మీ వ్యూస్

ఇధో గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిచేస్తే గతి చెడుతుందని కబాలి నిరూపించాడు. ఉద్యోగులకు సెలవు, వయోవృద్ధులకు ఫ్రీ టిక్కెట్లు, స్పెషల్ విమానాలు, పది వేల థియేటర్లలో విడుదల, రజని వెండి నాణాలు ఇలా ఎన్నో. ఈమధ్య ఏ చిత్రానికీ ఇంత ప్రచారం లేదు. అదే దెబ్బతీసింది. అభిమానులవల్ల కొద్దిపాటి లాభాలు రావచ్చేమోగానీ మొత్తానికి నిరాశపర్చింది. అంతర్జాలంలో జోకులే జోకులు! అందర్నీ ఏడిపించే ఉల్లిపాయ కబాలి పాట్లుచూసి తనే ఏడ్చిందట. క్లైమాక్స్‌లో ఆవులింతలు వచ్చాయని కొందరు నిద్రపోయామని ఇంకొందరు. ఫ్రీ టికెట్లు ఇచ్చారుకదాని చూస్తే తలనొప్పి పట్టుకుందని మరి కొందరు. అతి సర్వత్రే వర్జయేత్ అని చెప్పారుకదా పెద్దలు.
- ప్రభాస్, గాంధీనగర్

మనవాళ్లేం తక్కువ?
మనకు జాతీయస్థాయి అవార్డులు రాకపోడానికి అక్కడ రాజ్యమేలుతున్న కుళ్లు రాజకీయాలు, పక్షపాత ధోరణి, పైరవీలు కారణమని ఒక పాఠకుడు అన్నారు. పైరవీలు, లాబీయింగ్, కుళ్లు రాజకీయాలు చేయడంలో మనవాళ్లూ ఎవరికీ తీసిపోరు. అయినా మనకు అవార్డులు రాలేదు. ఎవరికంపు వారికి ఇంపు. మన చిత్రాలు మనకు గొప్ప. మన చిత్రాలస్థాయి ఎలాంటిదో ‘కొత్త పొద్దు పొడవాలి’ వ్యాసంలో చక్కగా వివరించారు. చదవండి.
-మరుదకాశి, కరప

దీన్ని ఏమంటారు?
నట సార్వభౌమ కైకాల సత్యనారాయణను చిత్ర పరిశ్రమ మరువటం ధర్మమా? ఎస్‌వి రంగారావు తర్వాత చిత్రసీమలో ఆ లోటును భర్తీచేసిన ఘనాపాటి సత్యనారాయణ. మహానటి కళాభినేత్రి సావిత్రి, ఎస్‌వి రంగారావు, కైకాల సత్యనారాయణ.. ఏ అవార్డు, రివార్డులకు అర్హులుకారా? భాషని ఉచ్ఛరించడం చేతగాని అనర్హులకు అవార్డులు, రివార్డులా? చిత్రసీమలో వారు దీన్ని ఏమంటారు? సహజ నటులను గుర్తించరా? టివి ఛానల్స్‌లో సీరియల్స్, జబర్‌దస్త్ కార్యక్రమాల్లో చాలా జుగుప్సాకర సన్నివేశాలు, తప్పుడు పదజాలాలు ఉపయోగిస్తున్నారు. దయతో మీ సెన్సార్ కమిటీ గమనించి, రాబోయే రోజుల్లో కాస్త మార్పుచేయించ ప్రార్థన!
-ఎం ఆనందరావు, వేగివారిపాలెం
ఇద్దరూ ఇద్దరే
ఒకేసారి చిత్ర రంగంలోకి వచ్చిన రజని, కమల్ ఇద్దరికీ ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ గాడ్‌ఫాదర్ లాంటివాడు. నటనకంటే స్టైల్‌కి ప్రాధాన్యం యిచ్చి రజని మాస్ స్టార్ అయ్యాడు. క్లాస్ నటనకు వెరైటీకి ప్రాధాన్యం ఇచ్చిన కమల్ కలక్షన్ల విషయంలో రజనికంటే క్కువగ నిలిచాడు.
ముంబయి డాన్ వరదరాజన్ స్ఫూర్తితో మణిరత్నం కమల్‌తో తీసిన చిత్రం నాయకన్ (తెలుగులోనూ వచ్చింది). ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. తనతో అలాంటి చిత్రం చెయ్యమని రజని మణిరత్నంని కోరినా కుదరలేదు. కానీ ఇప్పటికి రజని ‘కబాలి’ చిత్రంతీసి ఆ కోరిక తీర్చుకున్నాడు -కాని ఫలితం ఏమిటో ప్రేక్షకులకు తెలుసు!
-శాంతిసమీర, వాకలపూడి

వాస్కోడిగామా వద్దు
మహేశ్ కొత్త చిత్రానికి ‘వాస్కోడిగామా’ అని పేరు పెడుతున్నట్టు కథనాల్లో వినిపిస్తుంది. అదెంత మాత్రమూ బాగోదు. పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కోడిగామా 1498లో కేరళలో ప్రవేశించి హిందువులను హింసించి మతమార్పిడి చేశాడు. భారత స్ర్తిలు మానభంగాలకి, బలవంతపు పెళ్ళిళ్ళకి గురయ్యారు. అటువంటి ఘోరకృత్యాలు చేయించిన వాస్కోడిగామా పేరుని ఎందుకు నిర్ణయించుకున్నారో మరి! టైటిల్ మార్చుకుంటే మంచిది. ‘హీరో ఇమేజీ’ ప్రభావం వలన వెర్రిబాగుల జనాలకి ఇలాంటి విషయాలు సహజంగానే పట్టవు. జనం అజ్ఞానాన్ని డబ్బు చేసుకోవాలని భావించటం మరీ అజ్ఞానం తప్ప మరేమీ కాదు.
-నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

ఏదీ అభ్యుదయం!
అభ్యుదయ భావాలుగల దర్శకులు విప్లవాత్మకమైన సినిమాలను నిర్మించి ప్రజలను మేల్కొల్పిన సంఘటనలు ఉన్నాయి. కెబి తిలక్ -్భమికోసం, లంబాడోళ్ళ రాందాస్, ప్రభాకర్‌రెడ్డి నాకు స్వాతంత్య్రం వచ్చింది తీశారు. అనంతరం విప్లవాల బాటలో నడిచిన వారిలో బి నరసింగరావు -మాభూమి, రంగుల కలలు, కుక్క... వంటివి తెరకెక్కించారు. విప్లవ సినిమాలతో ఉర్రూతలూగించి పాటలు జనరంజకంగా తట్టిలేపేవిగా ఉన్న సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించినవారిలో మాదాల రంగారావు ప్రథమంగా చెప్పవచ్చు. ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, విప్లవశంఖం, మహాప్రస్థానంలాంటివి ఉదాహరణలు. తదనంతరం టి కృష్ణ నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు, రేపటి పౌరులు, వందేమాతరం, ప్రతిఘటన.. వంటి అభ్యుదయ భావాలు కలిగిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. తదనంతరం ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా చెప్పాలి. అర్ధరాత్రి స్వతంత్రం, దండు, చీకటి, ఎర్రసైన్యం, సూర్యుడు, ఒరేయ్ రిక్షా, తెలంగాణ, దండకారణ్యం ఇంకా ఎన్నో ఉదాత్త సినిమాలు నిర్మిస్తూ తాను ఎంచుకున్న బాటలో నేటికి నడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏడాదికి ఒక్కటైనా అలాంటి చిత్రాలు రాకపోవడం దారుణం.
-ఎ రఘురామరావు, ఖమ్మం
భలే కామెడీ...
హాస్యం అనేది ఇప్పటిలాకాక, హాస్య పాత్రధారి ద్వారానే సృష్టించి ప్రేక్షకులను అలరించడమనే పద్ధతి గతంలో ఉండేది. కాని, అలనాడూ హీరో హీరోయిన్‌ల ద్వారా ఘొల్లున నవ్వించిన సందర్భాలూ లేకపోలేదు ప్రయోగాత్మకంగా. హీరోగారు హీరోయిన్‌తో -ఆనాడు మన ‘తొలి రాత్రి’ ఎంత మధురం అని గతంను జ్ఞాపకం చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఆరోజు ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు? అంటుంది. హాల్లో ప్రేక్షకులు నవ్వులు ఆపుకోలేక శతమతమైనారు. చిత్రం పేరు రాజా రమేష్. వాణిశ్రీ నాగేశ్వర్రావులు నాయికా నాయకులు. పాఠకులతో సరదా పంచుకుంటానికి ఇది.
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్