S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/17/2015 - 06:33

హైదరాబాద్, డిసెంబర్ 16: నగరంలోని ప్రఖ్యాత గండిపేట జలాశయం చుట్టూ ప్రత్యేకంగా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు తాగు, సాగునీటిని అందించే చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు పునరుద్ఘాటించారు. నగరంలోని హుస్సేన్‌సాగర్ చెరువు ప్రక్షాళన పనులను ఆయన బుధవారం తనిఖీ చేశారు.

12/17/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 16: రాష్ట్రం లో నిత్యావసర సరుకులు దారిమళ్లింపు, నిల్వ కేంద్రాలు, వాటి వ్యాపార కార్యకలాపాలపై నిఘా ఉంచి పర్యవేక్షించేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం నిల్వలు, మిల్లు పాయింట్లు, సిఎంఆర్ డెలివరీ వంటి వాటిపై నిఘా ఉంచేందుకు కూడా టాస్క్ఫోర్స్ పని చేయాలని సూచించింది.

12/17/2015 - 06:29

సికింద్రాబాద్, హైదరాబాద్, డిసెంబర్ 16: గాంధీ ఆస్ప్రత్రిలో అప్పుడే పుట్టిన శిశువును అపహరించేందుకు ఓ మహిళ ప్రయత్నించగా ఇద్దరు ఆటోడ్రైవర్లు అడ్డుకున్నారు. ఆ మహిళను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

12/17/2015 - 05:47

హైదరాబాద్, డిసెంబర్ 16: ‘దేశంలో ఎవరూ తలపెట్టని విధంగా అయుత చండీయాగం మహత్కార్యాన్ని ముఖ్యమంత్రి తలకెత్తుకోవడం చరిత్రలో మొదటిసారి. ఈ యాగ ఫలంతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది’ అని శృంగేరి పిఠాధిపతి భారతీతీర్థస్వామి సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదించారు. 23 నుంచి నిర్వహించనున్న అయుత చండీయాగానికి కెసిఆర్ సతీసమేతంగా బుధవారం కర్నాటకలోని శృంగేరి మఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీతీర్థస్వామిని ఆహ్వానించారు.

12/17/2015 - 05:43

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో కొత్తగా ఐదు మున్సిపాల్టీలఏర్పాటుకు సిఎం కెసిఆర్ అమోదం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు అధికార వర్గాల సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు మున్సిపాల్టీలలో మీర్‌పేట, జల్‌పల్లి, జిల్లెలగూడెం, బోడుప్పల్, ఫిర్జాదిగూడ ఉన్నాయి. ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి.

12/16/2015 - 11:52

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో ప్రవేశించేందుకు ఓ ఉన్మాది విఫలయత్నం చేయడం కలకలం సృష్టించింది. హాస్టల్ గోడ ఎక్కి ఆ వ్యక్తి దుస్తులు విప్పేసి అసభ్యకరంగా ప్రవర్తించటంతో అక్కడి మహిళలు భయాందోళనలకు లోనయ్యారు. ఈ సంఘటనపై హాస్టల్‌లో ఉంటున్న మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/16/2015 - 11:50

సికిందరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును కిడ్నాప్ చేసేందుకు ఓ మహిళ ప్రయత్నించిన సంఘటన బుధవారం ఉదయం ఇక్కడి గాంధీ ఆస్పత్రిలో జరిగింది. ఆపరేషన్ థియేటర్‌లో శిశువును అపహరించి ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న మేరీ అనే మహిళను అక్కడి వారు అనుమానించి పట్టుకున్నారు. సమాచారం అందడంతో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు.

12/16/2015 - 11:49

నిజామాబాద్: మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ ఎటిఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి వాహనంలో పరారవుతున్న దొంగలపై నిజామాబాద్ జిల్లా మెంగారం వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. ఐతే సురక్షితంగా తప్పించుకొన్న దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు. మెదక్ జిల్లా కోటగిరిలోని ఓ ఎటిఎంలో దొంగలు ప్రవేశించి దోపిడీకి విఫలయత్నం చేశారు.

12/16/2015 - 07:44

హైదరాబాద్, డిసెంబర్ 15: బిజెపి, టిడిపి నాయకులకు దమ్ముం టే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే విధం గా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని టిఆర్‌ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం రవి విలేఖరులతో మాట్లాడారు.

12/16/2015 - 07:43

పెన్‌పహాడ్, జఫర్‌గడ్, చిట్యాల, అమ్రాబాద్, డిసెంబర్ 15: అప్పుల బాధలు అన్న దాతల ఉసురు తీస్తూనే ఉన్నాయ. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మం గళవారం నలుగురు రైతులు ఆత్మహ త్య చేసుకొన్నారు.

Pages