మీ వ్యూస్

చెత్త సినిమాలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూతు సినిమాలు రూపొందించడంలో మాస్టర్ అనిపించుకున్న మారుతి, క్లీన్ ఎంటర్‌టైనర్‌గా పబ్లిసిటీ చేసుకున్న ‘రోజులు మారాయి’ పరమ చెత్తగా వుంది. బూతు డైలాగులు, స్కిన్ షో లాంటివి జుగుప్స కలిగించాయి. సమాజం, భారతీయ థార్మిక వ్యవస్థ ఏర్పాటుచేసిన కట్టుబాట్లు, సంప్రదాయాలు అన్నీ ట్రాష్, వాటన్నింటినీ గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయండంటూ చచ్చు, పుచ్చు సలహాలిచ్చి రూపొందించిన సినిమాను సెన్సారుబోర్డు ఎలా అనుమతించిందో అర్థంకాదు. కామెడీ పేరిట బూతు, శృంగారంపేరిట అంగాంగ విన్యాసాలు, మధ్యలో జ్యోతిష్య శాస్త్రంపై కుళ్లు జోకులు.. ఇలా అర్థంపర్థం లేకుండా సాగిన సినిమా రోజులు మారాయి. రేష్మిలాంటి ఆర్టిస్టులు దొరికితే మారుతిలాంటి వాళ్లు అలాగే రెచ్చిపోతారేమో.
-ఎం.కనకదుర్గ, తెనాలి

మన హీరోలంతే!
ఈ కాలపు సినిమా హీరోలంతా పరమ స్టైల్‌గా, ధనవంతులుగా, బలవంతులుగా అందరికన్నా చాలా తెలివిగలవారుగా కష్టమైన సమస్యలను చిటికెలో తీర్చేవారిగా, హార్డ్‌కోర్ విలన్లను మట్టికరిపించేవారుగా వుంటున్నారు. ఏ హీరో అయినా ఇదే పద్ధతి. హీరోలకన్నా అందంగా వున్న ఇతర నటులమీద మనసుపోదు హీరోయిన్లకు. సరైన కథ వుండదు. ఉన్నా కథనం ఉండదు. మాటలు, పాటలు సందర్భోచితంగా రావు. హీరో హీరోయిన్లకు కోట్లు కుమ్మరించాలి. ఐటెం వయ్యారికి కోటిపైనే! ఇలా ఇచ్చుకుంటూ పోతే నిర్మాత బతుకు డిజాస్టరైపోతుంది. ఎప్పుడూ ఒకేమూస కథలేనా? జానపదాలకు, చారిత్రాలకు, పౌరాణికాలకు కాలం చెల్లిందా? నేటి సమాజంలో అనేక సమస్యలున్నా వాటిని వదిలేసి కాకమ్మ కథలే తీస్తున్న హీరోల్లో మార్పు రాదా?
-ఎన్.పద్మావతి, హైదరాబాద్

చావడానికా సెల్ఫీలు?
అల్లరి నరేష్ కథానాయకుడుగా వచ్చిన సెల్ఫీరాజా చిత్రం బోర్ రాజాగా నిలిచింది. నరేష్‌ను చూసి సినిమాలకు వెళ్లే పరిస్థితి పోయింది. ఈ సినిమాను మొదట్లో గొప్ప సినిమాగా ఊదరగొట్టారు. కానీ తొలి రోజు తొలి ఆటతోనే సెల్ఫీరాజా కాస్తా ఆత్మహత్యలు చేసుకునే రాజాగా మిగిలిపోయాడు. చివరికి ప్రేక్షకులు కూడా థియేటర్ బయటకు వచ్చి అదే దారిలో పోతారు కాసేపు. అంత ఘోరంగా చిత్రీకరణ ఉంది. ఇలాంటి సినిమాలు ఎవర్ని ఉద్ధరించడానికి తీస్తారు. కొద్దోగొప్పో సినిమాలో కథాకథనాలు ఉండాలి కదా? ఏమీ లేకుండా కేవలం నరేష్ అనే మంత్రంతో సినిమాను రూపొందిద్దాము అనుకుంటే ఇలాంటి సొంత డబ్బా రాజాలు తయారవుతారు. ఇప్పటికైనా అల్లరి నరేష్ మారాలి!
- టి.రఘురామ్, నరసరావుపేట

కన్న ప్రేమకు దూరం
శాస్తజ్ఞ్రులు ఒకందుకు నూతన ఆవిష్కరణలు చేస్తే, సమాజం మరొకందుకు దాన్ని వ్యతిరేకించి దుర్వినియోగం చేస్తుంది. బిడ్డల్ని కనలేని నిర్భాగ్య వనితకు వరప్రసాదంలా సరోగసి (అద్దెగర్భం) అనే అంశం ప్రచారంలోకి వచ్చింది. గర్భం ధరించే బాధ మనకెందుకు? డబ్బు పారేస్తే ఎవతో ఒకతి మనకోసం కనిపెడుతుంది అనుకునే నాజూకు వనితలు దుర్వినియోగం చేస్తున్నారు. ఆరు నెలలు షూటింగ్‌కి దూరం అయితే కెరీర్ నాశనమవుతుందని ఈ పాలబడుతున్నారు. అద్దెబిడ్డలను తెచ్చుకొని కన్నప్రేమకు దూరం అవుతున్నారు. వీరికి కెరీర్, డబ్బు ముఖ్యం కదా మరి!
- కె.లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

సోఫాలు అడ్డమా?
సోఫాలు, మంచాలు, చెక్కతలుపులు, బీరువాల చాటున ఉండి ఎదురుకాల్పులు జరుపుతున్నట్లుగా చూపించిన దృశ్యాలు చాలానే వచ్చాయి. అవతలివారు జరిపే కాల్పులనుండి ఇవన్నీ ఎలా తట్టుకోగలవో మరి! ఇంకా మిషన్ గన్లనుండి వెలువడే బుల్లెట్లకుకూడా అవి చెక్కుచెదరనట్లుగా చూపించడం మరీ మరీ వింత. హేతుబద్ధత, నిబద్ధత లేకుండా సినిమాలను తీయడం చాలామందికి ఇప్పుడు వినోదమైంది. కేవలం ఒక బాణం, ఒక విల్లు ఉన్నవాడు మాత్రమే పెద్ద కత్తులతో దాడి చేస్తున్న వారిని భయపెట్టి పారిపోయినట్లు ఓ జానపద చిత్రంలో చూపించారు. ఇలాంటివి చూసి నవ్వుకోవడం కూడా మర్చిపోతున్నాం.
-నున్నా మధుసూధనరావు, హైదరాబాద్

పారితోషికాలు!
ఈమధ్య తరచుగా తారల పారితోషికాల గురించి మీడియాలో ఊదరగొడుతున్నారు. అవి నిజాలైతే ఫరవాలేదు. కానీ కాస్త మసాలా చేర్చి ఫలానా తార ఇంత డిమాండ్ చేసింది, నిర్మాత గుడ్లు తేలేసి పొమ్మన్నాడు అంటున్నారు. పైగా ఎక్కువ డిమాండ్ చేయడం దుర్మార్గం, దురాశ, ఆమెకంత సీను లేదు అంటూ తీర్పులు చెప్పేస్తున్నారు. సినిమా అంటే సప్లై, డిమాండ్‌ల మీద ఆధారపడిన వ్యాపారం. తారలు డిమాండ్ చేసినా, నిర్మాతలు ఇచ్చినా అదంతా లాభనష్టాల బేరీజు వేశాకే జరుగుతుంది. మధ్యలో మీడియాకెందుకు బాధ?
- సి.మైథిలి, సర్పవరం

బాగు బాగు
మొదట జాతీయ అవార్డులు, తర్వాత ఫిలిమ్‌ఫేర్ అవార్డులు ఇప్పుడు సైమా అవార్డులు కొల్లగొట్టింది బాహుబలి. అయితే ఫిలిమ్‌ఫేర్ సైమా అవార్డులు దక్షిణాధిలోని నాలుగు భాషలకు వేరువేరుగా అవార్డులు ఇచ్చినా మన మీడియా మాత్రం తెలుగు అవార్డులనే హైలెట్ చేస్తూ మిగిలిన భాషల్ని పట్టించుకోదు. అయితే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషలలోని ఉత్తముల గూర్చి ఆసక్తి చూపుతారు. అన్ని వివరాలు కాకపోయినా ముఖ్యంగా ఉత్తమ చిత్రం, నటుడు, నటిలాంటి విషయాలైనా తెలుగు మీడియా ప్రసారం చేస్తే బాగుంటుంది.
- జె.జ్ఞానబుద్ధ, సిద్ధార్ధనగరం

అర్ధనారిలో అర్ధం
ప్రయోగాత్మక ప్రయత్నం చేసిన భానుశంకర్ అభినందనీయుడు. అతని ఆలోచనలు బాగున్నాయి. ఇలాంటి కథలు ఇంతకుముందు వచ్చినా సినిమా తీసిన విధానం సరికొత్తగా ఉంది. సమాజంలో జరిగే అన్యాయాలతో చేసిన పోరాటం బాగుంది. ప్రతి ఒక్క పౌరుడు చూడదగిందే. అర్ధనారి టైటిల్ మొదట్లో విన్నప్పుడు ఏదో చెత్తబూతు సినిమా అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత మంచి పేరే అని తెలుసుకున్నాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఎంత అర్ధమైందో ఆలోచించాలి.
- గాడిపల్లి బాగేష్, ముషీరాబాద్