S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/14/2015 - 11:51

హైదరాబాద్: నగరంలోని మాదన్నపేటలో 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు గురైనట్లు సోమవారం వెలుగు చూసింది. కిడ్నాపర్లు బాలికను ముంబై ప్రాంతానికి తరలించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/14/2015 - 11:50

నల్గొండ: బస్సుల్లో ప్రయాణీకులకు మత్తు పదార్థాలిచ్చి దోచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముఠాలోని నలుగురు సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కిలో బంగారం, 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దుగ్గల్ సోమవారం మీడియాకు తెలిపారు.

12/14/2015 - 11:49

హైదరాబాద్: స్నానం చేద్దామని చెరువులో దిగి ఇద్దరు విద్యార్థులు మరణించిన దుర్ఘటన పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మృతులను రాజేష్ (12), మురళి (13)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

12/14/2015 - 08:51

జగదేవ్‌పూర్, డిసెంబర్ 13: రాష్ట్ర సంక్షేమం కోసం ఈ నెల 23 నుంచి 27 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించే అయుత చండీ మహాయాగానికి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ యాగం శృంగేరి పీఠాధిపతులుల సమక్షంలో నిర్వహించనున్న దృష్ట్యా అన్ని వసతి సౌకర్యాలతో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

12/14/2015 - 08:35

హైదరాబాద్, డిసెంబర్ 13: వెబ్‌సైట్‌తో అపోహలు తొలగిపోతాయని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ‘మన తెలంగాణ... మన దత్తన్న’ పేరిట దత్తాత్రేయ అభిమాని భారతి రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.

12/14/2015 - 08:33

హైదరాబాద్, డిసెంబర్ 13: మహిళల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘షీ’టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. మహిళలను కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రత కోసం తగు ప్రణాళిక రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ఆదివారం ‘షీ’టీమ్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

12/14/2015 - 07:20

రామగుండం, డిసెంబర్ 13: కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికి అక్కడే మంటల్లో సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్లో ఒకరు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ సంఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

12/14/2015 - 07:18

హైదరాబాద్, డిసెంబర్ 13: గోదావరిపై నిర్మించనున్న ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ కోసం వ్యాప్కోస్ నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే నివేదిక ప్రభుత్వానికి అందడంతో ఇక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. వచ్చే బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించి రీ-డిజైనింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులను మొదటి దశలో చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.

12/14/2015 - 07:11

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆదిలాబాద్ జిల్లా మంగపేటలోని బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సిఎం కె చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. జిల్లా మంత్రి చందూలాల్ ఈ అంశంపై సిఎంతో చర్చించారు. సమైక్య పాలనలో మూతపడిన ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ, ఫ్యాక్టరీని తెరిచేందుకు సిఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. ఫ్యాక్టరీ నడించేందుకు వీలుగా కొన్ని రాయితీలు ప్రకటించారు.

12/14/2015 - 07:08

హైదరాబాద్, డిసెంబర్ 13: స్థానిక సంస్ధల కోటానుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాపాడుకోలేకపోయారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది.

Pages