S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/10/2015 - 07:18

సంగారెడ్డి, డిసెంబర్ 9: పత్తి వ్యాపారి తీసుకువస్తున్న నగదును దోపిడీ చేసిన కేసులో వ్యాపారి వాహనం డ్రైవర్ సూత్రధారికాగా అతని స్నేహితులు పాత్రధారులుగా వ్యవహరించారు. సంచలనం సృష్టించిన లూటీ కేసు మిస్టరీని మెదక్ జిల్లా పోలీసులు 24 గంటలు పూర్తికాకముందే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

12/10/2015 - 07:16

వరంగల్, డిసెంబర్ 9: కృష్ణాజలాల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/10/2015 - 07:15

జహీరాబాద్, డిసెంబర్ 9: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్‌లో ఓ మొసలి బావిలో పడింది. దీనిని గమనించిన స్థానికులు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు బుధవారం బావిని సందర్శించి, మొసలిని బయటికి తీశారు. మొసలిని మంజీరా డ్యాంలో వదిలిపెట్టనున్నట్లు వారు తెలిపారు. మొసలిని చూసేందుకు స్థానికులు చాలా ఉత్సాహాన్ని చూపారు.

12/10/2015 - 07:14

నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: పార్టీల వలసల ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆద్యులు మీరేనని, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆకర్ష్ వంటి అప్రజాస్వామిక పనులు తెలియవని కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/10/2015 - 07:14

షాద్‌నగర్, డిసెంబర్ 9: నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకుని బ్యాంక్‌ను మోసగించిన ఎనిమిది మందిపై మహ బూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఎపిజివిబి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలావున్నాయి.

12/10/2015 - 07:03

భద్రాచలం/చింతూరు, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం వేగితోట గ్రామంలో విల్లంబు, బాణాలు చేతబూనిన గిరిజనుడు భీతావహ వాతావరణం సృష్టించాడు. బుధవారం ఉదయం మతిస్థిమితం లేని ఒక వ్యక్తి విల్లు, అంబులతో వీరంగం సృష్టించాడు. మిడియం ముత్తయ్య బాణాలతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. వివరాలిలావున్నాయి...

12/10/2015 - 06:55

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించిన ఉమ్మడి రాష్ట్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయంగా సమాధి అయ్యారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.

12/10/2015 - 06:06

హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్ యార్డులను జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఎన్‌ఎఎం)తో అనుసంధానం చేయబోతున్నట్టు మార్కెటింగ్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌తో మార్కెట్ యార్డులను అనుసంధానం చేయడం వల్ల రైతు పండించే ధాన్యానికి దేశంలో ఎక్కువ ధర ఎక్కడ ఉంటే ఆ ధరకు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి చెప్పారు.

12/10/2015 - 06:02

హైదరాబాద్, డిసెంబర్ 9: సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా నువ్వా-నేనా అన్నట్లు పోటీ జరుగుతుంది. కానీ స్థానిక సంస్ధల కోటా నుంచి 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో చేతులెత్తేసింది. బిజెపి బరిలోనే లేదు. తెలుగు దేశం పార్టీ 5 స్థానాలకు పోటీ చేయనున్నది.

12/09/2015 - 15:47

కరీంనగర్ : జిల్లాలో నగునూరు గ్రామం వద్ద బుధవారం ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరిది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన పానుగంటి లక్ష్మయ్య(35)గా గుర్తించారు.

Pages