తెలంగాణ

గండిపేట చుట్టూ ప్రత్యేక ట్రాక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: నగరంలోని ప్రఖ్యాత గండిపేట జలాశయం చుట్టూ ప్రత్యేకంగా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు తాగు, సాగునీటిని అందించే చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు పునరుద్ఘాటించారు. నగరంలోని హుస్సేన్‌సాగర్ చెరువు ప్రక్షాళన పనులను ఆయన బుధవారం తనిఖీ చేశారు. మురుగునీరు చెరువులోకి చేరుకుండా మళ్లించేందుకు వీలుగా హోటల్ మారియేట్ వద్ధ నిర్మిస్తున్న భారీ పైప్‌లైన్ నిర్మాణ పనులను ఆయన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ‘లేక్స్ సిటీ’గా నగరానికి ఉన్న పేరును నిలబెట్టేందుకు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టినట్లు వివరించారు. మురుగునీరు మళ్లింపు పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు నెలల్లో పూర్తి కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హుస్సేన్‌సాగర్‌లో నిర్మిస్తున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను
పరిశీలిస్తున్న తెలంగాణ మంత్రులు కెటిఆర్, తలసాని