S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

04/11/2016 - 22:06

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

04/11/2016 - 21:51

తారల ప్రేమలు, ఎంగేజ్‌మెంట్లు, వివాహాలు, విడాకులు తోసుకురాడానికి రద్దవడానికి సంపాదన హెచ్చుతగ్గులే కారణమని స్థూలంగా చెప్పొచ్చు. పెళ్లివరకు రాకుండానే ఎన్నో ప్రేమలు ఎండిపోయాయని మనకు తెలుసు. వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దయిన బాధలో త్రిష విరామం లేకుండా నటించేస్తున్నదనడం కేవలం భ్రమ. చేతిలో చిత్రాలు లేనప్పుడు ఎంగేజ్‌మెంట్ జరిగింది. చిత్రాలు రాగానే రద్దయ్యంది. చాలామంది అంతే.

04/04/2016 - 21:58

నవ శకానికి నాంది. రొటీన్ చిత్రాలకు చెంపదెబ్బ. నటనకు కొత్త భాష్యం. నవ దర్శకులకు మార్గదర్శనం. సకుటుంబ సపరివార చిత్రం. మండు వేసవిలో ఒయాసిస్సు. తెలుగువారికి పన్నీటి జల్లు. తెలుగువాడి స్టామినా. బంధాలను హృదయానికి చేరువచేసిన చిత్రం. కోమాలోవున్న తెలుగు సినిమాకు సరికొత్త -ఊపిరి
- నవీన చైతన్య, హైదరాబాద్

03/28/2016 - 22:18

తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విశాల్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పుడొస్తున్న చాలామంది హీరోలకంటే మంచి పెర్ఫార్మెన్స్, సత్తా కలిగిన హీరోయే అయనా, ఎందుకో ఇక్కడ అతనికి స్థిరమైన మార్కెట్ ఉండటం లేదు. యాక్షన్, ఎమోషన్స్ పలికించగలగటంలో నేర్పరే అయనా, తమిళ్ నుంచి డబ్బింగ్ అవుతున్న అతని సినిమాలు తెలుగు ఆడియన్స్‌కు దగ్గర కాలేకపోతున్నాయ.

03/21/2016 - 22:36

సినిమా ప్రారంభం రెంటితో, ఇంటర్‌వెల్‌లో ఒంటితో తీసిన జాతీయ అవార్డు గ్రహీత సత్తారు సత్తా ఏమిటో గుంటూర్ టాకీస్‌తో వెల్లడైంది. ఈ సినిమా తర్వాత గతంలో సత్తారుకిచ్చిన అవార్డుని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. దిగజారుడుతనానికి పరాకాష్ఠ ఈ సినిమా. ఏం ఆశించి సినిమా తీశారో వారికే తెలియాలి. నరేష్‌లాంటి సీనియర్ నటుడు నటించాల్సిన సినిమానా ఇది?

03/15/2016 - 02:00

అనుకున్నంత కాదు..

03/07/2016 - 22:45

కొత్త ఏడాది చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. చిన్న బడ్జెట్‌తో గత రెండు నెలల కాలంలో వచ్చిన మెజారిటీ సినిమాలు థియేటర్ల వద్ద బాగానే హడావుడి చేశాయి. పట్టున్న కథ, కథనాలతో మంచి మార్కులే సంపాదించుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో -మొన్న వచ్చిన అడవి శేష్ ‘క్షణం’ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

02/29/2016 - 19:41

టైటిల్ జస్ట్ఫికేషన్

02/23/2016 - 01:10

వెనె్నలలో పాత చిత్రాల సమీక్షలు ఇచ్చేటప్పుడు అవి విడుదలైన సంవత్సరం, ఆరోజు తేదీ, నెల వ్రాయడం లేదు. అవి రాయగలరని మనవి. అలానే ఆ చిత్రాల నిర్మాణం అయిన ప్రదేశాలు తెలియజేస్తే సమీక్ష చదివే పాఠకులకు తియ్యని అనుభూతులు పొందుతారు. ఎందుకంటే ఆనాడు సినిమాలు చూసిన ప్రేక్షకులంతా నేడు 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధ అభిమానులే. అందుకే ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఈ విషయం ఆయా రచయితలకు తెలియజేయండి.

02/15/2016 - 20:49

మళ్లీ సోషియో ఫాంటసీ వ్యాసం బాగుంది. మనవాళ్లు మంచి కథలు రాయలేరని, మెగా ఫ్యామిలీతోపాటు చాలామంది అభిప్రాయం ఏర్పరచుకుని, రీమేక్‌ల వైపే పరుగులు పెడుతున్నారు. కారణాలు అడక్కు, చూపించేదే చూడు అన్న ధోరణిలో ఫాంటసీలను వండి వార్చేయవచ్చు. ఫాంటసీలు ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తిరగ్గొడతారు. మనవాళ్లు ఉత్తమెతక కాబట్టి, దేవతల్ని జోకర్లుగా చూపించినా భరిస్తున్నారు. ఈమధ్య ప్రజల ధోరణి మారింది.

Pages