S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

07/24/2016 - 07:04

ఈ మాటలే తన దేహ మానసాల్ని చిత్రమైన ఊహల్లో తేలించాయి.
చంద్రహాసుడు! తన మనోఫలకం మీద ప్రత్యక్షమైనాడు!
ఫాలం మీద చంద్రవంక గంధపు చారల మీద కుంకుమరేఖ. సాహసమంతా ఏకీకృతమైనదన్నట్టు మెలితిరిగిన మీసం, నిశిత దృక్కులు!
తాను బిత్తరపోయింది. కళ్లు నులుముకుంది. చుట్టూ చూసింది.

07/16/2016 - 23:00

30
మహారాజు అగ్నివర్మ సమక్షంలో చర్చ సాగుతున్నది.
‘మహారాజుగారి పాత్రను ఇలా తక్కువ చేస్తూ పోతే, మీరూ మేమూ కూడా అధికారుల దృష్టిలో చులకనై పోతామని నా బాధ’ తన మాటల బాణాల్ని వదిలాడు దుష్టబుద్ధి. ప్రసేనుడూ వంత పలికాడు.
ఈ మాటలలోగల ఆంతర్యాన్ని పసిగట్టారు గాలవులు. తన మనసు విప్పారు.

07/10/2016 - 04:24

చంద్రహాసుడు తదేకంగా అక్షయుని వైపు చూస్తూ ‘అడుగు కదిలిస్తేనే నడక’ అనేది నా సూత్రీకరణ! దీన్ని చాలాసార్లు అక్షయునితో ప్రస్తావిస్తూనే ఉన్నాను. అతను నా భావాల్ని పట్టుకుంటున్నాడు. ఇదంతా పురుషోత్తముల వారిచ్చిన జ్ఞాన ప్రసాదం’ అని చేతులెత్తి గురువందనం చేశాడు.
చంద్రహాసుడి చేష్టని చూసిన ముగ్గురూ ఆశ్చర్యపడి ఒకరి చూపుతో మరొకరు చూపు కలుపుకున్నారు.

07/02/2016 - 22:30

వీటిలో ప్రముఖమైనది - గిరిజనుల పాడిపంటల ఫలసాయాన్ని మెరుగుపరచడం. మొక్కలను నాటి, వృక్షాలను పెంచీ వాటి సంబంధమైన ఫల కుసుమాల ఉత్పత్తీ, పుట్టతేనె, ఔషధీయ వస్తు సంబారాల తయారీ వంటి రాబడినిచ్చే అంశాల పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. ప్రజలంతా సంతోషించి నూతన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం స్వచ్ఛందంగా అందుతున్నది. దీనితో వారి ఆర్థిక పరిస్థితి మెరుగయింది.

06/26/2016 - 05:45

తండ్రి కళ్లల్లోని అభ్యర్థనే ఆమెకు కన్నుల్ని చెమరింపజేసింది. ఉద్విగ్నతని కనపడనీయకుండా ‘అవశ్యం నాన్నగారూ. మీ ఆజ్ఞ ప్రకారం నడచుకుంటాను’ అన్నది.

06/18/2016 - 23:52

సింగన్న తను మంత్రితో అంటున్నట్టు, ‘కళింద్ర ప్రత్యేకతలు మహారాజుగారికి విదితమే కదా! వాటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు జరుగుతాయని మా ఆశ’ అన్నాడు.
ఈ మాటల వెనుక గూఢార్థం అక్కడ వున్న అందరికీ తెలుసు. కళింద్ర ఆగ్నేయ సరిహద్దు అజేయమనే సంగతిని ప్రస్తావిస్తున్నాడు సింగన్న అనీ అర్థమయింది.

06/11/2016 - 23:59

చంద్రహాసుడు తన నడుముకు వున్న మోకుని లాగాడు. దాని ఒక కొసను వలయాకారంలో తిప్పి మోకుకు ముడిపెట్టేశాడు. ఉరితాడులా తయారయిందది. కోటగోడకు ఒకటి రెండు అడుగులు ఇవతలకు వచ్చి, గురిచూసి ఆ మోకును బురుజు పైకి విసిరాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. మోకుకు పట్టు చిక్కలేదు. నిరాశపడక ఈసారి మరింత వేగంగా, మరింత శక్తితో విసిరాడు. ఇప్పుడు దానికి పట్టు చిక్కింది. లాగిలాగి చూశాడు. ముడి బిగిసింది.

06/05/2016 - 01:49

‘జరిగింది చెప్పాము కదా ప్రభూ! ఎక్కడో చేరరాజ్యం నుంచీ గూఢచారులు ఇక్కడకు రాలేరని భావించిన తరువాత ఆ రాత్రికి రాత్రే కరదలో వున్న నా శిష్యులు దొడ్డణ్ణ, హాలప్పలకు ‘పావురాయి సందేశము’ పంపాము. ఈ ఆగంతకుల గురించిన వివరాలు అప్పటికప్పుడే తెలిశాయి. చేరరాజు ఉదయుల వారు వీరశివుడి సహాయాన్ని కోరారు.

05/29/2016 - 06:24

‘యోగశాస్త్ర రహస్యాల ప్రకారం మానవ దేహంలో 107 జీవమర్మ స్థానాలు వున్నవి. వానిలో 64 అతి ప్రమాదకర స్థానాలు. వాటిలో ఎక్కడైనా తీవ్రహతి ఘట్టిస్తే ఎంతటి శత్రువులూ నిక్కినీలిగి కుప్పకూలవలసిందే. ఆ అరవై నాలుగు స్థానాల్లో మీకు కేవలం పదకొండు స్థానాలే చూపాను. అక్కడ ఎలా దెబ్బవేయాలో చూపించాను. వాటిని మీరు మననం చేస్తూ ఉండండి. అభ్యాసానికి కూడా పొరపాటున వాటి జోలికి పోకూడదు మీరు. జాగ్రత్త.

05/23/2016 - 03:51

ఆ నవ్వు చూసి ఉడుక్కుంది పద్మిని. అది కూడా గమనించాడు.
నెమ్మదిగా తల పక్కకు తిప్పుకుని చుట్టూ చూశాడు. ఇంకా కుళిందకుడూ, ఇతర ప్రముఖులూ రాలేదు. ఆవరణంతా మాటల సవ్వడితో సందడిగా ఉంది.

Pages