మీ వ్యూస్

అనువాదం తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ భాషలో క, ఖ, గ, ఘలకు ఒకటే అక్షరం. చెన్నయ్ మైలాపూర్‌లో ఉన్న కపాలీశ్వరన్ కోయల్‌ను కపాళి, కబాలి, గబాలి, గపాలి.. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అది వాళ్ల తమిళ అక్షర సంప్రదాయం హక్కు. తెలుగులో డబ్ చేశాక మనకు అన్ని అక్షరాలు ఉన్నాయి కనుక కపాలి అనాలి. (కపాలి అంటే పుర్రె అని అర్థం. శివుడు స్మశానంలో పుర్రెలు వాడాడు కనుక) అలా కపాలి అని పెడితే బాగుండేది. కబాలి అనడం కరెక్టు కాదు. శరత్ నవలను మనవాళ్లు దేవదాసు అన్నారు కానీ ‘దేబోదాష్’ అనలేదు కదా! అదేవిధంగా గోదావరిని ‘గొడావరీ’ అనరు కదా? పూరీ జగన్నాథుని ఒడియా వాళ్లు ‘జోగోన్నాథో’ అంటారు. మనం అలా పిలవం కదా?
-యశ్వంతరావు శేషగిరిరావు,
ధవళేశ్వరం
జానపద హీరో
అక్కినేని నాగేశ్వరరావుకు మొదట జానపద కథానాయకుడుగానే పేరుండేది. ఆ ముద్ర చెరిపేసుకోవడం కోసం పారితోషికం తగ్గించుకుని మరీ 1950లో సంసారం చిత్రంలో నటించారు. అయినా అప్పుడప్పుడు జానపద చిత్రాల్లో నటిస్తూనే ఉండేవారు. 1957లో అల్లాఉద్దీన్ అద్భుత దీపం చిత్రం తర్వాత, 1967లో రహస్యం చిత్రంలో నటించారు. ఎంతో వ్యయ ప్రయాసలతో నిర్మించిన రహస్యం పరాజయం పొందడంతోనో, మరే కారణం చేతనో ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు జానపద చిత్రాల్లో నటించలేదు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి పౌరాణిక చిత్రం 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం.
-నున్నా మధుసూధనరావు, హైదరాబాద్
మూగనోము
నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంట్లో పెద్దలు ఓ హిందీ సినిమాకు తీసుకెళ్లారు. మీనాకుమారి, సునీల్‌దత్ నటించిన ‘మై ఛుప్ రహోంగే’ సినిమా చూశా. ఆ తరువాత తెలుగులో మూగనోము చూశాను. రెండూ ఒకటే కథలు. అప్పట్లో తక్కువ సినిమాలే చూడటంవల్ల ఈ రెండు సినిమాల కథ ఒకటే అవడంవల్ల బాగా గుర్తుండిపోయాయి. ఆ సినిమాలో పాటలు, ఈ సినిమాలో పాటలు వరుసలు కూడా యథావిధంగా ఉంటాయి. అయితే ఇటీవల వెనె్నలలో విఆర్ రావు రాసిన మూగనోము గురించి చదివాను. వారికి హిందీ సినిమా గురించి తెలియదనుకుంటాను. మూగనోము సినిమాకు మాతృక హిందీ సినిమా అని తెలియజేయడానికి ఈ ఉత్తరం రాశాను.
-ఏలూరుపాటి భానుమతి, అమలాపురం
స్థాయి ఎక్కడ?
టాలీవుడ్ స్థాయి ఎక్కడ? వ్యాసం ఆలోచింపచేసింది. తెరవేల్పులుగా జేజేలు అందుకున్న మన ఘనాఘన నటీనటులలో దాతృత్వం కాస్త తక్కువే. రాయలసీమ కరువుకాటకాల్లో జోలెపట్టి భిక్షాటన చేసి, నిధులు సమకూర్చిన ఒక రత్నంను అదేంగొప్ప? సొంత సొమ్ము ఇవ్వాలిగానీ అంటూ గేలిచేసిన ఓ నటుడు గుప్తదానాలు చేసేవాడట! మరో సందర్భంలో ఆ రత్నమే ‘నాదగ్గిరేముంది..బూడిద!’ అనేశాడు. మేముసైతం అంటూ ఇటీవల ఓ ఛానల్‌లో ఓ ఫార్స్ నడుస్తోంది. అయితే దీక్షగా సంస్థల ద్వారా తమ రాబడి ఖర్చుపెట్టి రోగులకు, అనాధలకు సాయంచేస్తున్న నవతరం హీరోయిన్లూ ఉన్నారు. వారిని గ్రేట్ అనాలి. ఎవరిస్థాయి వారిది. దానినిబట్టి వారికి దాతృత్వం ఉంటుంది.
-జె ధర్మతేజ, గొడారిగుంట
రెండు రకాలు
మన హీరోయిన్లు రెండు రకాలు. ఒక రకం ఇది గ్లామర్ రంగం కనుక చూపించక తప్పదనే వాళ్లు. అవసరాన్నిబట్టి బికినీలకు రెడీ అంటారు. కొంతవరకు పద్ధతిగా ఉండేవాళ్లు ఛాన్సులు తగ్గిపోతే క్లీవేజ్ ప్రదర్శిస్తూ ఐటెమ్ గంతులకు సిద్ధపడిపోతారు. బయటకు చెప్పకపోయినా వీరిది ధనాశ. డబ్బుకోసం ఏమైనా చేస్తారు. రెండో రకంవారు గ్లామర్ ప్రదర్శిస్తూనే నటనకు ప్రాధాన్యతనిస్తారు. ఛాన్సులు రాకపోయినా పర్లేదు, స్కిన్‌షో చేయం అంటారు. ఈ వర్గంలో సమంత, నిత్యామీనన్, లావణ్యాత్రిపాఠి లాంటివారున్నారు. ఇదో మంచి పరిణామం. వీరి వ్యక్తిత్వానికి అభినందనలు.
-కె.గునే్నష్, కొవ్వాడ
అభినందనీయం
వెనె్నల నిజంగానే చల్లని పిల్లగాలులతో మంచును కురిపిస్తోంది. నాకు నచ్చిన చిత్రం, నాకు నచ్చిన పాట ఈ రెండు అంశాలూ ఆ తరం పాఠకులమైన మమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. సేకరణకర్త ఆ సంవత్సరం ఏదో కూడా వివరిస్తే బావుంటుంది. ఫిలిమ్ క్విజ్, డైరెక్టర్ ఛాయిస్ బాగుంటున్నాయి. ఫ్లాష్‌బ్యాక్, శరత్‌కాలం, సినిమా సమీక్షలు.. ఇలా ప్రచురిస్తున్న ప్రతి అంశమూ ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయం.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం
కష్టాలన్నీ హీరోలకే..
పాపం తెలుగు హీరోలకు హీరోయన్లు దొరకడం కష్టమైపోయంది. హీరోల సంఖ్య ఎక్కువైపోయ, హీరోయన్ల సంఖ్య నాలుగు, ఆరో అన్నట్టే ఉండటంతో -రిపీటెడ్ కాంబినేషన్లు తప్ప కొత్త హీరోయన్‌తో కెమిస్ట్రీ చూపించే అవకాశం హీరోలకు లేకుండా పోతోంది. అయతే సమంతా.. లేదంటే అనుష్క... రకుల్‌ప్రీత్‌సింగ్... మరీకాదంటే రాశిఖన్నా.. ఇలా ఉన్నవాళ్లనే తిప్పి తిప్పి తీసుకోవడమే హీరోలకు ఇబ్బందైపోతుంది. మరోపక్క ఇలియానా, తాప్సీలాంటి పెద్దా చిన్నా హీరోయన్లు బాలీవుడ్ బాట పట్టేయడంతో -హీరోలకు వెతుకులాట తప్పడం లేదు. తమిళ, మలయాళ హీరోయన్ల కోసం ఎగబడుతున్నా -కెమిస్ట్రీ కుదురుతుందోలేదోనన్న భయాలూ హీరోలను వెంటాడుతున్నాయ. కీర్తి సురేష్, సురభి, నివేదా థామస్‌లాంటి కొత్త హీరోయన్లు సత్తా చాటుకుంటున్నా -్ఠక్కున వీళ్లతో చేయడానికి మన తెలుగు హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నార్ట. పెర్ఫార్మెన్స్‌లో వాళ్ల పక్కన తేలిపోతామనో.. లేక వాళ్లనింకా కుర్ర హీరోయన్ల కిందే చూస్తున్నారో..
-జివి కృష్ణ, భీమవరం