తెలంగాణ

భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 11: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు మత్య్సావతారంలో దర్శనం ఇచ్చారు. తొలుత గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామికి ప్రత్యేకారాధనలు చేశారు. అనంతరం అలంకారమూర్తులను మత్స్యావతారంలో అలంకరించి భక్తుల జయజయధ్వానాల మధ్య బేలమండపానికి తీసుకొచ్చారు. అక్కడ దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి అధ్యయనోత్సవాలు నిర్వహించే వేదపండితులు, అర్చకులు, పరిచారకులు, దేవస్థానం సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందజేశారు. స్వామికి విశ్వక్షేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన నిర్వహించాక నాళాయర దివ్య ప్రబంధ పారాయణం, చతుర్వేద విన్నపాలు చేశారు. రాజభోగం అనంతరం స్వామి ఊరేగింపుగా మిథిలాస్టేడియంలోని వేదికపైకి స్వామి చేరుకున్నారు. అక్కడ భక్తులు స్వామిని తిలకించి పులకించారు. ఆరాధన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం వేళ స్వామి రాజాధిరాజ వాహనంపై, పెరియార్ ఆళ్వార్ చలువ చప్పర వాహనంపై తిరువీధి సేవకు బయలుదేరారు. గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుని తిరిగి స్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేకారాధనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.