తెలంగాణ

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: బిజెపి, టిడిపి నాయకులకు దమ్ముం టే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే విధం గా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని టిఆర్‌ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం రవి విలేఖరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గకరణ కోసం ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేస్తూ వర్గీకరణపై కపట ప్రేమ చూపుతున్నారని అన్నా రు. కేంద్రంలో ఉన్నది బిజెపి, టిడిపి ప్రభుత్వమే కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టేట్టు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు టిఆర్‌ఎస్ కట్టుబడి ఉందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై టిఆర్‌ఎస్ ప్రభు త్వం తీర్మానం కూడా చేసిందని రవి గుర్తు చేశారు. కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దేశాన్ని పాలిస్తున్నది తమ పార్టీ నాయకుడే అనే విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న బిజెపికి పార్లమెంటులో బిల్లు పెట్టాల్సిన బాధ్యత ఉందని అన్నారు.