S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

03/05/2016 - 20:39

‘అడిగి చూడు...’
‘రాత్రి సెకండ్‌షో సినిమాకి వెళ్లి వద్దామా?’ చిలిపిగా అడిగాను.
అతను ఏమీ మాట్లాడలేదు.
‘నెక్లెస్ రోడ్డు మీద షికారుకు వెళ్లి ఐస్‌క్రీమ్ తిని వద్దామా?’

02/28/2016 - 14:06

చిందరవందరగా చెదిరిన జుట్టు.. పంటి గాట్లు, గోటి గాయాలతో కదుములు కట్టిన శరీరం, పెదవి చివరన గడ్డకట్టిన రక్తం మరక జరిగిందేమిటో చెప్పకనే చెప్తుంటే అద్దం ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూలబడ్డాను.
శరీరానికి తగిలిన గాయం రెండు రోజుల్లో మానవచ్చు. కానీ మనసుకు తగిలిన గాయం ఎలా మానుతుంది? నాకు జరిగిన నమ్మకద్రోహం తలుచుకుని కళ్లలో నుండి నీరు కారుతోంది.

02/22/2016 - 20:32

అందరి మాటలకీ తల ఊపాను.
‘లెటజ్ మీట్ టుమారో...’ అంటూ లేచాడు అభిమన్యు. ‘పద వసూ! నిన్ను దింపుతాను..’ అన్నాడు నన్ను ఉద్దేశించి.
‘నేను వెళ్తాను..’ బిడియంగా అన్నాను.
కాస్త సందు ఇస్తే అభిమన్యు ఎలా దూసుకుపోతాడో తెలుసు కాబట్టి సంతోష్ కల్పించుకున్నాడు. ‘నేను పంపిస్తానులే, అభీ..’ అంటూ.
రిలీఫ్‌గా అనిపించింది నాకు.

02/14/2016 - 17:50

‘మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ, ఆ అశోక్ చేస్తున్న గారడీ బాబూ ఇది...’ ఆవేదనగా అన్నాడు రామభద్రం.
‘అశోక్ ఏం చేశాడు? అసలామాట కొస్తే ఏం చేయగలడు?’
‘నేనూ అదే అనుకున్నాను చంద్రం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చాక మోసానికి తావు ఉండదనుకున్నాను. కానీ చాలా పెద్దఎత్తున ఎవరూ ఊహించని విధంగా మోసం జరిగింది. అశోక్ మనందరికన్నా పదడుగులు ముందున్నాడు...’ చెప్పింది వసుంధర.

02/09/2016 - 23:59

బంధువర్గము వాండ్లు నన్ను ‘ఏనుగొండ గోపి’ అంటరు. నా స్వభావము నచ్చనివాడు ‘కోపి’ అనిగూడ అంటరు. నాన్నను ‘ఏనుగొండ వేంకట నరసింహాచార్యులు’! కానీ, ఆయన మాత్రం తన గురించి రాయవలసి వచ్చిన ఒక సందర్భంలో తన పేరు ‘మార్చాల వేదాంతాచార్య’ అని రాసుకున్నడు. ఏనుగొండ, మా నాయనకు అమ్మమ్మ ఆస్తి. అమ్మమ్మ ఊరు. అంటే మేము నిజానికి మార్చాలవాండ్లము. ఈ మార్చాల, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి పక్కన ఉంటుంది.

02/09/2016 - 22:14

అశోక్
జానకి అంటే నాకేమీ ప్రత్యేకంగా అభిమానం లేదు. నా దృష్టిలో ఆమేమీ గొప్ప అందగత్తె కూడా కాదు. కానీ ఆమె డిఫరెంట్ పర్సనాలిటీ.
ఒళ్లమ్ముకుని బ్రతికేవాళ్లు కొంతమంది పూర్తిగా నిర్వేదంలో కూరుకుపోయి ఉంటారు. లేదూ, మరి కొంతమంది మాటలతో ఎదుటి వాళ్లను డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే జానకి ఆ రెండు రకాలుగానూ ఉండదు.

01/31/2016 - 19:44

-పుట్టగంటి గోపీకృష్ణ (94901 58002)
-----------------------------
నిట్టూర్చాడు వసంతరావ్. ‘సరే!... నువు అంత పట్టుబడితే, ఏదో ఒక ఏర్పాటు నేను చేస్తాలే! ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో. నేను మాత్రం నీ సినిమాలో అఫీషియల్‌గా ఇన్‌వాల్వ్ కాలేను. ఇంత చిన్న సినిమా నేను చేస్తున్నానని తెలిస్తే.. ఇండస్ట్రీలో నా ఇమేజ్ దెబ్బతింటుంది’

01/23/2016 - 18:23

‘మరి కుట్ర జరిగిందని తెలిసి ఎందుకు ఊరుకుంటున్నావు?’
‘ప్రజాస్వామ్య విలువల మీదే నమ్మకం కోల్పోయే లాంటి కుట్ర జరిగింది చంద్రం. కానీ కొన్ని కారణాల వలన దాన్ని బయట పెట్టలేను కూడా!’
‘అయినా సరే! డోంట్ వర్రీ! అన్నీ సరవుతాయి...’
‘నా మీద నాకే నమ్మకం పోయింది చంద్రం’

01/14/2016 - 17:57

‘సార్! నేను మీ అభిమానిని. సినిమాల్లో నటించాలని వచ్చాను. ఒకసారి నా ఫొటో ఆల్బమ్ చూడండి. వీలయితే అవకాశం ఇవ్వండి...’ అన్నాను.
‘అడ్డమయిన వాళ్లకీ ఇవ్వటానికి ఇక్కడ వేషాలు గుట్టలుగా పోగేసుకుని కూర్చున్నామటమ్మా! పోవమ్మా! పోయి వేరే పని చూసుకో...’ అన్నాడతను.
‘ఒక్కసారి ఆల్బమ్ చూడండి సార్...’ అతని ముందుకు ఆల్బమ్ జరుపుతూ అన్నాను.

01/09/2016 - 17:32

‘ఒకప్పుడు సినిమాల్లో నటించాలనే వచ్చాను. ప్రస్తుతం సినిమాలకు పనికివచ్చే వయసు దాటిపోయిందని నాకే అర్థమవటంతో... ఆ ప్రయత్నాలు వదిలేశాను’
‘మరి సినిమాల్లో నటించారా?’
‘ఒక్క అడుగు కూడా ఆ రంగంలోకి వెయ్యలేక పోయాను’
‘మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’

Pages