తెలంగాణ

రుచికకు సాహస బాలిక అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, డిసెంబర్ 11: గత 18 నెలల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట శివారులో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు విద్యార్థులను రక్షించినందున వెంకటాయపల్లికి చెందిన రుచిక (7) సాహస బాలిక అవార్డుకు ఎంపికైందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్‌వెల్ఫేర్ అధ్యక్షురాలు గీతా సిద్ధార్థ లేఖ పంపినట్లు రుచిక తండ్రి మల్లాగౌడ్ తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా సాహస బాలిక అవార్డు అందజేస్తామని న్యూఢిల్లీకి రావాల్సిందిగా లేఖ పంపినట్లు ఆయన చెప్పారు.