S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

01/08/2017 - 05:41

ఆ అధికారి ఫోన్ నెంబర్ ఓ కాగితం మీద రాసి కానిస్టేబుల్ చేతికిచ్చి చెప్పాడు.
‘సిటీలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుకి వెళ్లి ఈ నెంబర్‌కి కాల్ చేసి నేను పంపానని చెప్పు. అతను ఇచ్చిన కవరు తీసుకురా...’

01/08/2017 - 00:35

కర్ణాటక సంగీత లోకంలో సంగీతమూర్తి త్రయమే ఉద్భవించకపోతే సంగీత పరిణామానికి ఒక దిశ, దశ ఉండేవి కావు - ఈ ముగ్గురిలో, ముఖ్యుడు త్యాగరాజు - మన తెలుగువాడు. ఈయన కీర్తనలు వినని వారుండరు - సంగీతం కోసమే పుట్టిన జీవన్ముక్తుడు. నాదయోగి. ఆయన నాదోపాసన ఎందరికో ఒరవడి దిద్దింది. ఆయన గానం నుండి కవితామృతం ఉద్భవించింది. త్యాగయ్య స్వర సాగరానికి రెండు గట్లు, స్వర సాహిత్యాలు. దానికి ఆయన వారథి.

12/31/2016 - 18:54

ఇంటి పనులకు, మంచి ఫర్నిచర్ కోసం టేకు కలప అందరూ వినియోగిస్తారు. ఇందులో విశేషం ఏమీ లేదు. నిజానికి టేకుకు మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. బ్యాక్టీరియా, చెదలు, క్రిమికీటకాలు టేకును ఏమీ చేయలేవు. ఎండ, గాలి, నీరు తగలకుండా ఉంటే టేకు కలప వెయ్యేళ్లైనా చెక్కుచెదరకుండా ఉంటుందని తెలుసా! చిమ్మెటలు, ఒకరకం సీతాకోక చిలుకలు (మోత్)లు మాత్రమే టేకు ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. అంతకుమించి టేకుకు చీడపీడలేమీ ఉండవు.

12/31/2016 - 18:19

ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మా ఊళ్లో పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో సుజాతనగర్‌లోని స్థలం కొని ఇల్లు కట్టాను. అప్పట్లో ఆ ప్రాంతంలో పగలే దొంగతనాలు జరుగుతూ ఉండేవి. అందుచేత ఆ ఇంట్లో ఉండటానికి ధైర్యం సరిపోలేదు. మా పిల్లలిద్దరికీ సిటీలోని స్కూళ్లలో సీట్లు వచ్చాయి. ఇల్లు అమ్మకానికి పెడితే, ఒరిస్సా నుంచి వచ్చిన ఓ జంట మూడున్నర లక్షలకి కొనుక్కుంది. నేను నా కుటుంబంతో సిటీకి వచ్చేశాను’ వివరంగా చెప్పాడు.

12/31/2016 - 18:15

బైక్ సాఫీగా సాగుతుంటే అతని బుర్రలో మాత్రం ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నాయి.

12/10/2016 - 21:35

పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సూట్ నెంబర్ వన్‌లో ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు యూనిఫాంలో ఉంటే ఒకతను లాల్చీ పైజామాలో ఉన్నాడు. ఇంతలో సెల్ మోగంతో లాల్చీ పైజామా వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వాళ్లు చెప్పింది విని ‘సరే’ అని కట్ చేశాడు. ఎదురుగా కూర్చున్న యూనిఫాం వ్యక్తులతో చెప్పాడతను.

12/04/2016 - 06:50

రాజిరెడ్డి ఆలోచనలు చెదరగొడుతూ స్టేషన్ ముందు జీప్ ఆగింది. యుగంధర్ లోపలికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్న వాళ్లని చూసి చిన్నగా నవ్వి తన రూములోకి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత స్టేషన్ రైటర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేసి చెప్పాడు.
‘సార్! రాజిరెడ్డిని కోర్టులో హాజరు పెట్టడానికి అవసరమైన పేపర్స్ రెడీగా ఉన్నాయి. కోర్టుకి తీసుకెళ్లడానికి వ్యానుతోపాటు ఎస్కార్టుని రమ్మన్నాను’

12/03/2016 - 22:37

శనివారం ఉదయం రాజిరెడ్డి పరవాడ వెళ్లి రాత్రికి తిరిగి రావడం నిజం కాదని దర్యాప్తులో తెలుసుకున్నాడు యుగంధర్. రాజిరెడ్డి శనివారం ఉదయం తన సెల్ నుంచి రాంప్రసాద్‌కి ఓ కాల్ చేశాడు. అలాగే మధ్యాహ్నం రెండుకి మరో కాల్ చేశాడు. రాంప్రసాద్‌ని కారులో ఎక్కించుకుని రాజిరెడ్డి తీసుకెళ్లడం రెండు గంటలకి డ్యూటీకొచ్చిన వాచ్‌మెన్ చూశాడు. ఆ శనివారం నెలలో రెండోది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని చెయ్యదు.

11/19/2016 - 21:10

కాల్ కట్ అయింది.
అప్పటికప్పుడు ఆమె ముఖం వాడిపోయింది. కదలకుండా అలాగే నిలబడింది. ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర ప్రత్యక్షమయింది. ఒకే ఒక్కసారి చేసిన తప్పుకి బురదలో కూరుకుపోయింది. దాని నుండి ఎలా బయటపడాలో, అసలు బయటపడటానికి మార్గం ఉందో లేదో తెలియడం లేదు.
దీనికంతటికీ కారణమైన సంఘటన ఆమె మనసులో మెదిలింది.
* * *
ఆ రోజు ఆదివారం.

Pages