మీ వ్యూస్

నాని లోకలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయి ప్రేమకోసం బెంగళూరు ఉద్యోగాన్ని వదిలేసి ఊళ్లో ఉండిపోతాడు హీరో. ప్రేమ కాస్తా పెళ్ళి దగ్గరకు వచ్చేలోగా బ్రేకప్ చెప్తాడు. తరువాత హైదరాబాద్ అమ్మాయికి కనెక్టవుతాడు. అదీ కన్ఫర్మయ్యే దశలో పాత లవ్‌స్టోరీ మొదలెడతాడు. నాని స్టయల్‌కు సరిగ్గా సరిపోయే కథ ఇది. అందుకే మళ్లీ హిట్టుపడింది. వరుస హిట్లతో మీడియం హీరోల రేంజ్ దాటేసిన నాని -కెరీర్‌ను ప్లాన్డ్‌గా నడిపిస్తున్నట్టే కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రాలవైపు పరుగులు పెట్టకుండా తనకో ట్రాక్ క్రియేట్ చేస్తున్న నానికి -ఉయ్యాలా జంపాలాతో మెగాఫోను పట్టిన వైవిద్య దర్శకుడు విరించి వర్మ ‘మజ్ను’తో మరో హిట్టివ్వడం నాని అదృష్టం. ‘నేను లోకల్’ అనిపించుకునేందుకు రెడీ అవుతున్న నాని నుంచి వచ్చే ఏడాది మరో మంచి సినిమా వస్తుందని ఆశిద్దాం.
భార్గవి, రాజమండ్రి
ధ్రువతార
అక్కినేనిపై వెనె్నలలో వచ్చిన ధ్రువతార వ్యాసం ఆంధ్రుల అభిమానానికి దర్పణం. మన సినిమాల్లో ఏడుపు సన్నివేశాల్లో గ్లిజరిన్ ఉపయోగించి వెక్కిళ్లుపెడుతూ ఐదు నిమిషాల స్పీచ్ కొడితేగానీ ప్రేక్షకులకు సంతృప్తి ఉండదు. హాలీవుడ్‌లో ఏడుపు అంటే తలవొంచి కళ్లలో బాధ. ఒక కంటిలో కన్నీటి కణం, నుదుటి బాధను సూచించే రెండు మూడు ముడతలు, కాస్తంత శరీర భాష. బాలీవుడ్ ఏడుపు ఈ రెంటికీ మధ్యస్తంగా ఉంటుంది. మనవాళ్లు ఏడుపు చూసి వాళ్లు, వాళ్ల ఏడుపు చూసి మనమూ నవ్వుకుంటాం. ప్రాంతాన్ని బట్టి నటన తీరు మారుతుంది. ఒక ప్రాంతం నటులతో మరో ప్రాంత నటులతో పోల్చరాదు. అలాంటి పరిస్థితే వస్తే పొగడటమే మర్యాద.
కె సుభాష్, శ్రీనగర్
ఆస్కారం
ప్రత్యేక నిధితో ఆస్కారముందా? అన్న ప్రశ్న సమంజసమే. సమాధానమూ తెలిసిందే! ఎందుకంటే మేము అవార్డుల కోసంకాక, ప్రజల వినోదం కోసం సినిమాలు తీస్తున్నామని ముందుగానే మనవాళ్లు చేతులెత్తేస్తారు. తెలివిగల వాళ్లేకదా! అవార్డు చిత్రాలు ప్రేక్షకులు చూడరని మనవారి నిశ్చితమైన అభిప్రాయం. నిజానికి మన వాళ్లకు స్క్రీన్‌ప్లే రాసుకోవడం చేతకాదు. వ్యక్తిత్వంతో కూడిన పాత్రను తీర్చిదిద్దడం అసలు రాదు. అవార్డు రావాలంటే కల్లబొల్లి కల్పనలు కాక, ఒక సమస్యను హృదయాలు కదిలించేలా పదునుగా చూపగలగాలి. అందుకు సైకాలజీ తెలిసివుండాలి. మనవాళ్లకు ఆలోచన అంటే భయం. ఎంతసేపూ రొట్టకొట్టుడేగాని సృజనాత్మకంగా ఆలోచించడానికి టైం ఉండదు. మరి అవార్డులు ఎలా వస్తాయి?
పి అభిలాష, కాకినాడ
దీనర్థమేంటి తిరుమలేశా?
రజనీకాంత్, మోహన్‌బాబుల మిత్రత్వం గురించి ప్రేక్షకులకు తెలుసు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినా, ఈయన చెన్నైకి వెళ్లినా ఇద్దరూ కలుస్తూనే ఉంటారు. ఈమధ్య ఇద్దరూ రజనీకాంత్ ఇంట్లో కలిశారు. రజనీకాంత్ భార్య లత, మోహన్‌బాబుకు రాఖీ కట్టి ఆదరించింది. ఆ ఫొటోలు ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మోహన్‌బాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్ రాజులాగ కనిపిస్తున్నాడని, ఆయన ఈ స్థితిలో ఉండటానికి లతే కారణమన్నారు. ఈ కలియుగంలో ఆయన దుర్యోధనుడైతే నేను కర్ణుడిని అని ట్వీట్ చేశారు. దుష్టతచుష్టయం అని అందరూ చెప్పుకునే ఆ నలుగురిలో ఇద్దరితో ...తనను, రాజనీని పోల్చడం ఏమిటో అర్థంకాలేదు.
కె లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట
వెలిగిన వెనె్నల
వెనె్నల కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. 1966లో వచ్చిన భక్తపోతనలో గుమ్మడి, ఎస్వీ రంగారావు, అంజలిలాంటి వారు నటించినా ఆ చిత్రం పరాజయం పాలైంది. అదీకాక ప్రముఖులచే విమర్శలకు గురైంది. గుమ్మడి చాలా నిరాశ చెందాడని, ఆయన తీపిగుర్తులు, చేదు అనుభవాలను తెలుపడం బావుంది. బహుశ ఇందుకు కారణం నాగయ్య పోతన -ప్రేక్షకుల మదిలో పాతుకుపోవడమే కావొచ్చు. ఇంకొకటి -కేవీ రెడ్డిలాంటి ఉద్దండ దర్శకుడు గుండమ్మకథ సినిమాకు ఇదేంపేరని ఎగతాళి చేసినా, ఆయన శిష్యుడు కమలాకర కామేశ్వర రావు మరింత పట్టుదలతో స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లేతో అఖండ విజయానికి కారణమయ్యాడు. మరొకటి -ఏ సినిమాలో నటించినా తన నెల్లూరు భాషాశైలిని వదలక సినిమాలు హిట్టుకావడానికి దోహదపడిన రమణారెడ్డి విషయాలు బావున్నాయి.
-ఎన్ రామలక్ష్మి, సికింద్రాబాద్
మనవారి వంతు
వ్యాపారం పేరుతో గతంలో ఆంగ్లేయులు మన దేశం వచ్చి మోసం చేసి మన సంపదను దోచుకెళ్లారు. ఇప్పుడు అది మన వారి వంతైంది. హాలీవుడ్ నిర్మాతలను మన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు అలాగే దోచుకుంటున్నారు. హాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్‌లో బ్రాంచిలు ప్రారంభించి మనవారి సహకారంతో సినిమాలు తీస్తున్నారు.
మెహంజదారో చిత్రానికి మన వాళ్లు వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి దాదాపు వంద కోట్లు పిండుకుని నిర్మించారు. ఆ చిత్రం ఢామ్మంది. మన వాళ్లయితే ఆ చిత్రాన్ని 50 కోట్లకే నిర్మించేవారు. అంతో ఇంతో లాభమూ వచ్చేది. మనవాళ్ల తెలివగల మోసాన్ని గుర్తించిన వాల్ట్ డిస్నీ సంస్థ బాలీవుడ్ నుంచి బిచాణా ఎత్తేసే పనిలో పడిందట. మిగిలిన హాలీవుడ్ సంస్థలూ అదే దారిలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కాబట్టి సినిమా పేరుతో మనవాళ్లు ఇప్పుడు వాళ్లను దోచుకుంటున్నారు. చరిత్ర పునరావృతం అవుతోంది.
ఎ శాంతిసమీర, వాకలపూడి
ప్రత్యేకత
తెలుగు చలన చిత్ర చరిత్రలో విభిన్న పాత్రలు పోషించిన ఆరాధ్యనటులు రామారావు, ప్రేక్షకుల హృదయాలకు నవ్వుల జల్లు కురిపించిన రాజబాబు శరత్కాలంలో హైలెట్‌గా కనిపించారు. కృష్ణంరాజు నిర్మించిన కృష్ణవేణి హైదరాబాద్, విజయవాడలలో శతదినోత్సవ వేడుకలు 18 అక్టోబర్ 1974లో జరిగాయి. ప్రత్యగాత్మ అధ్యక్షతన ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని ఆనాటి సభలో జ్ఞాపికను అందించారు. ఆనాటి సభకు హాజరైన వారిలో నేనూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నాలుగు దశాబ్దాల తరువాత అప్పటి ఫొటోను అందించి అనుభూతి కలిగించి ప్రత్యేకతను చాటుకుంది వెనె్నల.
ఉప్పు సత్యనారాయణ, తెనాలి