మీ వ్యూస్

భలే అచ్యుతానందం! (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్‌ల మధ్య సాగే ప్రేమాయణం కథను ‘జ్యో అచ్యుతానంద’ అంటూ క్లాసిక్ టచ్‌తో అందించటం బాగుంది. సున్నితమైన అంశాన్ని ఎంత ఒద్దికగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దగలడో అవసరాల శ్రీనివాస్ పనితనం మరోసారి రుజువైంది. అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రేమ కాన్ఫ్లిక్ట్‌తో ఏమోషనల్ డ్రామాగా మలిచిన విధానం ఆకట్టుకుంది. ‘ఊహలు గుసగుసలాడి’నట్టే -క్రమంగా కమర్షియల్‌గా సక్సెస్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది. సున్నితమైన ప్రేమాంశాన్ని అవసరాల మలచుకున్న అద్భుత విధానాన్ని చూస్తే -అతని నుంచి రాబోయే సినిమాలతో ఆడియన్స్‌కు ఎలాంటి ‘్ఫల్’ అందుబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని మంచి సినిమాలకు ‘అవసరాను’గుణంగా అవసరాల అందిస్తాడని ఆశిద్దాం.
-జి ప్రేమ, కావలి

అతకని కథనం
నాని కథానాయకుడుగా వచ్చిన మజ్ను పేరుకు తగ్గట్టు కథ లేకపోవడంతో తేలిపోయింది. మజ్ను అంటే మనసుని పట్టేసే ప్రేమకథ ఉండాలి. మజ్ను అంటే ఒక్క ప్రేయసికే సొంతం. ఆమెకోసమే అతడి జీవితం విషాదాంతమైంది. అలాంటిది మజ్ను పేరుపెట్టి ఇద్దరు ప్రేయసిలుంటే ఇంక మజ్ను అన్న మాటకి సార్ధకత ఏముంది? ప్రేమలో గెలిచినంత మాత్రాన మజ్ను గొప్పవాడు కాదిక్కడ. మజ్ను అంటేనే ప్రేమలో పరాకాష్టకు వెళ్లిన ప్రేమికుడు. ఇక్కడ మాత్రం అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని ప్రేయసిలను మార్చే ప్రేమికుడు కనిపించాడు. గత సినిమాలు చూడని వాళ్లకి ఈ సినిమా నచ్చుతుందేమో కానీ, మజ్ను అంటే నిజమైన అర్ధం తెలిసిన వాళ్లకు ఈ సినిమా పిచ్చి సినిమాకిందే కనిపిస్తుంది.
-టి రఘురామ్, నరసరావుపేట

బిట్లు భేష్
వెనె్నల ఫ్లాష్‌బ్యాక్‌లో భక్తపోతన గురించి వివరాలు తెలుసుకున్నాం. ప్రతివారం వెనె్నల కోసం ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా సమీక్షలు పక్షపాతం లేకుండా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అక్కడక్కడ కనిపించే బిట్లు బాగుంటాయి. కీపిటప్!
-వివిపిసి రావు, మంగళగిరి

సిరివెనె్నల
వెనె్నల శరత్‌కాలంలో అరుదైన అలనాటి చిత్రాల నటీనటుల ఫొటోలు సిరివెనె్నల కురిపిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ ఐదు దశాబ్దాలనాటి చిత్రాల గురించి విశేషాలతో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇవి పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తున్నాయి.
-యు సత్యనారాయణ, తెనాలి

అయోమయం
ప్రతి పత్రికలోనూ వస్తున్న సినిమా బిట్స్ చదివితే అయోమయంలో పడిపోతాం. అన్నీ పొంతన లేని రాతలే. ఏడుపు తప్ప సీతగా నయనతార చేసిందేమీ లేదని ఎద్దేవా చేసిందొక పత్రిక. కానీ సీతగా ఆమె నటనకు నంది అవార్డు వచ్చింది. ఆమధ్య నయనతార గురించి, సమంత గురించి రాస్తూ వారి నటనలో మొనాటనీ వచ్చేసింది కనుక బోర్‌కొట్టిస్తున్నారు. అందుకే వారికి కొత్త చిత్రాలు లేవు అని రాసిందొక పత్రిక. చోద్యం కాకపోతే తెలుగు సినిమా హీరోయిన్‌కి నటన అవసరమా? డాన్సులు, రొమాన్స్‌లకే పరిమితమయ్యారు వాళ్లు. అసలు విషయం ఏమిటంటే నయనతార రాజకీయాల్లోకి, సమంత పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యారు కనుక కొత్త చిత్రాలు ఒప్పుకోవడం లేదన్నది మరో టాక్.
-పి చంద్ర, మాధవనగరం

గిన్నిస్‌బుక్ రికార్డ్స్
నటీనటులకు బోలెడు సెంటిమెంట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ శరత్‌కాలం చదివేవరకు ఎన్టీఆర్‌కు, విజయవాడ దుర్గా కళామందిర్‌కు ఉన్న అనుబంధం, సెంటిమెంట్ గురించి చాలామందికి తెలియదు. ఆయన చిత్రాలు 63 వరకూ ఆ థియేటర్‌లోనే ప్రదర్శించబడి, శత దినోత్సవాలు జరుపుకోవడం అద్భుతమైన విషయం. హాలీవుడ్ నటులు మనవాళ్లకన్నా తక్కువ చిత్రాల్లో నటిస్తారు కనుక ఎన్టీఆర్ సాధించింది ప్రపంచ రికార్డే. ఎవరైనా పూనుకుని ఆ చిత్రాల వివరాలు గిన్నిస్‌బుక్ రికార్డ్స్ వారికి పంపితే వాళ్లు తప్పక ఆమోదిస్తారని నమ్మకం కలుగుతోంది.
-పిఎస్ లక్ష్మి, బృందావనం

కుటుంబ కథతో
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు రెండు కథాకథనాలతో క్లాస్ ప్రేక్షకులను మెప్పించి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు చెబుతున్నవేంటంటే కుటుంబ కథతో వస్తున్న చిత్రాలు హిట్టవుతాయని. భవిష్యత్‌లో కూడా ఏ హీరో అయినా సరే మరెన్నో కుటుంబ కథలతో రూపొందే చిత్రాలను నిర్మించాలి. హింస, అశ్లీలతకు తావులేకుండా అవి ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే సినిమాలకు విజయం తథ్యం అని ప్రేక్షకులు ఎన్నిసార్లు తమకు నచ్చిన హిట్లతో చెబుతున్నా పరిశ్రమ పట్టించుకోవడం లేదు. ఆలోచించండి.
- వి.రాఘవరావు, చిన్నగంజాం

జ్ఞానోదయం
హీరోలు అనేక సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకునే రోజులు పోయాయి. కొత్త కొత్త వాళ్లు వచ్చేస్తున్నారు. పాత వాళ్లు తెరమరుగవుతున్నారు. కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఇంకా సాగుతున్నారు. కొన్ని హిట్స్ రాగానే రేట్లను పెంచి కోట్లను మూటకట్టుకోవాలన్న దురాశతో ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. తెరపై ఎంతమంది ఎంతకాలం వుంటారో ఎవరికీ తెలియదు. అందుకే తమకు అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. వెండి తెర మిసమిసలు బుద్బుధ ప్రాయమని, ఈ నటీనటులకు ఎప్పుడు జ్ఞానోదయమవుతుందో ఏమో!
- ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్

రిపేర్ చేయాల్సింది!
పాత కథలతో కనికట్టు చేసి కమర్షియల్ అంశాలు జోడించి, బలమైన కథనం ద్వారా సినిమా తీయడంలో కొరటాల శివ మొదటి రెండు సినిమాల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో మంచి దిగ్గజాల్లింటి నటులను పెట్టుకున్నా బలహీనమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. చిన్న కథను రిపీటెడ్ సీన్ల ద్వారా సాగదీసి విసిగించాడు. ఈ కథను రీపేరు చేసి వుంటే బాగుండేది. ఎమోషనల్స్ ఏమాత్రం లేకుండా గజిబిజి సీన్లతో తీసిన జనతాగ్యారేజ్ అభిమానులకు పండగలా నిలిచింది అంతే!
- ఎం.కనకదుర్గ, తెనాలి