మీ వ్యూస్

ఇంకెప్పుడో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపం.. సుమంత్ అశ్విన్. అతని కష్టానికి తగిన ఫలం దక్కడం లేదు. విసుగూ విరామం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా.. ఒక్కటీ అతని కెరియర్‌కు బ్రేక్ త్రూ కావడం లేదు. అతని ఈడు హీరోలంతా అలాఅలా పైకి ఎదిగిపోతుంటే, ఈసారైనా సినిమా పడకపోతుందా అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పాపం. తాజాగా విడుదలైన రైట్ రైట్ కూడా అతని కెరియర్‌కు రైట్ చెప్పలేకపోయంది. ..హోల్డాన్! అంటూ బ్రేక్ వేసేసింది. పెయర్‌గా చేసిన పూజాజవేరికి పడినన్ని మార్కులు కూడా సుమంత్ అశ్విన్‌కు ఆడియన్స్ వేయలేకపోయారు.
ఏమో గుర్రం ఎగరకపోతుందా? అన్న ఆశతో అశ్విన్ మరో సినిమాకు సిద్ధమవుతున్నాడట. చూద్దాం వచ్చే సినిమా అయనా వర్కవుటౌతుందేమో..
అలుగు సురేంద్ర, అమలాపురం
కొత్త మాట
కాపీ ర్యాట్స్ కొత్త పదం బాగుంది. కాపీ రైట్ అంటే మనవారి దృష్టిలో కాపీ చేయడమని. మొదట కథలే చోరీ అయ్యేవి. ఇప్పుడు సినిమాలు, సన్నివేశాలు, సంగీతం కూడా! ఆనాటి గొప్ప చిత్రాలు బంగారుపాప, గుండమ్మకథ, రాముడుభీముడు లాంటి ఎన్నో చిత్రాలకు ఆంగ్ల నవలలే ఆధారం. పూర్తి కాపీ అయినా, సన్నివేశాలు కాపీ అయినా, మనసు దోచుకుంటే చాలు మనవాళ్లకి. తను ప్రఖ్యాత రచయిత అయ్యుండి త్రివిక్రమ్ అంతటివాడు మీనా చిత్రాన్ని కాపీచేసి, ఆ రచయిత్రికి సారీ చెప్పి పారితోషికం చెల్లించి టైటిల్స్‌లో ఆమె పేరు వెయ్యాల్సి వచ్చింది. హతవిధీ!
-జె ధర్మతేజ, గోడారిగుంట

అతనికేమైంది?
ఈమధ్య విజయనిర్మల, నరేష్ ఉన్న వీడియో అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. అందులో 40 ఏళ్ల తర్వాత ఇప్పుడే కుటుంబమంతా కలసి చూడగల కుటుంబ చిత్రం వచ్చిందని బ్రహ్మోత్సవాన్ని పొగుడుతూ చెప్పాడు నరేష్. మహేష్ ఉత్తమ నటనకు రాష్ట్ర, జాతీయ అవార్డులొస్తాయనీ చెప్పాడు. ఆ పొగడ్తలకు ప్రతిస్పందనగా కొన్ని చిత్రాలనుండి క్లిప్పింగ్స్ వెటకారంగా చూపించారు. అతనికి పిచ్చిగానీ పట్టిందా? ఇలా మాట్లాడుతున్నాడు లాంటి వెటకారాలతోపాటు తూచ్ అన్న నాలుక బయటపెట్టి వెక్కిరించే క్లిప్పింగూ ఉంది. అతిగా పొగిడితే అంతేమరి. నరేష్ ఆ చిత్రం బయ్యర్స్‌ని కలిసి మాట్లాడితే బండారం బయటపడింది!
-ఎన్ గిరి, కాకినాడ

చాలా గుర్తుకొచ్చాయి..
గుర్తుకొస్తున్నాయి వ్యాసం ఆనాటి నేల టిక్కెట్లు, టూరింగ్ టాకీసులు, రిక్షాలమీద, బండ్లమీద సినిమా ప్రకటనలు చేయడం, ఆలసించిన ఆశాభంగం అంటూ మురిపించడం, సినిమా చూసేవారి మనోభావాలు.. ఇలా అన్నీ మరల మరల గుర్తుకుతెచ్చారు.
మరో ఉదాహరణేమంటే సినిమా మొదలయ్యేముందు, అయిన తర్వాత మరో ఆట వేసేముందు ఎత్తుగా అమర్చిన మైకుల్లో నమో వెంకటేశాయ అన్న భక్తిగీతాన్నో, లేక మరో భక్తిగీతాన్నో వేసేవారు. ఆ పాట చుట్టుపక్కల వారందరికీ వినిపించి సినిమాకు సమాయత్తమయ్యేవారు. నేల టిక్కెట్టు పావలా. బాల్కనీ రూపాయిన్నర. గతమంతా మధుర స్మృతుల మయమేకదా! పాత రోజులు కళ్లకు కట్టినట్టు వ్యాసంలో రాయడం అభినందనీయం. ఈతరం ప్రేక్షకులకు ఆనాటి సినిమా విషయాలు తెలియజేయడం ఎంతో బావుంది. ధన్యవాదాలు.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్
- ఎస్‌డి మొహియుద్దీన్, పొన్నూరు

రిస్క్ తీసుకుంటాడా?
మహేష్, దీపిక కాంబినేషన్ అంటూ కొంతకాలం హల్‌చల్ జరిగింది. అది సాధ్యంకాదన్న మాటలు వెలువడ్డాయి. చివరకు అదే జరిగింది. మహేష్ ఇప్పుడు పరిణితి చోప్రాతో సద్దుకున్నాడు. ఇప్పుడు చిరంజీవి, దీపిక పదుకొనే అంటున్నారు. ఈ కాంబినేషన్ సింహం, చిట్టెలుకలాగ ఉంటుంది. పైగా దీపిక పారితోషికం 15 కోట్లు పైమాటే. ఆమెవల్ల చిత్ర నిర్మాణం ఖర్చులు పాతిక కోట్లు పైగా పెరుగుతుంది. బాలీవుడ్‌లో దీపిక టాప్ కావచ్చు. కానీ దక్షిణాది వారికి బక్కపలుచని భామలు అక్కరలేదు. ఈమధ్య బిగ్ బడ్జెట్ చిత్రాలు ఢాం అంటున్నాయి. హీరోయిన్ విషయంలో చిరంజీవి రిస్క్ తీసుకుంటాడా? అందుకేనేమో.. పక్క వాయిద్యాల్లా నయనతార, అనుష్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బహుశ, చివరకు వచ్చేది అక్కడికే కావొచ్చు.
-కె లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

బిచ్చగాడు అద్భుతం
విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు అందరి హృదయాలను దోచుకుంది. తల్లి అనారోగ్యంతో ఉండడంవల్ల ఓ సాధువు చెప్పిన విధంగా హీరో బిచ్చగాడిగా జీవించాలనుకోవడం సరికొత్తగా ఉంది. వెయ్యి కోట్ల ఆస్తివున్నా 48 రోజులు బిచ్చగాడిగా బ్రతికి మనసుల్ని కొల్లగొట్టాడు. బిచ్చగాణ్ణి ప్రేమించిన అమ్మాయి బిచ్చం వేస్తానంటే ప్రియురాలి ముందర వంగి బిక్షం అడగడం సినిమాకు హైలెట్. 48 రోజులు తర్వాత తల్లి ఆరోగ్యం కుదుటపడి ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం వెనక బిచ్చగాడు పడినపాట్లు ఎవరూ పడకూడదన్న విధంగా హీరో నటించాడు. సోషల్ వర్క్ అంటూ పేద రోగులను, మానసిక రోగులను పరీక్షల పేరిట బలిచేస్తున్నవారిని జైలుకు పంపించడం బాగుంది. అమ్మ ప్రేమకన్నా మించినది లేదని ఈ సినిమా నిరూపించింది.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

గొప్ప సాహసమే
పిచ్చైకారన్ చిత్రాన్ని బిచ్చగాడిగా విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. విజయ్ సంగీత దర్శకుడిగానే కాక హీరోగా మార్కులు కొట్టేశాడు. హీరోయిన్ చక్కని హావభావాలు పలికించి, అందంగా కనిపించింది. ఎక్కడా బోర్ కొట్టకుండా తీసిన ఈ సినిమాని ప్రతి బిలియనీర్, ప్రతి బిచ్చగాడు తప్పక చూడాల్సిందే. అసలు బిచ్చగాడు పేరుమీద సినిమా విడుదల చేయడమే గొప్ప సాహసం. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది.
-టేకి రామకృష్ణ, పొందూరు