S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/12/2015 - 06:16

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లేపేస్తాం’ అని ఒక అజ్ఞాత వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీకి ఫోన్‌లో బెదిరించారు. షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్ రావడంపై టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.

12/12/2015 - 05:57

మెదక్ టిఆర్‌ఎస్ వశం
టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి విరమణ
హ్యాట్రిక్ విజయం అందుకోనున్న భూపాల్‌రెడ్డి

12/12/2015 - 05:55

ఆత్మకూర్, డిసెంబర్ 11: మహ బూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండ లంలో దిగువ జూరాల వద్ద చేపట్టిన జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 2016 జూన్ చివరి నాటికి ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లుగా తెలంగాణ జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. శుక్రవారం దిగువ జూరాల వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

12/12/2015 - 05:54

సంగారెడ్డి, డిసెంబర్ 11: తుపాకులతో బెదిరించడం, సెటిల్‌మెంట్లు చే స్తూ అక్రమంగా సంపాదిస్తున్న ఏడుగురు సభ్యుల దొంగల ముఠాను మెదక్ జిల్లా పోలీసులు నాలుగు ప్రాంతాల్లో అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 53 తులాల బంగా రు ఆభరణాలు, రెండు 8 ఎంఎం పిస్టళ్లు, మందుగుండ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలు ఎస్పీ బి.సుమతి వెల్లడించారు.

12/12/2015 - 05:54

హుజూర్‌నగర్, డిసెంబర్ 11: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీటిసి, ఎంపిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్‌లకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

12/12/2015 - 05:53

కరీంనగర్, డిసెంబర్ 11: రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకగ్రీవంతో ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార టిఆర్‌ఎస్.. కరీంనగర్‌లోని రెండు స్థానాలను సైతం ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తుండగా, జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా రంగంలోకి దిగారు.

12/12/2015 - 05:36

భద్రాచలం, డిసెంబర్ 11: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు మత్య్సావతారంలో దర్శనం ఇచ్చారు. తొలుత గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామికి ప్రత్యేకారాధనలు చేశారు.

12/12/2015 - 05:19

తూప్రాన్, డిసెంబర్ 11: గత 18 నెలల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట శివారులో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు విద్యార్థులను రక్షించినందున వెంకటాయపల్లికి చెందిన రుచిక (7) సాహస బాలిక అవార్డుకు ఎంపికైందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్‌వెల్ఫేర్ అధ్యక్షురాలు గీతా సిద్ధార్థ లేఖ పంపినట్లు రుచిక తండ్రి మల్లాగౌడ్ తెలిపారు.

12/12/2015 - 05:16

హైదరాబాద్, డిసెంబర్ 11: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయ రామారావు తెలుగు దేశం పార్టీకి గుడ్-బై చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన విజయరామారావు నేడో, రేపో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలాఉండగా గత ఐదు, ఆరు సంవత్సరాలుగా విజయరామారావు తమ పార్టీకి దూరంగా ఉంటున్నారని, కాబట్టి ఇప్పుడు తమ పార్టీ నాయకునిగా పరిగణించడం లేదని తెలుగు దేశం పార్టీ నాయకులు తెలిపారు.

12/12/2015 - 03:10

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా కొనసాగుతోంది. బరిలోకిదిగి బలమైన పోటీ ఇవ్వాల్సిన విపక్షపార్టీల అభ్యర్థులు రెండోకంటికి తెలియకుండా చివరి క్షణంలో చేతులెత్తేశారు. అనూహ్యంగా నామినేషన్లు ఉపసంహరించుకుని అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు దోహదపడ్డారు. వీరిలో కొందరు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు కూడా.

Pages