా బిజీ’ని ప్రస్తావించుకోవచ్చు. మన తెలుగు నేటివిటీకి ఏమాత్రం సూట్‌కాని కథలో -తన అప్పీరెన్స్‌కు అస్సలు అతకని ‘మాధవ్’ పాత్ర చేసి అవసరాల మాచెడ్డ ఇబ్బంది పెట్టాడు.

05/01/2017 - 21:42

మహాభారతం ఇతిహాసాన్ని మూడు గంటల వ్యవధిలోనో లేక రెండు భాగాలుగానో వెయ్యి కోట్లు వెచ్చించి హాలీవుడ్ లెవల్లో సినిమా నిర్మించాలనే సంకల్పం సాహసంతో కూడినదే. ఇందులో బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌లు నటిస్తారట. అమీర్‌ఖాన్ కృష్ణుడని ఓ వార్త. ఇందులో మన తెలుగు నటులు ఎంతమందో మరి! ఈ నిర్మాణానికి ఇద్దరో ముగ్గురో నడుం కడుతున్నారట.

04/24/2017 - 21:11

మీ
వ్యూస్

04/18/2017 - 00:54

వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించగల దర్శక దిట్ట మణిరత్నం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు పరిగెత్తిన వాళ్లకు నిరాశ మిగిలింది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమ కథలను పండించటంలో ఓ స్టయిల్ వున్న దర్శకుడు మణిరత్నం నుంచి చెలియా వస్తుందని ఆశపడిన ప్రేక్షకులకు ఆయన నిరాశ మిగిల్చారు. మణిరత్నం సినిమాల్లో అత్యంత ఫ్లాప్ చిత్రం ఇదే అనుకోవాలి, అలావుంది సినిమా.

04/10/2017 - 22:17

మాయాబజార్ చిత్రాన్ని ఈరోజు చూసినా పాత చిత్రాన్ని చూసినట్టుండదు. కృష్ణుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నంత గొప్పగా ఎన్టీఆర్ నటించడమే కాదు, మిగిలిన పాత్రధారులంతా అద్వితీయమైన నటన ప్రదర్శించి మెప్పించారు. ‘నిజంగా నీవంతటి వాడివే అయితే ఇలా మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తావా అభిమన్యూ.. ఊ’ అన్న డైలాగ్‌లో ఎన్టీఆర్ అభినయం చూసి ఎవ్వరైనా ఫ్లాటైపోవాల్సిందే.

04/03/2017 - 21:49

ఖైదీ నెంబర్ 150 చిత్రానికి చిరు కుమార్తె రూపొందించిన కాస్ట్యూమ్స్ అసౌకర్యంగా ఉన్నాయని అన్నందుకు ఆ చిత్రంలో ఐటెమ్ పాటలో నృత్యం చేయాల్సిన కేథరిన్ థ్రెస్సాను తప్పించి, రాయ్‌లక్ష్మిని పెట్టుకున్నారు. అలా తాను అని ఉండకూడదు, చిరుతో అవకాశం పోయింది. మళ్లీ అవకాశం వస్తుందో లేదో అని ఆమె బాధపడింది. మరిప్పుడు అదే కేథరిన్ చిరుతో ఐటెమ్ పోయినందుకు బాధపడడం లేదు.

03/27/2017 - 23:06

అభిమాన హీరోల చిత్రాల కలెక్షన్లు తెలుసుకోవాలని అభిమానులకు ఆత్రంగా వుంటుంది. వాళ్లను సంతృప్తిపర్చడానికి నిర్మాతలు గాలిలోకి అంకెలు వదులుతుంటారు. కానీ వాటిని ఎంతవరకు నమ్మాలో ఎవరికీ తెలియదు. అతి కొద్దికాలంలో వంద కోట్లు సాధించిన చిత్రం ఖైదీ నెం 150 తాలూకు టోటల్ కలెక్షన్లు ఎంతో చెప్పలేదు. శాతకర్ణి వందకు చేరుకుంటుందని చెప్పినా అది 70 కోట్లే సాధించింది.

03/20/2017 - 21:24

పాతికేళ్ల క్రితం దెయ్యం, ఆత్మలంటూ భయపెట్టే కథలతో సినిమా తీస్తే -థ్రిల్లింగ్‌గా చూసేవారు. ప్రపంచం మొత్తం ఆధునిక సాంకేతికత చుట్టూ తిరుగుతుంటే -ఇంకా పాతికేళ్ల క్రితంనాటి స్క్రీన్‌ప్లే, సన్నివేశాలతో సినిమాలు తీస్తే -అచ్చంగా చిత్రాంగదలానే ఉంటాయి. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలపు కథలు, సన్నివేశాలు రూపొందిస్తేనే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అరిగిపోయిన పాత రీళ్ల కథలను తిరగదోడితే ఎందుకు చూస్తారు.

03/13/2017 - 21:30

ఘాజీ చిత్రం గురించి వెనె్నల్లో రాశాక సినిమా చూశాను. నిజంగా ఈ సినిమా చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న పడికట్టు సూత్రాలను పడగొట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు అనిపించింది. చూపించడానికి ఏమీ లేకపోయినా ప్రేక్షకుణ్ణి రెండున్నర గంటలపాటు కుర్చీలో అలా కూర్చోబెట్టాడు అంటే దర్శకుణ్ణి ఆడుమగాడురా బుజ్జి అనొచ్చు. ఇప్పటివరకు పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన దర్శకులకు చెంపపెట్టు ఈ చిత్రం.

03/07/2017 - 22:17

ముందుగా ఈ సినిమా పేరుకు, కథకు సంబంధం ఏమిటో అర్థం కాదు. అసలు కథ ఉంటేగా? ఇది ఇంకో ప్రశ్న. అన్ని మాఫియాల్లాగే ప్రచార మాఫియా తయారైంది. ఒక చెత్త సినిమాను పట్టుకొని అదే పనిగా టీవీలు, పేపర్లు, గోడలమీద ప్రచారం చేసి, ఇన్ని కోట్లు అన్ని కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇలా చేయడంతో ఆ సినిమా చూసి తల బొప్పికట్టిన వేల ఆడియన్స్‌లో నేనొకడిని.

Pages