తెలంగాణ

యాగంతో అంతా శుభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ‘దేశంలో ఎవరూ తలపెట్టని విధంగా అయుత చండీయాగం మహత్కార్యాన్ని ముఖ్యమంత్రి తలకెత్తుకోవడం చరిత్రలో మొదటిసారి. ఈ యాగ ఫలంతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది’ అని శృంగేరి పిఠాధిపతి భారతీతీర్థస్వామి సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదించారు. 23 నుంచి నిర్వహించనున్న అయుత చండీయాగానికి కెసిఆర్ సతీసమేతంగా బుధవారం కర్నాటకలోని శృంగేరి మఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీతీర్థస్వామిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారతీతీర్థస్వామి యాగం నిర్విఘ్నంగా, ప్రశాంతంగా, పవిత్రంగా జరగాలని ఆశీర్వదించారు. యాగం చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యమని కొనియాడారు. ఈ యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని స్వామిజీ ఆకాంక్షించారు. యాగంలో పాల్గొనే రుత్విజులు అంకితభావం, చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన సిఎం, అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు శృంగేరికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి దంపతులకు పీఠం సిఇఓ గౌరిశంకర్ స్వాగతం పలికారు. తర్వాత ముఖ్యమంత్రి దంపతులు పీఠాధిపతికి ఫలపుష్పాలు, నూతన వస్త్రాలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత శారదాదేవితో పాటు ఆది శంకరాచార్య, శక్తిగణపతి, తోరణ గణపతి దేవాలయాలను దర్శించుకున్నారు. భావి పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ, పేషికార్ శివశంకర్ భట్, మఠం అధికారులు సిఎం దంపతులకు వీడ్కోలు పలికారు.

చిత్రం... భారతీతీర్థస్వామికి చండీయాగం ఆహ్వానపత్రం అందిస్తున్న కెసిఆర్ దంపతులు