S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

05/16/2016 - 21:20

‘టైం ట్రావెల్’ లేదా ‘టైమ్ ఫ్రీజ్’ అంటూ కాలంతో ముడిపెడుతూ వచ్చిన సినిమాలు లెక్కలేనన్ని. ఈ జీవన చక్రంలో ఒక్క క్షణం వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే ఎంత బావుంటుంది. అడ్వాన్స్ కాలంలో ప్రయాణించడం ఎంత గొప్ప అనుభూతి -లాంటి ఆలోచనలతో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయ. సూర్య హీరోగా విక్రమ్‌కుమార్ తీసిన సినిమా సైతం తీసిపారేయ తగ్గది మాత్రం కాదు.

05/09/2016 - 22:40

సినిమా పరిశ్రమలో కష్టం ఒక్కటే కాదు, టైం కూడా కలిసి రావాలి. రెండూ కలిసొచ్చిన వాళ్ల రేంజ్ టాప్‌కు చేరిపోవడం చూస్తూనే ఉంటాం. నారా రోహిత్‌కు టైం కలిసి రావడం లేదు. తనస్థాయి హీరోలతో పోలిస్తే -లెక్కకు మించి సినిమాలు చేస్తున్నా, వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నా, నటనలోనూ మిగిలిన వాళ్లకంటే మెరుగ్గానే ఉన్నా -కెరీర్‌ను ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉన్నట్టు ఉండిపోయాడు.

05/02/2016 - 21:39

స్క్రీన్ చించేస్తున్న బాలీవుడ్ సెక్స్ బాంబుల గురించి వ్యాసం బావుంది. షకీలా రాకముందే మలయాళ చిత్రాలపై సెక్సీ ముద్ర ఉండేది. నిజానికి ఆ కథలు కాస్త బోల్డ్‌గా ఉండేవి తప్ప శృంగారం మితిమీరేది కాదు. ఆ బోల్డ్‌నెస్‌నే సెక్సీ అనేవారు. ఇప్పుడు పచ్చి శృంగారమే బాలీవుడ్‌ని ముంచెత్తుతోంది. అయితే పబ్బులు, వీడియో పార్లర్లు, లాప్‌టాప్‌లు వచ్చాక యువత అటు మళ్లింది.

04/25/2016 - 21:34

విష్ణు, రాజ్‌తరుణ్‌లు ఇద్దరు కలిసి హీరోలుగా నటించిన ‘ఆడో రకం ఈడో రకం’ చిత్రం బోరు బోరుగా సాగింది. సినిమాలో సరైన కథాకథనాలు లేకుండా కేతిగాళ్లకన్నా ఘోరమైన నటనతో ఇద్దరు హీరోలు సినిమాను అటకెక్కించారు. దర్శకత్వ ప్రతిభ కూడా ఏమాత్రం ఎక్కడా కనబడదు. అతని గత సినిమాలు గుర్తుచేసుకుని ఈ సినిమాకు వెళితే బోరుకొట్టేసింది. హీరోయిన్లు కూడా ఏమాత్రం సినిమాను నిలబెట్టలేకపోయారు.

04/19/2016 - 00:30

ఈవారం వచ్చిన ‘ది జంగిల్ బుక్’ సినిమా పిల్లలకు షడ్రసోపేతమైన విందులాంటి చిత్రం. మొదటినుండీ సినిమా అయిపోయేంతవరకూ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో అలరించిన ఈ సినిమాను ప్రతివారూ తప్పక చూడదగిందే. ప్రస్తుతం సాంకేతికంగా సినిమా ఎంత అభివృద్ధి చెందిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా జంతువుల ముఖాలలో నటన చూస్తే ముచ్చటేసింది.

04/11/2016 - 22:06

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

04/11/2016 - 21:51

తారల ప్రేమలు, ఎంగేజ్‌మెంట్లు, వివాహాలు, విడాకులు తోసుకురాడానికి రద్దవడానికి సంపాదన హెచ్చుతగ్గులే కారణమని స్థూలంగా చెప్పొచ్చు. పెళ్లివరకు రాకుండానే ఎన్నో ప్రేమలు ఎండిపోయాయని మనకు తెలుసు. వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దయిన బాధలో త్రిష విరామం లేకుండా నటించేస్తున్నదనడం కేవలం భ్రమ. చేతిలో చిత్రాలు లేనప్పుడు ఎంగేజ్‌మెంట్ జరిగింది. చిత్రాలు రాగానే రద్దయ్యంది. చాలామంది అంతే.

04/04/2016 - 21:58

నవ శకానికి నాంది. రొటీన్ చిత్రాలకు చెంపదెబ్బ. నటనకు కొత్త భాష్యం. నవ దర్శకులకు మార్గదర్శనం. సకుటుంబ సపరివార చిత్రం. మండు వేసవిలో ఒయాసిస్సు. తెలుగువారికి పన్నీటి జల్లు. తెలుగువాడి స్టామినా. బంధాలను హృదయానికి చేరువచేసిన చిత్రం. కోమాలోవున్న తెలుగు సినిమాకు సరికొత్త -ఊపిరి
- నవీన చైతన్య, హైదరాబాద్

03/28/2016 - 22:18

తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విశాల్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పుడొస్తున్న చాలామంది హీరోలకంటే మంచి పెర్ఫార్మెన్స్, సత్తా కలిగిన హీరోయే అయనా, ఎందుకో ఇక్కడ అతనికి స్థిరమైన మార్కెట్ ఉండటం లేదు. యాక్షన్, ఎమోషన్స్ పలికించగలగటంలో నేర్పరే అయనా, తమిళ్ నుంచి డబ్బింగ్ అవుతున్న అతని సినిమాలు తెలుగు ఆడియన్స్‌కు దగ్గర కాలేకపోతున్నాయ.

03/21/2016 - 22:36

సినిమా ప్రారంభం రెంటితో, ఇంటర్‌వెల్‌లో ఒంటితో తీసిన జాతీయ అవార్డు గ్రహీత సత్తారు సత్తా ఏమిటో గుంటూర్ టాకీస్‌తో వెల్లడైంది. ఈ సినిమా తర్వాత గతంలో సత్తారుకిచ్చిన అవార్డుని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. దిగజారుడుతనానికి పరాకాష్ఠ ఈ సినిమా. ఏం ఆశించి సినిమా తీశారో వారికే తెలియాలి. నరేష్‌లాంటి సీనియర్ నటుడు నటించాల్సిన సినిమానా ఇది?

Pages