తెలంగాణ

నిత్యావసరాల దారిమళ్లింపు, నిల్వలపై పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: రాష్ట్రం లో నిత్యావసర సరుకులు దారిమళ్లింపు, నిల్వ కేంద్రాలు, వాటి వ్యాపార కార్యకలాపాలపై నిఘా ఉంచి పర్యవేక్షించేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం నిల్వలు, మిల్లు పాయింట్లు, సిఎంఆర్ డెలివరీ వంటి వాటిపై నిఘా ఉంచేందుకు కూడా టాస్క్ఫోర్స్ పని చేయాలని సూచించింది. విశ్రాంత పోలీసు సూపరింటెండెంట్, విశ్రాంత వాణిజ్యపన్నుల శాఖ అధికారి, విశ్రాంత డిఎస్పీ ర్యాంక్ అధికారితో కూడిన టాస్క్ఫోర్స్‌ను ప్రభుత్వం నియమించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా పాలిష్ చేసి విక్రయిస్తున్నారని, కందిపప్పు, పంచదార వంటి వాటిని పౌరసరఫరాల శాఖ నుంచి దారిమళ్లించి కొందరు అవినీతి పరులు బయటకు విక్రయిస్తున్నారని వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వం చెక్‌పెట్టేందుకు ఈ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వ్యాపారులు భారీగా నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచిన వైనం బయటపడ్డంతో ఆ దిశగా ప్రభుత్వం అక్రమాలను అరికట్టేందుకు వీలుగా ఈ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటించి తనిఖీలు చేసినప్పుడు అక్కడ ఉన్న స్థానిక యంత్రాంగం సహకరించడంతో పాటు కేసులు నమోదుకు సహకరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

దేవాదాయ శాఖలో..

ఐదుగురు అధికారుల బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన
తెలంగాణ సర్కార్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ పరిపాలనాపరమైన అవసరాల రీత్యా వెంటనే వీరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ కమినర్ ఎం.రామకృష్ణారావును ఖాళీగా ఉన్న కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానానికి బదిలీ చేసింది. జాయింట్ కమిషనర్, విజిలెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎం.ఎం.డి.కృష్ణవేణిని హైదరాబాద్ రీజనల్ జాయింట్ కమినర్‌గా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న ఇ.శ్రీనివాస్‌ను జాయింట్ కమిషనర్, విజిలెన్స్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న పి.శ్రీనివాస్‌రెడ్డికి కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ (సర్వీసెస్) విభాగానికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మెదక్ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న డి.కృష్ణప్రసాద్‌ను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఈ ఉత్తర్వుల మేరకు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.