S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

05/15/2016 - 04:51

చంద్రహాసుడూ, అక్షయుడూ, పద్మినీ, దుర్గీ వారు కూర్చున్న చోటనే మిగిలిపోయారు. దుర్గికి మాత్రం మనస్సులో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. పద్మినిలాగా తానూ బాణాల్ని వేయలేక పోయాననే ఆత్మన్యూనత అది. చేతిలోని విల్లును అటూఇటూ మార్చుకుంటూ అధోముఖియై ఆలోచిస్తోంది.

05/09/2016 - 03:50

3
పురుషోత్తమాచార్యుల ఆశ్రమం. సామూహిక ధ్యాన సమయం.

05/03/2016 - 23:25

అడవి దారి. చుట్టూ చిమ్మచీకటి. ఆకాశమంతా నల్లని మబ్బులు. చెట్లు, కొమ్మలు ఊగుతున్నై. చల్లటి గాలి వేగం ఎక్కువైంది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు మొదలయినై.
రాత్రి గడుస్తున్నది. ప్రయాణం సాగుతున్నది.
కుళిందకుని రథాన్ని అనుసరిస్తూ అశ్వారూఢుడై అడివప్ప, అతని పక్కగా ఉపసేనాని దక్షిణ్ణ వస్తున్నారు.
అడవిలో జంతువుల గంతులు, దూకుళ్లు, భయంకర రావాలూ మొదలైనై. చినుకు మొదలయింది.

04/23/2016 - 23:48

ఆ ప్రయాణం ఎలా సాగాలన్నదే ఇప్పుడు సమస్య.
తప్పు చేసినట్లు తల వంచుకుని అశోక్ ఆడించినట్లు ఆడటమా?
పోరాడి, నా దారి నేను ఏర్పాటు చేసుకోవటమా?
రెండోదానే్న ఎన్నుకున్నాను నేను.
ఈ పోరాటం నా జీవిత గమనాన్ని మారుస్తుందని కాదు, అతని విజయాన్ని అడ్డుకోవాలని.
పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరినీ ఒకేసారి లోపలకు పిలిచాడు. ‘రామ్మా!..రా!!’ అంటూ ఆహ్వానించాడతను.

04/17/2016 - 06:34

నేను ఇప్పుడున్న మానసిక స్థితిలో ఆ పాత జ్ఞాపకాలు తిరగదోడే ఓపిక లేదు. అందుకే సమాధానం చెప్పకుండా నవ్వేశాను. ‘ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుందిలే!...’ అంటూ అక్కడ నుండి నిష్క్రమించాను.
అడ్రస్ కాగితం డ్రైవర్‌కి ఇచ్చాను. దాన్ని ఒకసారి చూసిన అతను కారు ఆ అడ్రస్ వైపు పోనిస్తున్నాడు.
నేను ఫోన్ తీసి జానకి నెంబర్ డయల్ చేశాను.

04/11/2016 - 02:08

అశోక్
పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే నా దగ్గర చూసి ఎవరైనా నేర్చుకోవాలి. అది రాజకీయాల్లో మెట్లు ఎక్కటానికి కావచ్చు లేదా ఆడపిల్లలను దిగజార్చటంలో కావచ్చు.

04/03/2016 - 11:09

‘జరిగిన దాన్ని మార్చలేము. జరగవలసిన దాని గురించి ఆలోచించు...’ అన్నాడు ఒక ప్రముఖ నిర్మాత.
‘సినిమా విడుదలకు ఇంకా పదిరోజులుంది. పైరేటెడ్ వెర్షన్ ఇప్పుడు రిలీజయితే, సినిమా రిలీజ్ నాటికి చూడటానికి ఎవరూ మిగలరు’ అన్నాడు భరత్.
‘సినిమా విడుదల ముందుకు జరిపితే...’ నా ఐడియా వివరించాను.

03/26/2016 - 22:30

ఏ మనిషి జ్ఞాపకమయినా ఎన్ని రోజులుంటుంది? నెమ్మది నెమ్మదిగా ఆమె జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. వసంతం సినిమాలో నా కేరెక్టర్ పెద్దది కాకపోయినా సినిమా హిట్ కావటంతో నాకూ మంచి పేరే వచ్చింది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకున్నానేమో, నా జీవితం పరుగందుకుంది. సినిమా అవకాశాల్తోపాటు నా వ్యక్తిగత జీవితం కూడా మలుపు తిరిగింది. పరిమళ నా జీవితంలోకి ప్రవేశించింది.

03/20/2016 - 00:24

‘చూడండి... డ్రగ్స్ కేసులు రెండు రకాలు. ఆ మనిషి డ్రగ్స్ స్వంతానికి వాడుతున్నాడా? ఇతరులకు కూడా అందిస్తున్నాడా? అన్న దాని మీద కేసు తీవ్రత ఆధారపడి ఉంటుంది. కేవలం స్వంత వాడకానికి డ్రగ్స్ దగ్గర ఉంచుకుంటే, అతనికి ఉన్న సోషల్ స్టేటస్‌నిబట్టి, చేసిన తప్పు మొదటిసారిగా భావించి బెయిల్ దొరకవచ్చు. కానీ..

03/13/2016 - 08:50

‘కానీ... కొన్నాళ్లు ఆగి వాళ్ల సంగతి చూద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం కదా! ఈలోపు ప్రతిరోజూ ప్రతీకారం అని ఆలోచించి పనులు పాడు చేసుకోవటం అవసరమా?’ నా బాధను తేలిగ్గా తీసేస్తూ అన్నాడు అశోక్.

Pages