తెలంగాణ

విజయరామారావు టిడిపికి గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయ రామారావు తెలుగు దేశం పార్టీకి గుడ్-బై చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన విజయరామారావు నేడో, రేపో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలాఉండగా గత ఐదు, ఆరు సంవత్సరాలుగా విజయరామారావు తమ పార్టీకి దూరంగా ఉంటున్నారని, కాబట్టి ఇప్పుడు తమ పార్టీ నాయకునిగా పరిగణించడం లేదని తెలుగు దేశం పార్టీ నాయకులు తెలిపారు. 1999 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు న్యూట్రల్స్ పార్టీలో చేరాలంటూ పిలుపు ఇచ్చినప్పుడు ఆయన టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.