S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2015 - 15:20

వరంగల్‌ : కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే విధంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నదీ జలాల పంపిణీపై ఇప్పటికైనా కేంద్రం స్పందించి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ వాదనలు వినేలా చర్యలు చేపట్టాలని కడియం డిమాండ్‌ చేశారు. న్యాయమైన నీటి వాటా దక్కేంత వరకు కేంద్రంపై న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని చెప్పారు.

12/09/2015 - 07:25

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో కరవు పరిస్థితులను పరిశీలించేందుకు మంగళవారంనాడు పలు జిల్లాల్లో కేంద్రబృందం పర్యటించింది. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కరవు పరిస్థితులను క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించింది. ఆయా జిల్లాల్లో కరవు పరిస్థితులపై త్వరలో కేంద్రప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆ బృందం కన్వీనర్ మహారాజ్‌కుమార్, సభ్యులు ఉత్పల్‌కుమార్‌సింగ్ వెల్లడించారు.

12/09/2015 - 07:24

సంగారెడ్డి, డిసెంబర్ 8: సినిమా ఫక్కీలో 65వ నంబరు జాతీయ రహదారిపై భారీ మొత్తంలో దారిదోపిడీ చోటు చేసుకుంది.

12/09/2015 - 07:23

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: చట్టాలకు విరుద్ధంగా సిఎం కెసిఆర్‌తో పాటు ఆయన తనయుడు కెటిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

12/09/2015 - 07:22

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వపై ఉన్న వంతెనలు, డిస్ట్రిబ్యూటరీలు, అతిధిగృహాల మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పోచారం ప్రాజెక్ట్ ఎడమ బాగాన ఉన్న మహబూబామహేర్ కాల్వ డిస్ట్రిబ్యూటరీని పరిశీలించారు.

12/09/2015 - 07:22

నల్లగొండ రూరల్, డిసెంబర్ 8: సిఎం కెసిఆర్ ప్రజాసంక్షేమాన్ని మరిచి, తాను కష్టపడి అభ్యర్ధులను గెలిపించకుండా డబ్బులతో దగాకోరు రాజకీయా లు చేస్తూ మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివారిని, ఉద్యమకారులను ఇబ్బందులకు గురి చేసిన వారిని, ప్రతిపక్షాల సభ్యులను పార్టీలో చేర్చుకుని కెసి ఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని తెలంగాణ పిసిసి సభ్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీనేత కుందూర్ జానారెడ్డిలు నిప్ప

12/09/2015 - 07:21

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘విభేదాలు విడనాడి చేయి-చేయి కలుపుదాం, సమిష్టిగా ముందుకు సాగు దాం..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ నాయకులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేసి విజయం సాధించి ప్రజలకు ఒక మంచి సంకేతం పంపించాలని భావిస్తున్నారు.

12/09/2015 - 07:21

హైదరాబాద్, డిసెంబర్ 8: కరవు సహాయక చర్యల్లో భాగంగా వలసల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్య లు చేపట్టాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

12/09/2015 - 07:03

భద్రాచలం, డిసెంబర్ 8: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొండగావ్ పోలీసులకు మంగళవారం పెను ముప్పు తప్పింది. మావోయిస్టులు కూంబింగ్ బలగాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన మూడు కిలోల మందుపాతరను సకాలంలో గుర్తించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొండగావ్ జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సమీప గ్రామాల్లో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్తున్న సమయంలో దీన్ని కనుగొన్నారు.

12/09/2015 - 07:00

హైదరాబాద్, డిసెంబర్ 8: ఖమ్మం జిల్లా భద్రాచలం శివారు నూగూరు- వెంకటాపురం గ్రామానికి చెందిన సూర్యకాంతమ్మకు అన్యాయం జరగకుండా చూడాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సూర్యకాంతమ్మ భర్త వెంకట గజపతిరాజు స్వాతంత్ర సమరయోధుడు.

Pages