తెలంగాణ

ప్రత్యర్థుల దాసోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా కొనసాగుతోంది. బరిలోకిదిగి బలమైన పోటీ ఇవ్వాల్సిన విపక్షపార్టీల అభ్యర్థులు రెండోకంటికి తెలియకుండా చివరి క్షణంలో చేతులెత్తేశారు. అనూహ్యంగా నామినేషన్లు ఉపసంహరించుకుని అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు దోహదపడ్డారు. వీరిలో కొందరు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు కూడా. ఇద్దరు కాంగ్రెస్, మరో ఇద్దరు తెలుగుదేశం అభ్యర్థులు, మరికొందరు ఇండిపెండెంట్లు తెరాసకు అనుకూలంగా శుక్రవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా మూడుచోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారంనాటి పరిణామాల్లో వరంగల్ నుంచి తెరాస అభ్యర్థి కొండా మురళి ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అధికార పార్టీలో హర్షాతిరేకాలను నింపగా, విపక్షపార్టీల అగ్రనేతల్ని విస్తుపోయేలా చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం వరకు గడువు ఉండటంతో మారిన పరిస్థితుల దృష్ట్యా మరికొంత మంది రంగంనుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఏకగ్రీవ ఎన్నికకు లోపాయకారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెదక్ నుంచి తెదేపా అభ్యర్థి బాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్ శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఒక్కరే రంగంలో నిలిచారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్ తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆదిలాబాద్‌లో తెరాస అభ్యర్థి పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా నుండి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా రిజాజుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరూ శుక్రవారం రంగంనుంచి తప్పుకోవడంతో సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి పోటీనుంచి వైదొలగి తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పోటీనుంచి తప్పుకోవడంతో తెరాస అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకుముందే వరంగల్‌లో తెరాస అభ్యర్థి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ నియోజక వర్గాల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆఖరి నిమిషంలో అభ్యర్థులు అధికార పార్టీకి దాసోహమనడం కాంగ్రెస్, తెదేపాకు మింగుడుపడటం లేదు. మెదక్‌లో తమ పార్టీ అభ్యర్థి శివరాజ్‌పాటిల్ నామినేషన్ ఉపసంహరించుకుని, తెరాసలో చేరడం పట్ల ఆ పార్టీ నేతలు గీతారెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి విస్తుపోయారు. ‘ఈ పరిణామం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని పార్టీ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా పోటీకి దిగిన అభ్యర్థే ఆఖరి నిమిషంలో అధికార పార్టీకి దాసోహమంటే అధిష్ఠానానికి ఏంసమాధానం చెప్పుకోవాలి?’ అని మరో నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉప సంహరణకు శనివారం చివరిరోజు. ఈనెల 27న పోలింగ్ జరుగుతుంది. 30న ఓట్లు లెక్కిస్తారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 8426. నాలుగు జిల్లాల్లో ఏకగ్రీవం కాడంతో ఒటర్ల సంఖ్య 5043కు తగ్గింది.