S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

11/12/2016 - 17:57

‘శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకూ మీరెక్కడున్నారు?’ సుందరాన్ని అడిగేడు యుగంధర్.
‘మధురవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో...’ చెప్పాడతను.
‘అంటే రాంప్రసాద్ హత్య జరిగినప్పుడు మీరక్కడే ఉన్నారన్నమాట. ఆఫీసులో ఎంతసేపున్నారు?’
‘శుక్రవారం కొన్ని సైట్లు రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ డాక్యుమెంట్లు తీసుకోవడానికి శనివారం వెళ్లాను. సాయంకాలం ఆరు వరకూ అక్కడే ఉన్నాను’ జవాబిచ్చాడు సుందరం.

11/05/2016 - 22:08

3
రాత్రి పదకొండు గంటల సమయంలో హోటల్లో భోజనం ముగించి తన రూమ్ వైపు నడుస్తున్న రాజేష్ చప్పున ఆగిపోయేడు. అతన్ని దాటుకుని వెళ్లిన మ్యాక్సీ క్యాబ్ ఆగి అందులోంచి నలుగురు మనుషులు దిగి రాజేష్ వైపు రాసాగేరు. వాళ్లు రఫ్ కేరెక్టర్స్ మాదిరిగా కనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు. వీధి నిర్మానుష్యంగా ఉంది.
నలుగురూ దగ్గరకు వచ్చాక ఒకతను అడిగాడు.
‘నీ పేరు?’

10/30/2016 - 06:42

‘శ్రీధర్ చాలా సున్నిత మనస్కుడు. నెలకి రెండు మూడుసార్లు నాకోసం వచ్చేవాడు. మిగతా వారిలా కాకుండా నా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. మాలాంటి వారికి అలాంటి వ్యక్తులు అరుదుగా ఎదురవుతారు. ఆ తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరగడంతో శ్రీ్ధర్ మళ్లీ కలవలేదు. నేను దీన స్థితిలో చిక్కుకుపోయినట్టు అతనికి తెలిసి, నా నెంబరు మీకిచ్చి సాయం చెయ్యమని చెప్పి ఉండాలి...’

10/22/2016 - 21:41

రఘు కళ్లల్లో భయం చోటు చేసుకుంది.
‘ఇతని గురించి రేపు ఆలోచిద్దాం... లాకప్‌లో పడేయండి..’ చెప్పాడు. ఉమెన్ కానిస్టేబుల్స్ అతన్ని లాక్కుపోయారు.
రాత్రి పది గంటలకి ఇంటికెళుతూ రైటర్‌తో చెప్పాడు యుగంధర్. ‘రఘుగాడి షర్టు, ప్యాంటు తీసేసి డ్రాయర్‌తో లాకప్‌లో ఉంచండి. తెల్లారేసరికి రోగం కడుతుంది..’

10/08/2016 - 23:58

ఒక పరదేశి మారువేషంలో ధర్మపురి గ్రామంలో సంచరిస్తున్నాడు. తమ దేశంలో లేని వింతలు విశేషాలు గమనిస్తున్నాడు.
అతనిని ఒక పొలం దగ్గర ఒక పెద్ద గుంపు ఆకర్షించింది. ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటే కొంతమంది చోద్యం చూస్తున్నారు. చొరవ తీసుకుని పరదేశి తన గుర్రాన్ని వాళ్ల దగ్గరకు పోనిచ్చాడు.
‘ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎందుకు వాదులాడుకుంటున్నారు?’ అంటూ ఆ ఇరువురిని ప్రశ్నించాడు.

10/08/2016 - 23:47

‘నేను ఓ సిద్ధి కోసం చేసే వ్రతాన్ని భగ్నం చేయడానికి మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు రక్తమాంసాలని యాగ వేదిక మీద వర్షిస్తున్నారు. వారిని శపించలేని యజ్ఞం అది. నీ పెద్ద కొడుకు రాముడు వాళ్లని చంపే సమర్థత గలవాడు. నువ్వు ధర్మం నెరవేరాలని కోరే పక్షంలో నీ మంత్రి సుమంత్రుడితో చర్చించి అతని అనుమతితో రాముడ్ని నాతో పంపు’

10/08/2016 - 23:46

రమ్య సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోజుకు 8 గంటలు, మంగళవారం మరియు గురువారం, శనివారం రోజుకి 6 గంటలు పని చేస్తుంది. ఆమెకు ఆదివారం సెలవు. ఆమె వారానికి 378 రూపాయలు సంపాదిస్తుంది. అయితే ఆమె గంటకు ఎన్ని రూపాయలు సంపాదిస్తుంది?

జవాబు: గంటకు 9 రూపాయలు సంపాదిస్తుంది.

10/08/2016 - 23:46

సృష్టికి పంచ మహాభూతాలతోపాటు స్థల, కాలం, మనసు, ఆత్మలు కూడా మూలమని కణాదుడు సూత్రీకరించాడు. (ఐన్‌స్టీన్ స్థల కాలాలతో విప్లవాత్మక సిద్ధాంతాలు ప్రతిపాదించాడు.) పదార్థ జగత్తులోని ప్రతిదీ పరమాణు నిర్మితమే. ఇవే కలిసిపోయి అణువులుగా ఏర్పడతాయి. జాన్ డాల్టన్ కంటే 2,500 సంవత్సరాల ముందు గణాదుడు ఈ సిద్ధాంతాన్ని నిర్మించాడు. ‘వైశేషిక - సూత్ర’గా ఇది శతాబ్దాలపాటు భారతీయ ఋషుల తాత్విక చింతనను ప్రభావితం చేసింది.

10/08/2016 - 21:07

సౌమ్యనిధీ, దుష్టవిరోధీ అయిన మదనుడు తనకు బావమరదే కాదు - భావి రాజ ప్రముఖులలో ఒకడు.
కాళీమాత కరుణా కటాక్షాలతో వీరిని పునరుజ్జీవింప చేయవలసిన ఆవశ్యకత ఉంది అనుకున్నాడు.
కృతనిశ్చయుడై లేచాడు.

Pages