S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/10/2015 - 11:25

హైదరాబాద్: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 11 మంది చోరులను పోలీసులు అరెస్టు చేశారు. జనం దృష్టి మరల్చి చోరీలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 2 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

12/10/2015 - 11:23

హైదరాబాద్: తెలంగాణ రాజధానిలో 10వేల ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. రసూల్‌పురాలో నిర్మించే 205 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఇదే రోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేస్తున్నట్లు చెప్పారు.

12/10/2015 - 11:23

హైదరాబాద్: హిందువులు అతి పవిత్రంగా భావించే గోవులను సంరక్షించాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులో గురువారం ఉదయం ఆయన గోపూజా మహోత్సవంలో పాల్గొన్నారు. రైతులందరికీ గోవులను ఉచితంగా ఇచ్చి పాడి పంటలు వృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండవని ఆయన అన్నారు.

12/10/2015 - 11:22

హైదరాబాద్: కొన్ని వర్గాల విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించడంతో ఓయులో గురువారం పోలీసులు భారీగా మోహరించారు. హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. క్యాంపస్‌లోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

12/10/2015 - 11:21

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని వర్గాల విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించేందుకు పోలీసులు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గురువారం ఉదయం ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకొని ఓయులో గోపూజ నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఇదివరకే ప్రకటించారు.

12/10/2015 - 11:21

కరీంనగర్: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో వార్డు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి టిఆర్‌ఎస్ అభ్యర్థి స్నేహపై 167 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వార్డు ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ తన స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశమైంది. తమ అభ్యర్థి గెలుపుతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది.

12/10/2015 - 07:36

హైదరాబాద్, డిసెంబర్ 9: ఉన్నత విద్యను అభ్యస్తున్న గిరిజన విద్యార్థుల కోసం వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని గిరిజనాభివృద్థి, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందులాల్ వెల్లడించారు. ఈ హాస్టళ్ల కోసం శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్బాణాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

12/10/2015 - 07:34

హైదరాబాద్, డిసెంబర్ 9: అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 3నుంచి ప్రారంభమైన అవినీతి నిరోధక వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. అవినీతి నిరోధక శాఖ అవినీతిపై తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులను ఏరిపారేసేందుకే ఈ ప్రచారం నిర్వహించినట్టు ఏసిబి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఏకె ఖాన్ తెలిపారు.

12/10/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 9: కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర హైకోర్టు మల్కాజగిరి తహసిల్దార్ సిహెచ్. విజయకు రెండు నెలల జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు బుధవారం వెలువరించారు.

12/10/2015 - 07:32

హైదరాబాద్, డిసెంబర్ 9: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే మెజార్టీ లేకపోయినప్పటికీ బరిలో నిలిచిన ప్రతిపక్షాలు అబాసుపాలు కాకతప్పదని రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు నీతిమాలిన రాజకీయాలకు, లోపాయికారి ఒప్పందాలతో ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన దుయ్యబట్టారు.

Pages