S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/12/2015 - 16:42

హైదరాబాద్: వరంగల్‌ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ సంయుక్త సంచాలకులు రమణారావు తెలిపారు. శనివారం మేడారం జాతరపై ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/12/2015 - 14:18

కరీంనగర్: కరీంనగర్‌లో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు నలుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ వశమయ్యాయి.

12/12/2015 - 13:11

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానం ఏకగీవ్రమైంది. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి ప్రకటించారు.

12/12/2015 - 13:08

మెదక్‌ : నారాయణఖేడ్‌ మండలం నమ్లిమెట్‌లోఅప్పుల బాధ తాళలేక బాగయ్య అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

12/12/2015 - 07:18

భద్రాచలం, డిసెంబర్ 11: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రా రంభమయ్యాయి.

12/12/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రావతరణలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా పోతోంది. పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు పొన్నాల లక్ష్మయ్యను తొలగించి ఉత్తమకుమార్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షులుగా నియమించినా, పార్టీ క్యాడర్‌ను, నేతలనూ చేజారిపోకుండా కాపాడలేకపోతున్నారు.

12/12/2015 - 06:20

హైదరాబాద్, డిసెంబర్ 11: జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలను చేపట్టాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయాధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది.

12/12/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 11: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నారా లోకేష్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిడిపి బలంగా ఉన్నందున మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామన్న ధీమాను లోకేష్ వ్యక్తం చేశారు.

12/12/2015 - 06:17

హైదరాబాద్, డిసెంబర్ 11:గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తుందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జనవరి మూడవ వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా వెల్లడించారు.

12/12/2015 - 06:17

హైదరాబాద్, డిసెంబర్ 11: సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్థన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఎస్పీ కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ కనకదుర్గను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే డిఎస్పీ మురళీధర్‌పై శుక్రవారం బదిలీ వేటు పడింది.

Pages