మీ వ్యూస్

నవ్విన నాప చేను...అలనాటి సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుండమ్మ కథ’ -ఇదేం పేరు అని కెవి రెడ్డి ఆశ్చర్యపోయి, ఈ సినిమా ప్రేక్షకులు చూస్తారా? అని పెదవి విరిచారట. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ మొదలైన దగ్గర్నుంచీ ఎంతోమంది విమర్శలు, ఆటుపోట్లు తప్పలేదట. అయితే చక్రపాణికి -సినిమా తప్పక విజయవంతం అవుతుందని కమలాకర భరోసా ఇచ్చారట. పౌరాణిక చిత్రాలు నిర్మించే దర్శకుడు సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించటమేంటని కూడా కొందరు హేళన చేశారట. విజయా బ్యానర్ చిత్రాలలో రేలంగి వెంకట్రామయ్య ప్రధానంగా ఉండేవారు. రేలంగి లేని ఈ సినిమా ఉప్పులేని పప్పులాంటిదని కూడా అప్పటి సినీ దిగ్గజాలు జోకులు వేశార్ట. మిన్ను విరిగి మీద పడినా చలించని స్వభావం కలిగిన కమలాకర కామేశ్వర రావు -కొండంత నమ్మకంతో గుండమ్మ కథను స్క్రీన్‌కు ఎక్కించారు. అది ఎంత గొప్ప విజయపథంలో నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈమధ్య గుండమ్మ కథను రీమేక్ చేసే ఆలోచనలు చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆణిముత్యాలను అలాగే వదిలేయాలి తప్ప, పునర్నిర్మిద్దామని సంకల్పిస్తే అసలును చెడగొట్టిన వాళ్లవుతాం. ఇలాంటి చిత్రాలను అపురూపంగా చూసుకోవాలే తప్ప, దాని రూపాన్ని చెడగొట్టవద్దని మనవి.

సేకరణ: కోవూరు వెంకటేశ్వర రావు, కందుకూరు