తెలంగాణ

టార్గెట్ 400టిఎంసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: గోదావరిపై నిర్మించనున్న ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ కోసం వ్యాప్కోస్ నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే నివేదిక ప్రభుత్వానికి అందడంతో ఇక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. వచ్చే బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించి రీ-డిజైనింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులను మొదటి దశలో చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ద్వారా గోదావరిలో దాదాపు 400 టిఎంసిల నీటిని వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే ప్రభుత్వానికి వ్యాప్కోస్ డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సమర్పించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేంద్ర జల సంఘం మొదలుకొని పర్యావరణం వరకు అనుమతులను సాధించడం అనేది అత్యంత క్లిష్టమైన సమస్య. ఈ కారణంగానే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు దశాబ్దాలు గడిచిన పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం. నదీ జలాల ట్రిబ్యునళ్ళ తీర్పులు, కోర్టు, అంతరాష్ట్ర వివాదాలకు అతీతంగా సిడబ్ల్యూసి, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు పొందడానికి సాంకేతికపరంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌కు వ్కాప్కోస్ నివేదికలు అనుకూలంగా ఉండటంతో బడ్జెట్ సమావేశాల్లో వీటికి సరిపడా నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వ్యాప్కోస్ రూపొందించిన రీ-డిజైనింగ్ ప్రాతిపదనలు కేంద్రానికి వెళ్ళకముందే ఇతర రాష్ట్రాలతో ముడిపడివున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సిఎం కెసిఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తున్నారు. రీ-డిజైనింగ్ వల్ల డ్యామ్‌ల నిర్మాణంలో మార్పులు, ఎత్తుల్లో చేర్పులు, మార్పులు, నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసానికి ఎగువ రాష్ట్రాల ప్రతిపాదనలకు అనుకూలంగా ముందుగానే ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్కోస్ డిపిఆర్‌లకు జతచేసి పంపేలా ప్రయత్నాలు చేస్తోంది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌కు ఎగువ రాష్ట్రాల నుంచి సానుకూల వాతావరణం ఉండటం వల్ల సాంకేతికపరమైన అనుమతుల కోసం వేచిచూడకుండా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇలాఉండగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ వల్ల 400 టిఎంసిల నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి జలాల్లో తెలంగాణ 953 టిఎంసిల నీటి వాడుకునే అవకాశం కలిగిఉంది. వీటిలో ఇప్పటికే 433 టిఎంసిల నీటిని వినియోగించుకునే ప్రాజెక్టులు ఉండగా, మిగిలిన 521 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోనే రాష్ట్రంలో దాదాపు సగం నియోజకవర్గాలు ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 54 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో నాలుగు నియోజకవర్గాలు అర్బన్ నియోజక వర్గాలను మినహాయించి 50 నియోజకవర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గోదావరిపై నిర్మించిన శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్, కడెం వంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మిగతా 40 లక్షల ఎకరాలకు 400 టిఎంసిల నీటిని అందించేలా ప్రాజెక్టులకు ప్రభుత్వం రీ-డిజైనింగ్ చేయించింది. వీటిలో ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల (తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు) దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టులు అన్నింటికి కలిపి 400 టిఎంసిలు వినియోగించుకునే సామర్థ్యంతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.