తెలంగాణ

ఐదుగురి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, డిసెంబర్ 13: కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికి అక్కడే మంటల్లో సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్లో ఒకరు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ సంఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కుక్కల గూడురులో మిత్రుని ఇంట్లో జరుగుతున్న 21వ రోజు ఫంక్షన్‌కు బెల్లంపల్లి నుండి హాజరై తిరిగి వెళ్తుండగా పొట్యాల వద్ద కారు, ఆటో ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రామగుండం మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పులేటి రాజేందర్ (35), పొట్యాల గ్రామానికి చెందిన మహిళ మదునమ్మ (50), ఇదే గ్రామానికి చెందిన మరో మహిళ బూదమ్మ (52) పాటు కారులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ అమ్జద్ (32) మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తిప్పని హరీష్, బైరి లక్ష్మీనారాయణ, ఐలి మోహన్, జక్కుల రాజు, నాదవేణి రాజేందర్, అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న పొట్యాల ఆర్‌ఎంపి డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, ఉప్పులేటి లచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వీరిలో పొట్యాల ఆర్‌ఎంపి డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ (42) చికిత్స పొందుతూ మరణించారు. ఆటోలో పెట్రోల్ క్యాన్‌ను తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా కారు, ఆటో ఢీకొనడంతో ఆటోలోని పెట్రోల్ క్యాన్ పగిలిపోయి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే గోదావరిఖని అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఘటనా స్థలికి రామగుండం శాసన సభ్యుడు సోమారపు సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్‌పిటిసి సంధ్యారాణి, ఎంపిపి ఆడెపు రాజేషం, రామగుండం సిఐ నారాయణ నాయక్, ఎస్సై విద్యాసాగర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

చిత్రం.. ప్రమాదంలో దగ్దమైన కారు